Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..
Infinix Hot 70 Pro 5G | మొబైల్స్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు వెనుకవైపు ఇంటరాక్టివ్ లైటింగ్ డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే ప్రత్యేక హార్డ్‌వేర్ ఫీచర్లను సైతం ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ కేవలం 7.99 మిల్లీమీటర్ల మందంతో అత్యంత స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంది.
Technology | Published On Sep 4, 2026, 5.03 pm IST
Infinix Hot 70 Pro 5G | మొబైల్స్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు వెనుకవైపు ఇంటరాక్టివ్ లైటింగ్ డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే ప్రత్యేక హార్డ్‌వేర్ ఫీచర్లను సైతం ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ కేవలం 7.99 మిల్లీమీటర్ల మందంతో అత్యంత స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంది. అందువల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. దీనికి ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా ఇచ్చారు. వెనుక ప్యానెల్‌పై ప్రత్యేక ఏఎంసీని ఏర్పాటు చేసింది. దీన్ని కంపెనీ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్‌గా పిలుస్తోంది. ఇది యాంబియంట్ లైటింగ్ యానిమేషన్లు, ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, కౌంట్ డౌన్‌లు, చార్జింగ్ స్టేటస్, గేమింగ్ తదితర సందర్భాల్లో నోటిఫికేషన్లను చూపిస్తుంది. ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఔట్ డోర్‌లో గరిష్టంగా 910 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5జి ప్రాసెసర్‌ను ఇచ్చారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఎన్‌ఎఫ్‌సీ, స్టోరేజ్‌ను పెంచుకునేందుకు ప్రత్యేక మైక్రోఎస్‌డీ స్లాట్ కూడా ఉన్నాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక కెమెరాకు 2ఎక్స్ ఇన్ సెన్సార్ లాస్‌లెస్ జూమ్ ఫీచర్ ఉంది. అందువల్ల ఫొటోలు పగిలిపోకుండా వస్తాయి. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. దీనికి 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 10 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇన్ఫినిక్స్ మూడు ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని ప్రకటించింది.
ధర ఎంతంటే..
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి ఫోన్‌ను సిల్క్ గ్లో పర్పుల్, డైవ్ బ్లూ, థర్మో ఆరెంజ్, మిరాజ్ గ్రీన్ రంగుల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ, 128జీబీ వేరియంట్ ధరను రూ.24,999గా నిర్ణయించారు. 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించనున్నారు. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై ఫ్లాట్ రూ.2వేల డిస్కౌంట్ లభిస్తుంది. లేదా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే వినియోగదారులకు రూ.2వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
సంబంధిత వార్తలు

vivo Y31t 5G | 7200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. మిడ్ రేంజ్ విభాగంలో బెస్ట్..
ఆగస్టు 31, 2026

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
ఆగస్టు 26, 2026

boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే... మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?
- ●Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు - తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్
- ●SEBI | డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరలపై సెబీ కీలక సమీక్ష.. వారం రోజుల్లో మార్పులు..?
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం
- ●BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
- ●Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే... మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?

Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు - తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్

SEBI | డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరలపై సెబీ కీలక సమీక్ష.. వారం రోజుల్లో మార్పులు..?

Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం



