త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iQOO Z11xa 5G | ఐక్యూ జ‌డ్11ఎక్స్‌ఏ 5జి వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..

iQOO Z11xa 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ ఐక్యూ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఐక్యూ జ‌డ్11ఎక్స్‌ఏ 5జి ని భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ 120 హెడ్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీగా ఉంటుంది. ముందు వైపు పంచ్ హోల్‌లో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

S

Technology | Published On Sep 7, 2026, 3.36 pm IST

iQOO Z11xa 5G | ఐక్యూ జ‌డ్11ఎక్స్‌ఏ 5జి వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..
Advertisement

iQOO Z11xa 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ ఐక్యూ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఐక్యూ జ‌డ్11ఎక్స్‌ఏ 5జి ని భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ 120 హెడ్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీగా ఉంటుంది. ముందు వైపు పంచ్ హోల్‌లో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ట‌ర్బో ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌, 4 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 7200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఇచ్చారు. దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఉంది. అలాగే ఐపీ68, ఐపీ69 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

మిలిట‌రీ గ్రేడ్ మ‌న్నిక‌..

ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేకు 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌లో లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్ స‌పోర్ట్ ఉంది. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, స్టీరియో స్పీక‌ర్లు, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు.

ధ‌ర వివ‌రాలు..

ఐక్యూ జ‌డ్‌11ఎక్స్ఏ 5జి ఫోన్‌ను టైటాన్ బ్లాక్‌, ప్రిస్మాటిక్ గ్రీన్ రంగుల్లో లాంచ్ చేయ‌గా, ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధ‌ర రూ.28,999గా ఉంది. అమెజినా ఇండియా, ఐక్యూ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ఈ ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 14 నుంచి విక్ర‌యించ‌నున్నారు. లాంచ్ ఆఫ‌ర్‌ల‌లో భాగంగా ఈ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.1500 వ‌ర‌కు కూప‌న్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అదే ఐక్యూ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేస్తే బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తారు. 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ఉంది.

Advertisement
Advertisement