త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme P4R 5G | 8000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియ‌ల్‌మి కొత్త ఫోన్‌.. అదిరిపోయే డిస్‌ప్లే, ఏఐ ఫీచ‌ర్లు..

realme P4R 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి భారత మార్కెట్లో తన తాజా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి పి4ఆర్ 5జిని అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, మెరుగైన కూలింగ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను అందించింది.

S

Technology | Published On Jun 10, 2026, 1.28 pm IST

realme P4R 5G  | 8000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియ‌ల్‌మి కొత్త ఫోన్‌.. అదిరిపోయే డిస్‌ప్లే, ఏఐ ఫీచ‌ర్లు..
Advertisement

realme P4R 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి భారత మార్కెట్లో తన తాజా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి పి4ఆర్ 5జిని అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, మెరుగైన కూలింగ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన టైటాన్ బ్యాటరీని అమర్చారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.88 మిల్లీమీటర్లు మాత్రమే కాగా, బరువు 224 గ్రాములుగా ఉంది. బ్యాటరీ ఆరోగ్యం దీర్ఘకాలం నిల్వ ఉండేలా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు. 1,600 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా 80 శాతం కంటే ఎక్కువ బ్యాటరీ హెల్త్ కొనసాగుతుందని రియల్‌మి చెబుతోంది. ఈ ఫోన్‌లో 45వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. అలాగే గేమింగ్ సమయంలో వేడి తగ్గించేందుకు బ్యాటరీని పక్కనపెట్టి నేరుగా మదర్‌బోర్డ్‌కు పవర్ సరఫరా చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

ప‌వ‌ర్‌ఫుల్ ఏఐ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌లో వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్, ఏఐ లాంగ్ లైఫ్ ఆల్గోరిథమ్, ఏఐ నైట్ ఛార్జింగ్ మోడ్, ఏఐ కోల్డ్ ఛార్జింగ్ మోడ్ వంటి ఫీచర్ల‌ను ఇచ్చారు. ఇవి బ్యాటరీ పనితీరు, జీవితకాలాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. కాగా ఈ ఫోన్ 48 నెలల ఫ్లూయెన్సీ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని, ఎక్స్‌టెండెడ్ యూజ్ కేర్ ద్వారా సిస్టమ్ స్మూత్‌నెస్ 20 శాతం వరకు పెరుగుతుందని, 2 సంవత్సరాల సిస్టమ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందిస్తామ‌ని తెలిపింది. ఈ ఫోన్‌లో ప్ర‌త్యేకంగా వేపర్ చాంబర్ కూలింగ్ ను ఇచ్చారు. దీనికి వన్ ట్యాప్ కూలింగ్ ఫీచర్ ను కూడా అందించారు. దీని వ‌ల్ల గేమ్స్ ఆడే స‌మ‌యంలో లేదా వీడియోల‌ను చూసే స‌మ‌యంలో ఫోన్ అతిగా హీట్ అవ‌కుండా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.8 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చినందున డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఔట్‌డోర్ విజిబిలిటీ కోసం 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

ఈ ఫోన్‌ను మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌తో రూపొందించారు. ఐపీ 65 డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. వెనుక వైపు 50ఎంపీ మెయిన్ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5జి సపోర్ట్, బ్లూటూత్ 5.3, వై-ఫై ఏ, యూఎస్‌బీ టైప్-సీ, 1115 అల్ట్రా లీనియర్ స్పీకర్, 400% అల్ట్రా వాల్యూమ్ మోడ్, మైక్రో ఎస్‌డీ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్ విస్తరణ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌ను టైటానియం గ్లేర్‌, సిల్వ‌ర్ గ్లేర్‌, లావెండ‌ర్ గ్లేర్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.18,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.20,999గా ఉంది. 6జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.22,999గా నిర్ణ‌యించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. అలాగే 3 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ఉంది. ఈ నెల 17 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, రియ‌ల్‌మి ఇండియా ఆన్ లైన్ స్టోర్‌, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement