త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme Narzo Super Saver Days sale | రియ‌ల్‌మి నార్జో సూప‌ర్ సేవ‌ర్ డేస్ సేల్‌.. ఫోన్ల‌పై డిస్కౌంట్లు..

realme Narzo Super Saver Days sale | మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి వినియోగ‌దారుల కోసం నార్జో సూప‌ర్ సేవ‌ర్ డేస్ సేల్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపింది. నార్జో సిరీస్‌కు చెందిన ఫోన్ల‌పై ఈ సేల్‌లో డిస్కౌంట్ల‌ను, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలియ‌జేసింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని పేర్కొంది.

S

Technology | Published On Feb 21, 2026, 7.31 am IST

realme Narzo Super Saver Days sale | రియ‌ల్‌మి నార్జో సూప‌ర్ సేవ‌ర్ డేస్ సేల్‌.. ఫోన్ల‌పై డిస్కౌంట్లు..
Advertisement

realme Narzo Super Saver Days sale | మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి వినియోగ‌దారుల కోసం నార్జో సూప‌ర్ సేవ‌ర్ డేస్ సేల్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపింది. నార్జో సిరీస్‌కు చెందిన ఫోన్ల‌పై ఈ సేల్‌లో డిస్కౌంట్ల‌ను, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలియ‌జేసింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. అమెజాన్‌తోపాటు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ సేల్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సేల్‌లో భాగంగా ప‌లు నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్ల‌పై బ్యాంకు డిస్కౌంట్ల‌తోపాటు ఇత‌ర ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. నార్జో 90, నార్జో 90 ఎక్స్‌, నార్జో 80 ప్రొ, 80 లైట్ 5జి, 80 లైట్ 4జి ఫోన్ల‌పై ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని రియ‌ల్‌మి తెలిపింది.

త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్న ఫోన్లు ఇవే..

ఈ సేల్‌లో భాగంగా రియ‌ల్‌మి నార్జో 90ఎక్స్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ+128జీబీ మోడ‌ల్‌ను రూ.13,999కు అందిస్తున్నారు. ఈ ఫోన్ అస‌లు ధ‌ర రూ.15,499గా ఉంది. అలాగే 8జీబీ+128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.16,999 ఉండ‌గా, రూ.15,499కు దీన్ని కొన‌వచ్చు. దీనిపై రూ.1వేయి బ్యాంకు ఆఫ‌ర్‌ను, రూ.500 కూప‌న్‌ను ఇస్తున్నారు.

రియ‌ల్‌మి నార్జో 90 ఫోన్‌కు చెందిన 6జీబీ+128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.16,999 ఉండ‌గా, దీన్ని రూ.15,999కు ఇస్తున్నారు. 8జీబీ+128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.18,499గా ఉంది. రూ.17,499కు దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌పై సేల్‌లో రూ.1వేయి కూప‌న్ ల‌భిస్తోంది.

రియ‌ల్‌మి నార్జో 80 ప్రొ ఫోన్‌కు చెందిన 8జీబీ+128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.17,999 ఉండ‌గా, రూ.16,999కు ఇప్పుడు ల‌భిస్తోంది. 8జీబీ+256జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.19,999 ఉండ‌గా, దీన్ని రూ.18,999కు ఇస్తున్నారు. 12జీబీ+256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.21,999 ఉండ‌గా దీన్ని రూ.20,999కు కొన‌వ‌చ్చు. ఈ ఫోన్‌పై రూ.1వేయి బ్యాంకు ఆఫ‌ర్‌, రూ.1వేయి కూప‌న్ ఇస్తున్నారు.

రియ‌ల్‌మి 80 లైట్ 5జి ఫోన్‌కు చెందిన 4జీబీ+128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.11,999 ఉండ‌గా, దీన్ని రూ.10,499కు సొంతం చేసుకోవచ్చు. 6జీబీ+128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, దీన్ని రూ.12,499కు ఇస్తున్నారు. ఈ ఫోన్‌ల‌పై రూ.500 నుంచి రూ.1500 వ‌ర‌కు కూప‌న్‌ను ఇస్తున్నారు.

రియ‌ల్‌మి 80 లైట్ 4జి ఫోన్‌కు చెందిన 4జీబీ+64జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.8,499 ఉండ‌గా దీన్ని ఇప్పుడు రూ.7,999కు అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై రూ.500 కూప‌న్ ల‌భిస్తోంది.

Advertisement
Advertisement