realme NARZO Days Sale | రియల్‌మి నార్జో డేస్ సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
realme NARZO Days Sale | మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నార్జో డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఏప్రిల్ 27 వరకు అమెజాన్‌లో కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి తన నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలు, ఇతర ఆఫర్లను అందిస్తోంది.
Technology | Published On Apr 24, 2026, 12.19 pm IST
realme NARZO Days Sale | మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నార్జో డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఏప్రిల్ 27 వరకు అమెజాన్‌లో కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి తన నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలు, ఇతర ఆఫర్లను అందిస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను సైతం అందుబాటులో ఉంచింది. ఈ సేల్‌లో రియల్‌మి నార్జో 80, నార్జో 90, నార్జో 90ఎక్స్ ఫోన్ మోడల్స్‌పై రూ.1వేయి కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక నార్జో పవర్ ఫోన్‌పై రూ.1వేయి కూపన్ డిస్కౌంట్‌తోపాటు మరో రూ.1వేయి బ్యాంక్ ఆఫర్, 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఇచ్చారు.
మెరుగైన బ్యాటరీ బ్యాకప్ కావాలంటే..
సేల్ లో భాగంగా రియల్‌మి నార్జో సిరీస్‌లోని పలు ఇతర స్మార్ట్ ఫోన్లు తగ్గింపు ధరలకే అందుబాటులో ఉన్నాయి. నార్జో 80 లైట్ 4జి తగ్గింపు అనంతరం రూ.8,999కే అందుబాటులో ఉండగా, నార్జో 80 లైట్ 5జి రూ.11,999కి, నార్జో 80ఎక్స్ రూ.12,999 కి, నార్జో ఎన్100 లైట్ రూ.13,499కి, నార్జో 13 ప్లస్ రూ.20,999కి అందుబాటులో ఉన్నాయి. మెరుగైన బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రియల్‌మి ఈ ఫోన్లపై ఆఫర్లను అందిస్తోంది.
రియల్‌మి నార్జో పవర్ 5జి ఫోన్‌లో..
రియల్‌మి నార్జో పవర్ 5జి ఫోన్‌లో ఏకంగా 10,001 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండగా, నార్జో 90ఎక్స్ ఫోన్ ను సేల్‌లో అందుబాటులో ఉంచిన మొదటి రోజే ఏకంగా 1 లక్ష యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. ఇక నార్జో 80, 90 సిరీస్ ఫోన్లలో పలు భిన్న రకాల వేరియెంట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఇవి రోజువారీ సాధారణ పనులకు ఎంతో ఉపయుక్తంగా ఉండడంతోపాటు అధిక బ్యాటరీ బ్యాకప్‌ను, లైఫ్‌ను ఇస్తాయని కంపెనీ చెబుతోంది.
సంబంధిత వార్తలు

realme NARZO 100x 5G | రియల్మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..
జులై 15, 2026

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026

Smart Phones | స్మార్ట్ ఫోన్లలో దృఢమైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగదారులు.. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..
జులై 13, 2026
తాజావార్తలు
- ●Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గస్..!
- ●ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం
- ●KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ●KTR | ఇంకెవరో టీఆర్ఎస్ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్
- ●Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
- ●Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్

Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గస్..!

ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR | ఇంకెవరో టీఆర్ఎస్ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్



