త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iQOO Z11 Lite | ఐక్యూ జ‌డ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..

iQOO Z11 Lite | మొబైల్స్ త‌యారీ సంస్థ ఐక్యూ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఐక్యూ జ‌డ్‌11 లైట్ 5జిని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌గా, ఈ ఏడాదిలో త‌న సెగ్మెంట్‌లోనే అత్యంత ప్ర‌కాశ‌వంత‌మైన డిస్‌ప్లే క‌లిగిన ఫోన్ ఇదేన‌ని కంపెనీ తెలిపింది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చినందున చాలా క్వాలిటీగా ఉంటుంది.

S

Technology | Published On Jul 25, 2026, 3.40 pm IST

iQOO Z11 Lite | ఐక్యూ జ‌డ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..
Advertisement

iQOO Z11 Lite | మొబైల్స్ త‌యారీ సంస్థ ఐక్యూ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఐక్యూ జ‌డ్‌11 లైట్ 5జిని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌గా, ఈ ఏడాదిలో త‌న సెగ్మెంట్‌లోనే అత్యంత ప్ర‌కాశ‌వంత‌మైన డిస్‌ప్లే క‌లిగిన ఫోన్ ఇదేన‌ని కంపెనీ తెలిపింది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చినందున చాలా క్వాలిటీగా ఉంటుంది. 6.74 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండ‌గా దీనికి హెచ్‌డీ ప్ల‌స్ రిజల్యూష‌న్‌ను ఇచ్చారు. 1200 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇందులో ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 6జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. ర్యామ్‌ను అద‌నంగా మ‌రో 6జీబీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్‌గా పెంచుకునే వీలు క‌ల్పించారు. దీంతో ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా ప‌నిచేస్తుంది.

నాన్ స్టాప్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌ను మిలిట‌రీ గ్రేడ్ డ్యూర‌బిలిటీతో త‌యారు చేసినందున చాలా దృఢ‌మైన నిర్మాణాన్ని క‌లిగి ఉంటుంది. అలాగే ఐపీ65 డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను కూడా ఇచ్చారు. ఈ ఫోన్‌లో కంపెనీ నాన్ స్టాప్ ఇంటెలిజెన్స్ పేరుతో ప‌లు ఏఐ ఫీచ‌ర్ల‌ను అందించింది. ఏఐ క్రియేష‌న్ ద్వారా టెక్స్ట్ రాయడం, కంటెంట్ రూపొందించడం, సమ్మరీలు తయారు చేయడం సులభం అవుతుంది. ఏఐ క్యాప్షన్స్ ఫీచర్‌తో ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేసి వెంటనే టెక్స్ట్ సమ్మరీలను పొందవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6తో ప‌నిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్ సెన్సార్‌ను ఇచ్చారు. మ‌రో 0.08 మెగాపిక్స‌ల్ సెకండరీ కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు.

భారీ బ్యాట‌రీ..

6500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 37 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో 4జీబీ, 6జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్లు ల‌భిస్తున్నాయి. మైక్రోఎస్‌డీ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌కు రెండు ప్ర‌ధాన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్ల‌ను, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ల‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్-సి, బ్లూటూత్ 5.4, డ్యూయల్ 4జి వీవోఎల్టీఈ, 5జి, వై-ఫై ఏసీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఐక్యూ జ‌డ్11 లైట్ ఫోన్ ను మిడ్‌నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్ రంగుల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.19,499 ఉండ‌గా, 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.21,499గా ఉంది. అలాగే 6జీబీ, 256జీబీ వేరియంట్ ధరను రూ.24,499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 30 నుంచి అమెజాన్, ఐక్యూ ఇండియా ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ల‌భ్యం కానుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఐక్యూ ఈ-స్టోర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో కూడా రూ.1,500 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

Advertisement
Advertisement