realme NARZO 100 Lite 5G | భారీ బ్యాటరీ, ప్రత్యేక కూలింగ్ సిస్టమ్.. బడ్జెట్ ధరకే రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
realme NARZO 100 Lite 5G | మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్ ఫోన్ నార్జో100 లైట్ 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నార్జో సిరీస్‌లో రియల్‌మి రిలీజ్ చేసిన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కాగా, ఇందులో పలు అద్బుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా చాలా తక్కువగానే ఉండడం విశేషం.
Technology | Published On Apr 14, 2026, 1.55 pm IST
realme NARZO 100 Lite 5G | మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్ ఫోన్ నార్జో100 లైట్ 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నార్జో సిరీస్‌లో రియల్‌మి రిలీజ్ చేసిన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కాగా, ఇందులో పలు అద్బుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా చాలా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లేను స్పష్టంగా వీక్షించేలా దానికి 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. అలాగే ప్రత్యేక వీసీ కూలింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. దీని వల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు.
మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో..
ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత రియల్‌మి యూఐ 7.0 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌కు ఐపీ64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. అలాగే మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో రూపొందించారు కనుక ఫోన్ బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. అంత సులభంగా పగలదు. దీంతోపాటు ఫోన్‌కు ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్‌ను కూడా ఇచ్చారు.
భారీ బ్యాటరీ, బైపాస్ చార్జింగ్..
ఈ ఫోన్లో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఫోన్‌ను సాధారణంగా వాడితే 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే బైపాస్ చార్జింగ్ అనే మరో ఫీచర్ కూడా ఉంది. దీని వల్ల ఫోన్ చార్జర్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు బ్యాటరీ 100 శాతం చార్జింగ్ పూర్తయితే బ్యాటరీని వినియోగించుకోకుండా ఫోన్ నేరుగా విద్యుత్ నే వాడుకుంటూ పనిచేస్తుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరగడంతోపాటు ఫోన్ హీట్‌కు గురి కాకుండా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌కు కింది వైపు బాట్ పోర్టెడ్ స్పీకర్‌ను ఇచ్చారు. దీన్ని ఫోన్‌లో ఉండే సెట్టింగ్స్ ద్వారా వాల్యూమ్‌ను 300 శాతం వరకు పెంచుకునే వీలు కల్పించారు.
ధర వివరాలు..
4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. ఇక ఈ ఫోన్‌లో హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలను అందించారు. రియల్‌మి నార్జో100 లైట్ 5జి ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.14,499గా నిర్ణయించారు. అలాగే 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,499గా ఉంది. మొదటి రెండు మోడల్స్‌పై రూ.1000, టాప్ ఎండ్ మోడల్‌పై రూ.1500 కూపన్ డిస్కౌంట్లను ఇస్తున్నారు. అందువల్ల వీటి ధరలు తగ్గుతాయి. ఇక ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రత్యేక సేల్‌లో విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

realme NARZO 100x 5G | రియల్మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..
జులై 15, 2026

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026

Smart Phones | స్మార్ట్ ఫోన్లలో దృఢమైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగదారులు.. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..
జులై 13, 2026
తాజావార్తలు
- ●SIR | తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు బీఎల్వో ఇంటికొస్తారు
- ●Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్
- ●Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : సుప్రియా సూలే
- ●India - UK CETA | అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. హైదరాబాద్ నుంచి కంటైనర్లు ప్రారంభం
- ●Mouni Roy | ఆపండి..! పాపరాజీలపై నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆగ్రహం..!
- ●Vinod Kumar | ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌ను సాకుగా చూపకండి సీఎం రేవంత్ : మాజీ ఎంపీ వినోద్

SIR | తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు బీఎల్వో ఇంటికొస్తారు

Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్

Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : సుప్రియా సూలే

India - UK CETA | అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. హైదరాబాద్ నుంచి కంటైనర్లు ప్రారంభం



