త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Railway Tickets | రైల్వే ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. టిక్కెట్ ధ‌ర‌ల‌పై ఏకంగా 6 శాతం డిస్కౌంట్‌..

Railway Tickets | భార‌తీయ రైల్వే త‌న ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రైల్వే శాఖ ప్ర‌వేశ‌పెట్టిన రైల్ వ‌న్ యాప్ ద్వారా టిక్కెట్ల‌ను బుక్ చేసుకునే వారికి ఏకంగా 6 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకునే అన్ రిజ‌ర్వ్‌డ్ (జ‌న‌ర‌ల్‌) టిక్కెట్ ధ‌ర‌ల‌పై 6 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

S

Technology | Published On Dec 31, 2025, 8.51 am IST

Railway Tickets | రైల్వే ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. టిక్కెట్ ధ‌ర‌ల‌పై ఏకంగా 6 శాతం డిస్కౌంట్‌..
Advertisement

Railway Tickets | భార‌తీయ రైల్వే త‌న ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రైల్వే శాఖ ప్ర‌వేశ‌పెట్టిన రైల్ వ‌న్ యాప్ ద్వారా టిక్కెట్ల‌ను బుక్ చేసుకునే వారికి ఏకంగా 6 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకునే అన్ రిజ‌ర్వ్‌డ్ (జ‌న‌ర‌ల్‌) టిక్కెట్ ధ‌ర‌ల‌పై 6 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అయితే 3 శాతం నేరుగా డిస్కౌంట్ ల‌భిస్తుంది. మ‌రో 3 శాతం క్యాష్ బ్యాక్ రూపంలో వ‌స్తుంది. ఇలా మొత్తం 6 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఆఫ‌ర్‌ను 6 నెల‌ల‌పాటు అందించ‌నున్న‌ట్లు రైల్వే శాఖ వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 14 నుంచి జూలై 14వ తేదీ వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు.

ఈ యాప్ ద్వారా మాత్ర‌మే..

అయితే రైల్ వ‌న్ యాప్ ద్వారా కొనుగోలు చేసే టిక్కెట్ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఇత‌ర ఏ యాప్ లేదా వెబ్ సైట్‌లో టిక్కెట్ల‌ను కొనుగోలు చేసినా డిస్కౌంట్‌, క్యాష్ బ్యాక్ ల‌భించ‌దు. టిక్కెట్ రుసుముపై పూర్తి చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది. కేవ‌లం రైల్ వ‌న్ యాప్ ద్వారానే ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. రైల్ వ‌న్ యాప్‌ను ప్ర‌మోట్ చేసేందుకే ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్నామ‌ని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రెయిన్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ యాప్‌ను వాడేవారు. అలాగే ఫుడ్ ఆర్డ‌ర్ చేసేందుకు ఒక యాప్‌, ట్రెయిన్ లైవ్ స్టేట‌స్‌ను తెలుసుకునేందుకు మ‌రో యాప్‌, ఏదైనా స‌హాయం కావ‌ల్సి వ‌చ్చినా, ఫిర్యాదు చేయాల‌న్నా ఇంకో యాప్‌.. ఇలా ప‌లు ర‌కాల యాప్‌లు ఉండేవి. దీంతో ప్ర‌యాణికుల‌కు తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. అస‌లు ఏ సేవ కోసం ఏ యాప్‌ను ఉప‌యోగించాలి, ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాలు తెలుసుకునేందుకే చాలా స‌మ‌యం ప‌ట్టేది. పైగా అన్ని యాప్‌ల‌కు ఫోన్‌లో స్టోరేజ్, మెమొరీ కూడా ఎక్కువ‌గానే అవుతోంది. దీంతో ఈ బాధ నుంచి తప్పించేందుకు గాను రైల్వే శాఖ ఇటీవ‌లే రైల్ వ‌న్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని స‌హాయంతో అన్ని రైల్వే సేవ‌ల‌ను ఒకే యాప్‌లో పొంద‌వ‌చ్చు.

ఇప్ప‌టికే 3 శాతం క్యాష్ బ్యాక్‌..

రైల్ వ‌న్ యాప్‌కు ప్ర‌చారం క‌ల్పించేందుకే ఈ ఆఫ‌ర్‌ను రైల్వే శాఖ వారు అందిస్తుండ‌గా, దీని కోసం కావ‌ల్సిన సాఫ్ట్‌వేర్ అప్ డేట్‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ ఇప్ప‌టికే సెంట‌ర్ ఫర్ రైల్వే ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ (క్రిస్‌) కు లేఖ పంపింది. ఈ క్ర‌మంలోనే జ‌న‌వ‌రి నుంచి ఈ ఆఫ‌ర్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే రైల్ వ‌న్ యాప్‌లో ప్ర‌యాణికులు నేరుగా అన్ రిజ‌ర్వ్‌డ్ (జ‌న‌ర‌ల్‌) టిక్కెట్ల‌ను కొన‌వ‌చ్చు. వీటిపై ఫ్లాట్ 3 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇందుకు ప్ర‌యాణికులు ఎలాంటి కోడ్‌ను అప్లై చేయాల్సిన ప‌నిలేదు. ఏ పేమెంట్ మెథ‌డ్‌ను అయినా ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే పేమెంట్ మెథ‌డ్స్‌లో ఆర్‌-వాలెట్‌ను ఉపయోగించి పేమెంట్ చేస్తే మాత్రం మ‌రో 3 శాతం క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. ఇలా ఈ ఆఫ‌ర్ ద్వారా మొత్తం క‌లిపి 6 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ను పొంద‌వ‌చ్చు. అయితే ఆర్‌-వాలెట్‌లో ఇప్ప‌టికే 3 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. కానీ డిస్కౌంట్ మాత్రం పైన తెలిపిన తేదీ నుంచి ల‌భ్యం కానుంది. దీంతో ఆ తేదీ నుంచి 3 శాతం క్యాష్ బ్యాక్‌తోపాటు 3 శాతం డిస్కౌంట్ మొత్తం క‌లిపి 6 శాతం మేర డిస్కౌంట్ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement