త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Travel Insurance | 35 పైస‌ల‌కే రూ.10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్‌.. రైళ్లలో ప్ర‌యాణం చేస్తే దీన్ని ఉప‌యోగించుకోండి..!

Train Travel Insurance | టాటాన‌గ‌ర్ - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ సోమ‌వారం ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. య‌ల‌మంచిలి వ‌ద్ద ఈ రైలు అగ్ని ప్ర‌మాదం బారిన ప‌డింది. దీంతో రెండు ఏసీ కోచ్‌లు మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

S

Business | Published On Dec 29, 2025, 7.56 pm IST

Train Travel Insurance | 35 పైస‌ల‌కే రూ.10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్‌.. రైళ్లలో ప్ర‌యాణం చేస్తే దీన్ని ఉప‌యోగించుకోండి..!
Advertisement

Train Travel Insurance | టాటాన‌గ‌ర్ - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ సోమ‌వారం ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. య‌ల‌మంచిలి వ‌ద్ద ఈ రైలు అగ్ని ప్ర‌మాదం బారిన ప‌డింది. దీంతో రెండు ఏసీ కోచ్‌లు మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. కాసేపు ఏం జ‌రుగుతుందో తెలియ‌లేదు. దీంతో వెంట‌నే చాలా మంది ప్ర‌యాణికులు ఆ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. కానీ ఒక వ్య‌క్తి మాత్రం మంట‌ల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఇక ప్ర‌యాణికుల ల‌గేజ్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. అయితే రైలు ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ఆస్తి న‌ష్టం, ప్రాణ న‌ష్టం భారీ ఎత్తున ఉంటుంది. కానీ ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం ఎక్కువ‌గా సంభ‌వించ‌లేదు. అయితే రైళ్ల‌లో ప్ర‌మాదాలు ఎప్పుడు ఎలా జ‌రుగుతాయో ఎవరూ చెప్ప‌లేరు. సాంకేతిక కార‌ణాలు లేదా మాన‌వ త‌ప్పిదాల వ‌ల్ల ఈ ప్ర‌మాదాలు చోటు చేసుకుంటాయి. క‌నుక రైళ్ల‌లో ప్ర‌యాణించేవారు క‌చ్చితంగా ఇన్సూరెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

35 పైస‌లే..

రైళ్ల‌లో ప్ర‌యాణం చేసే వారు టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వారు టిక్కెట్ల‌ను బుక్ చేసే స‌మ‌యంలోనే ఇన్సూరెన్స్ కావాల‌నే స‌దుపాయాన్ని ఎంచుకోవ‌చ్చు. దీంతో 35 పైస‌ల‌ను ప్ర‌యాణికులు త‌మ టిక్కెట్ రుసుముతోపాటు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైళ్లలో ప్ర‌యాణం చేసిన‌ప్పుడు ప్ర‌యాణికుల‌కు రూ.10 ల‌క్ష‌ల మేర ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. ఇది ప్ర‌యాణికుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక ఈ ఇన్సూరెన్స్‌ను రైలు ప్ర‌యాణికులు క‌చ్చితంగా తీసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వ బాధ్య‌త‌..

1989 రైల్వేస్ యాక్ట్‌లోని 124, 124ఎ సెక్ష‌న్ల ప్ర‌కారం రైళ్లలో ప్రయాణించే వారు ఆ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే వారికి ప్ర‌యాణంలో భాగంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. రైలు ప్ర‌మాదంలో ప్ర‌యాణికుడు మృతి చెందినా లేదా పూర్తిగా విక‌లాంగుడిగా మారినా రూ.10 ల‌క్ష‌ల బీమా చెల్లిస్తారు. పాక్షికంగా వైక‌ల్యం క‌లిగితే రూ.7.50 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా ఇస్తారు. గాయాల పాలైతే రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. దీన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌యాణికుల‌కు చెల్లించాల్సి ఉంటుంది. క‌నుక‌నే రైలు ప్ర‌యాణికులు టిక్కెట్ల‌ను బుక్ చేసే స‌మ‌యంలో ఇన్సూరెన్స్ కావాల‌నే ఆప్ష‌న్‌ను క‌చ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఇన్సూరెన్స్ వ‌ర్తించాలంటే ప్ర‌యాణికులు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లో టిక్కెట్ ను తీసుకుని ఉండాలి. రైల్వే కౌంట‌ర్లు లేదా ఇత‌ర ప్ర‌దేశాల్లో కొనుగోలు చేసే రైలు టిక్కెట్ల‌కు ఈ ఇన్సూరెన్స్ వ‌ర్తించ‌దు. ప్ర‌యాణికుడు మృతి చెందితే అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రయాణికుడి సొంత త‌ప్పిదాల కార‌ణంగా అత‌నికి ఏదైనా జ‌రిగితే అలాంటి సంద‌ర్భాల్లో ఇన్సూరెన్స్ వ‌ర్తించ‌దు. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌యాణికుల‌కు అద‌న‌పు మొత్తంలో ఇన్సూరెన్స్‌ను అందిస్తాయి. ఇలా రైలు ప్ర‌యాణ ఇన్సూరెన్స్ ప‌నిచేస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement