దేశవ్యాప్తంగా 6117 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై
ప్రతి స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 1731 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఫిక్స్ చేసింది. 11953 కోచ్‌లను ప్రయాణికులను ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రతతో కూడిన ప్రయాణం చేసేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంది.
ఈరోజుల్లో రైలు ప్రయాణాలు చేయాలన్నా ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకొని బయలుదేరవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. టికెట్ల కోసం గంటలకు గంటలు టికెట్ బుకింగ్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రతిదీ డిజిటలైజేషన్ చేస్తున్నామని, ఈ డిజిటలైజేషన్‌కి ప్రజలు కూడా మద్దతు పలకాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫైని కేంద్రం అందిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ విషయాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 6117 రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం ఫ్రీ వైఫైని అందిస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా రైల్వే మంత్రిత్వ శాఖ నిధులేమీ కేటాయించలేదు. ఈ వైఫై సర్వీసును వినియోగించుకోవాలంటే దాని కోసం వ్యక్తిగత డేటా ఏదీ ఇవ్వాల్సిన పని లేకుండా మొబైల్ నెంబర్, దానికి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే వైఫైని ఉచితంగా వాడుకునేలా సులభంగా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకునేలా కేంద్రం సులభతరం చేసింది.
1731 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు
అలాగే, ప్రతి స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 1731 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఫిక్స్ చేసింది. 11953 కోచ్‌లను ప్రయాణికులను ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రతతో కూడిన ప్రయాణం చేసేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంది.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 250 సీసీటీవీ కెమెరాలు
ఢిల్లీ రైల్వే ష్టేషన్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద బయటి వైపు ఉన్న ప్రాంతాలు కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్స్ పూర్తి స్థాయిలో కనిపించేలా కెమెరాలను అమర్చారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15, 2025 తర్వాత కొన్ని ఏరియాలను పునర్నిర్మించారు. ఆ కొత్త ప్రాంతాల్లో అదనంగా సీసీటీవీ కెమెరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా ఒక్క ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనే ఇప్పటి వరకు 250 సీసీటీవీ కెమెరాలను అమర్చారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



