Ukraine Drones Attack On Moscow | మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. ధ్రువీకరించిన రష్యా..
Ukraine Drones Attack On Moscow | రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ మెరుపు డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ డ్రోన్ దాడులు ప్రారంభం కాగా దాదాపుగా మూడు గంటల పాటు దాడులు కొనసాగాయి. మాస్కోలో పలు ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు డ్రోన్లతో దాడులు చేశాయి.
International | Published On Dec 31, 2025, 8.02 am IST
Ukraine Drones Attack On Moscow | రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ మెరుపు డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ డ్రోన్ దాడులు ప్రారంభం కాగా దాదాపుగా మూడు గంటల పాటు దాడులు కొనసాగాయి. మాస్కోలో పలు ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు డ్రోన్లతో దాడులు చేశాయి. మాస్కోలోని వెస్టర్న్ రష్యా, క్రిమియా ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఈ దాడుల్లో రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు మొత్తం 27 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేశాయి. ఈ మేరకు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా మాస్కో గవర్నర్ ఆండ్రెయ్ వోరోబైవోవ్ టెలిగ్రామ్ యాప్‌లో ప్రకటన విడుదల చేశారు. మొత్తం 21 డ్రోన్లను మాస్కో ప్రాంతంలో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో ఒక పౌరుడికి గాయాలు అయ్యాయని వివరించారు. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాస్కోపై ఉక్రెయిన్ ఈ డ్రోన్ దాడులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.
కాగా ఉక్రెయిన్‌కు చెందిన కైయివ్ మాత్రం రష్యా చేసిన ఆరోపణలను తోసి పుచ్చింది. తాము పుతిన్ పై దాడులకు పాల్పడుతున్నామని రష్యా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను అర్థాంతరంగా ముగించడం కోసమే రష్యా ఈ విధంగా ఆరోపణలు చేస్తుందని స్పష్టం చేసింది. ఇక మరోవైపు మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో పెద్దగా నష్టం సంభవిచలేదని తెలుస్తోంది. ఆస్తి లేదా ప్రాణ నష్టానికి సంబంధించి రష్యా ఇంకా వివరాలను వెల్లడించలేదు. కానీ మాస్కో సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని, దీని వల్ల సుమారుగా లక్ష మందిపై ప్రభావం పడిందని స్థానిక మీడియా చానల్స్, ప్రతికలు టెలిగ్రామ్ యాప్ ద్వారా ప్రకటించాయి. ఈ మేరకు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Indian Worker Killed in Russia | రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి: భారతీయ కార్మికుడు మృతి, ముగ్గురికి గాయాలు
మే 17, 2026

Vladimir Putin | డ్రోన్ దాడుల భయం.. కొన్ని వారాలుగా బంకర్లలో దాక్కున్న పుతిన్..!
మే 8, 2026

Russia Electro-L Satellite | రష్యన్ శాటిలైట్ కంటికి చిక్కిన భారత్.. ఆకుపచ్చని మెరుపుతో అద్భుతమైన దృశ్యం!
మే 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



