త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంది..

Google Gemini | గూగుల్ మెసేజెస్‌లో జెమిని ఏఐకి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్ పరీక్షలు నిర్వహిస్తోంది. విమాన టికెట్ల ధరలు తగ్గినప్పుడు, ఆన్‌లైన్‌లో వస్తువులపై డిస్కౌంట్లు వచ్చినప్పుడు, పార్సిళ్లు డెలివరీ అయినప్పుడు జెమిని స్వయంగా మెసేజ్‌లు పంపనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా వినియోగదారులకే పరిమితం కాగా త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రానుంది.

S

Technology | Published On Nov 26, 2026, 3.42 pm IST

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంది..
Advertisement

Google Gemini | గూగుల్ మెసేజెస్‌లో జెమిని ఏఐకి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్ పరీక్షలు నిర్వహిస్తోంది. విమాన టికెట్ల ధరలు తగ్గినప్పుడు, ఆన్‌లైన్‌లో వస్తువులపై డిస్కౌంట్లు వచ్చినప్పుడు, పార్సిళ్లు డెలివరీ అయినప్పుడు జెమిని స్వయంగా మెసేజ్‌లు పంపనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా వినియోగదారులకే పరిమితం కాగా త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచ‌ర్ ఎలా ప‌నిచేస్తుంది..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన సేవలను మరింత విస్తరిస్తున్న గూగుల్, జెమిని వినియోగదారులకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇకపై వినియోగదారులు జెమినికి మెసేజ్ చేయడమే కాకుండా, జెమిని కూడా వారితో స్వయంగా సంభాషణ ప్రారంభించనుంది. గూగుల్ మెసేజెస్ తాజా బీటా వెర్షన్ లో ఈ కొత్త ఫీచర్ కనిపించినట్లు 9టుగూగుల్ వెల్లడించింది. ఈ వెర్షన్‌లోని జెమిని ఫ్లోటింగ్ బటన్ నేరుగా జెమిని ఛానల్స్ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తున్నట్లు తెలిపింది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్‌సీఎస్) బిజినెస్ మెసేజింగ్ సాంకేతికత ఆధారంగా ఈ సేవ పనిచేయనున్నట్లు చెప్పింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందుగా జెమిని యాప్‌లో టాస్క్స్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గూగుల్ మెసేజెస్‌లో జెమినితో ప్రత్యేక చాట్ ప్రారంభించవచ్చు.

ధ‌ర‌లు త‌గ్గితే వెంట‌నే అల‌ర్ట్‌..

విమాన టికెట్ల ధరలు తగ్గినా, వినియోగదారులు కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువుల ధరలు పడిపోయినా జెమిని స్వయంగా మెసేజ్ పంపనుంది. సబ్‌స్క్రిప్షన్ల రెన్యువల్ తేదీలను గుర్తుచేయడంతో పాటు, బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణాలు, డెలివరీకి వస్తున్న పార్సిళ్ల వివరాలను కూడా తెలియజేయనుంది. పార్సిల్ డెలివరీ పూర్తయిన తర్వాత కూడా ఫాలోఅప్ మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణం వంటి సాధారణ ప్రశ్నలకు అదే చాట్‌లో సమాధానాలు ఇవ్వడంతోపాటు, ఫొటోలు, ఇతర ఫైళ్లను జెమినికి పంపే సదుపాయం కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం గూగుల్ మెసేజెస్‌లో ఈ కొత్త ఇంటిగ్రేషన్ అమెరికా వినియోగదారులకు మాత్రమే పరిమితమైంది. అయితే జెమిని టాస్క్స్ ఫీచర్‌ను ఇటీవల అమెరికా, కెనడా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ, గూగుల్ మెసేజెస్ ద్వారా స్వయంగా అలర్ట్‌లు పంపే కొత్త సదుపాయం మాత్రం ప్రస్తుతం అమెరికాలోనే పరీక్షిస్తున్నారు.

Advertisement
Advertisement