త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comet Browser | ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి వ‌చ్చిన ప‌ర్‌ప్లెక్సిటీ కోమెట్ బ్రౌజ‌ర్‌

Comet Browser | ప్ర‌ముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ప‌ర్‌ప్లెక్సిటీ త‌న కోమెట్ ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ యాప్‌ను ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌ల చేసింది. ఈ బ్రౌజ‌ర్ ఇప్ప‌టికే ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉండ‌గా, ఇప్పుడు ఐఫోన్‌, ఐప్యాడ్ యూజ‌ర్లు కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో కోమెట్ బ్రౌజ‌ర్ యాప్ ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది.

S

Technology | Published On Mar 20, 2026, 12.33 pm IST

Comet Browser | ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి వ‌చ్చిన ప‌ర్‌ప్లెక్సిటీ కోమెట్ బ్రౌజ‌ర్‌
Advertisement

Comet Browser | ప్ర‌ముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ప‌ర్‌ప్లెక్సిటీ త‌న కోమెట్ ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ యాప్‌ను ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌ల చేసింది. ఈ బ్రౌజ‌ర్ ఇప్ప‌టికే ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉండ‌గా, ఇప్పుడు ఐఫోన్‌, ఐప్యాడ్ యూజ‌ర్లు కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో కోమెట్ బ్రౌజ‌ర్ యాప్ ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. ఇందులో సాధార‌ణ వెబ్ బ్రౌజింగ్‌తోపాటు ఏఐ ఆధారిత హెల్ప్‌ను కూడా తీసుకోవ‌చ్చు. దీని స‌హాయంతో సెర్చ్‌, రీసెర్చ్ వంటి వివిధ ప‌నుల‌ను ఒకే ఇంట‌ర్‌ఫేస్‌లో నిర్వ‌హించుకోవ‌చ్చు.

క్రాస్‌-డివైస్ కంటిన్యూటీ..

ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న కోమెట్ డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్ యాప్‌ల సేవ‌ల ఆధారంగా ఐఓఎస్ వెర్ష‌న్‌ను రూపొందించిన‌ట్లు ప‌ర్‌ప్లెక్సిటీ తెలిపింది. ఇది వివిధ ర‌కాల డివైస్‌ల మ‌ధ్య క్రాస్‌-డివైస్ కంటిన్యూటీని అందిస్తుంది. అంటే ఒక డివైస్‌లో ఈ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ అందులో లాగిన్ అయి ఉంటే అదే అకౌంట్‌ను ఇంకో డివైస్‌లో లాగిన్ చేసి అందులోనూ బ్రౌజ‌ర్‌ను వాడితే రెండింటి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉంటుంద‌న్న‌మాట‌. దీని వ‌ల్ల ఒక డివైస్‌లో బ్రౌజ‌ర్‌లో ఆపిన ప‌నిని ఇంకో డివైస్‌లో అదే బ్రౌజ‌ర్‌లో తిరిగి అక్క‌డి నుంచే కొన‌సాగించ‌వ‌చ్చు. ఇక బ్రౌజ‌ర్‌లోనే ఏఐ సేవ‌ల‌ను ఉపయోగించుకోవ‌చ్చు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా మ‌ళ్లీ ఇత‌ర ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌కు చెందిన యాప్‌ల‌ను వాడాల్సిన అవ‌స‌రం లేదు.

బిల్ట్‌-ఇన్ అసిస్టెంట్‌..

కోమెట్‌కు చెందిన ఐఓఎస్ వెర్ష‌న్ బ్రౌజ‌ర్‌లో బిల్ట్‌-ఇన్ అసిస్టెంట్‌ను ఇచ్చారు. ఇది యూజ‌ర్లు వెబ్ బ్రౌజింగ్ చేస్తూనే కంటెంట్‌తో ప‌ర‌స్ప‌రం చ‌ర్య‌లు చేయ‌డానికి ప‌నిచేస్తుంది. ప్ర‌స్తుతం వీక్షిస్తున్న వెబ్ పేజీకి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ను అడిగితే యాప్‌లు లేదా ట్యాబ్‌ల మ‌ధ్య మారాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. వేగంగా స‌మాధానాల‌ను ఇస్తుంది. ఈ బ్రౌజ‌ర్‌లో సాధార‌ణ సెర్చ్ ఫ‌లితాల‌తోపాటు ఏఐ ద్వారా రూపొందించిన స‌మాధానాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దీని ద్వారా యూజ‌ర్లు చిన్న ప్ర‌శ్న‌ల నుంచి క్లిష్ట‌మైన స‌మాచారం వ‌ర‌కు ఒకే ఇంట‌ర్‌ఫేస్‌లో పొందేందుకు వీలుంటుంది. ఈ బ్రౌజ‌ర్‌లో అందుబాటులో ఉన్న వాయిస్ మోడ్ ఫీచ‌ర్ స‌హాయంతో వాయిస్ ఆధారిత ప్ర‌శ్న‌ల‌ను అడ‌గ‌వ‌చ్చు. దీంతో ప్ర‌స్తుతం ఓపెన్ అయి ఉన్న ట్యాబ్ ఆధారంగా స‌మాధానాల‌ను ఇస్తుంది.

అనేక ఫీచ‌ర్లు..

కోమెట్ ఐఓఎస్ వెర్ష‌న్ బ్రౌజ‌ర్‌లో కాంటెక్ట్స్ ఆధారిత రిప్లైస్ ఫీచ‌ర్ కూడా ఉంది. దీంతో స్క్రీన్‌పై ఉన్న కంటెంట్‌ను విశ్లేషించి, ప్ర‌స్తుత పేజీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. హైబ్రిడ్ సెర్చ్ అనే ఫీచ‌ర్ ద్వారా సాధార‌ణ సెర్చ్ ఫ‌లితాల‌తోపాటు ఏఐ స‌మాధానాల‌ను కూడా ఒకేసారి అందిస్తుంది. అలాగే డీప్ రీసెర్చ్‌, స‌మ్మ‌రీ, ఫామ్స్ హ్యాండ్లింగ్‌, టాస్క్ ఎగ్జిక్యూష‌న్‌, క్రాస్ డివైస్ సింక్ వంటి ఫీచ‌ర్ల‌ను కూడా యూజ‌ర్లు ఈ బ్రౌజ‌ర్‌లో పొంద‌వ‌చ్చు. ఈ బ్రౌజ‌ర్ ద్వారా ఏఐ ఆధారిత బ్రౌజింగ్‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అందించ‌నున్నామ‌ని ప‌ర్‌ప్లెక్సిటీ తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement