Oura Ring 4 | నిద్ర, హార్ట్ రేట్, వెల్‌నెస్‌ను ట్రాక్ చేసే సరికొత్త స్మార్ట్ రింగ్.. విడుదల చేసిన ŌURA..
Oura Ring 4 | ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్ రింగ్ తయారీదారు ŌURA భారత మార్కెట్లో తన కొత్త Oura Ring 4 ను అధికారికంగా విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ స్మార్ట్ రింగ్ నిద్ర, శారీరక చలనం, గుండె ఆరోగ్యం, ఒత్తిడి వంటి అంశాలపై డేటా ఆధారిత విశ్లేషణలను అందిస్తుంది.
Technology | Published On Mar 18, 2026, 11.53 am IST
Oura Ring 4 | ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్ రింగ్ తయారీదారు ŌURA భారత మార్కెట్లో తన కొత్త Oura Ring 4 ను అధికారికంగా విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ స్మార్ట్ రింగ్ నిద్ర, శారీరక చలనం, గుండె ఆరోగ్యం, ఒత్తిడి వంటి అంశాలపై డేటా ఆధారిత విశ్లేషణలను అందిస్తుంది. దీంతో పాటు ŌURA సంస్థ India: The State of Sleep 2026 అనే ప్రత్యేక నివేదికను కూడా విడుదల చేసింది. ఈ నివేదికలో భారత వినియోగదారుల నిద్ర అలవాట్లపై ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.
నిద్ర సమయం 6:28 గంటలు మాత్రమే..
ఈ నివేదికలో భారతీయ ŌURA వినియోగదారుల నిద్ర విధానాలపై కీలక అంశాలు వెల్లడయ్యాయి. భారతీయులు సగటున ప్రతి రాత్రి 6 గంటల 28 నిమిషాల పాటు మాత్రమే నిద్రపోతున్నారని వెల్లడైంది. ఇది ప్రపంచంలో ఎక్కువగా నిద్రించే దేశాల కంటే సుమారు 40 నిమిషాలు తక్కువ కావడం గమనార్హం. అలాగే REM, గాఢ నిద్ర పరంగా ప్రపంచంలోనే తక్కువ స్థాయిలో ఉన్నట్లు తేలింది. గ్లోబల్ సగటుతో పోలిస్తే వారానికి ఒక గంటకుపైగా REM నిద్ర కోల్పోతున్నట్లు వెల్లడైంది. వినియోగదారులలో 59 శాతం మంది సాయంత్రం ఎక్కువగా చురుకుగా ఉండే క్రోనోటైప్‌ను కలిగి ఉన్నారు. సగటు నిద్రపోయే సమయం రాత్రి 12:14 కాగా, లేచే సమయం ఉదయం 7:43గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువసేపు నిద్రపోయే మధ్యాహ్న నిద్రలు కూడా భారతీయులవే. అవి సగటున 53 నిమిషాలు ఉండగా, ఎక్కువగా సోమవారం రోజున కనిపిస్తున్నాయి. వారం రోజులూ, వీకెండ్‌లలోనూ నిద్ర సమయాలు సుమారు ఒకేలా కొనసాగుతున్నాయి.
ఈ డేటా ప్రకారం ఆలస్యంగా నిద్రపోవడం, బిజీ జీవనశైలి, గ్లోబల్ పని సమయాల ప్రభావంతో భారతీయులు నిద్ర లోటు (sleep debt)కు లోనవుతున్నారు. తక్కువ నిద్ర ఉన్నప్పటికీ స్థిరమైన నిద్ర అలవాట్లు, మధ్యాహ్న నిద్ర కొంతవరకు దీనిని సమతుల్యం చేస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఉదయం పూర్తిగా విశ్రాంతిగా లేచే పరిస్థితిలో కనిపించడం లేదు.

Oura Ring 4 ప్రత్యేకతలు..
Oura Ring 4 ను ఆధునిక ఆరోగ్య మానిటరింగ్ సాంకేతికత, సౌకర్యవంతమైన డిజైన్‌తో కలిపి రూపొందించారు. ఈ రింగ్ ను పూర్తిగా టైటానియంతో తయారు చేశారు. సెన్సార్లు లోపల సురక్షితంగా అమర్చబడి ఉంటాయి. బరువు 3.3 నుంచి 5.2 గ్రాముల మధ్య ఉంటుంది. 4 నుంచి 15 సైజుల్లో అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లాక్, బ్రష్డ్ సిల్వర్, స్టెల్త్, గోల్డ్, రోజ్ గోల్డ్ వంటి ఆరు రంగుల్లో లభిస్తోంది. ఈ డివైస్‌లో మల్టీ-వేవ్‌లెంగ్త్ సెన్సార్లు, 18 సిగ్నల్ వేస్ ఉన్నాయి. ఏఐ ఆధారిత Oura Advisor వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన సూచనలను అందిస్తుంది. ఇది 50కిపైగా హెల్త్ ఇండెక్స్ లను ట్రాక్ చేస్తుంది. ఇందులో నిద్ర, గుండె కొట్టుకునే వేగం, HRV, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు (SpO₂), శ్వాస విధానం, ఒత్తిడి, మెటబాలిక్ ఆరోగ్యం, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ట్రాక్ చేయవచ్చు.
ఇతర స్పెసిఫికేషన్లు..
యాప్‌లో నిద్ర గురించి విశ్లేషణ, ఫెర్టిలిటీ అంచనాలు, మధ్యాహ్న నిద్ర గుర్తింపు, రోజువారీ ఒత్తిడి ట్రాకింగ్, గుండె వయస్సు అంచనా, ఆటోమేటిక్ వర్కవుట్స్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రింగ్ బ్యాటరీ 5 నుంచి 8 రోజుల వరకు వస్తుంది. ఈ రింగ్‌కు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్‌ను కల్పించారు. తీవ్ర ఉష్ణోగ్రతలలోనూ పనిచేసే విధంగా (-10 నుంచి 54 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య) ఈ రింగ్‌ను రూపొందించారు. ఈ రింగ్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. గరిష్టంగా 8 రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుంది. కేవలం 20 నుంచి 80 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. వైర్ లెస్ విధానంలో లేదా యూఎస్‌బీ టైప్ సి కేబుల్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. రింగ్‌తోపాటు యూఎస్‌బీ టైప్ సి కేబుల్‌ను ఇస్తున్నారు. ఈ రింగ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు యాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది. 40కి పైగా ఇతర హెల్త్, ఫిట్‌నెస్ యాప్ లతోనూ ఈ రింగ్ పనిచేస్తుంది. రెండు వారాల వరకు డేటాను స్టోర్ చేసుకుంటుంది. బ్లూటూత్ ఎల్ఈ ద్వారా డివైస్‌లకు కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఇస్తారు.
ధర ఎంతంటే..
ఈ రింగ్‌కు ఇచ్చిన ఎల్ఈడీ సెన్సార్‌లు చర్మానికి ఎలాంటి హాని కలిగించవని, సీఈ, ఎఫ్సీసీ, ఐఎస్ఈడీ, ఐఈసీ62368-1 ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామని కంపెనీ తెలిపింది. బ్లూటూత్ వినియోగం కూడా రోజుకు 1 శాతం కన్నా తక్కువగానే ఉంటుందని వెల్లడించింది. రింగ్‌తోపాటు వైర్‌లెస్ చార్జర్, యూఎస్‌బీ టైప్ సి కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్, ఆరోగ్య భద్రత సమాచారం లభిస్తుందని తెలిపింది. Oura Ring 4 భారత్‌లో 100కు పైగా క్రోమా స్టోర్లతోపాటు అమెజాన్ లోనూ అందుబాటులో ఉంది. సిల్వర్, బ్లాక్ కలర్ వేరియెంట్ల ధర రూ.28,900 ఉండగా, ఇతర కలర్ వేరియెంట్ల ధర రూ.39,900గా ఉంది. Oura మెంబర్‌షిప్ కోసం అదనంగా రూ.599 ను నెలవారిగా చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Noise REP Band | నాయిస్ రెప్ బ్యాండ్‌కు భారీ డిమాండ్.. తొలిరోజే 35 వేల యూనిట్ల విక్రయం..
ఆగస్టు 11, 2026

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Pocharam Srinivas Reddy | అసలు... నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ●Dayanidhi Maran on Congress | రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. తమిళనాడుకు మరో న్యాయమా?
- ●Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు
- ●Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...
- ●Hisense UR8S | హైసెన్స్ నుంచి ఆర్జీబీ మినీ ఎల్ఈడీ టీవీలు.. తక్కువ ధరలకే లాంచ్..
- ●Kadiyam Kavya | కాకతీయ జూ అభివృద్ధికి కాంపా నిధులు ఇవ్వండి.. ఎంపీ కావ్య రిక్వెస్ట్

Pocharam Srinivas Reddy | అసలు... నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Dayanidhi Maran on Congress | రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. తమిళనాడుకు మరో న్యాయమా?

Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు

Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...



