OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
OPPO Find X9s | మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఫైండ్ ఎక్స్9ఎస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.59 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
Technology | Published On May 21, 2026, 1.25 pm IST
OPPO Find X9s | మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఫైండ్ ఎక్స్9ఎస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.59 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల డిస్‌ప్లే అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను, ఇంకో 50 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. ఇవి సోనీ కంపెనీకి చెందిన కెమెరా సెన్సార్లు కనుక అద్భుతమైన క్వాలిటీని ఇస్తాయి. ఈ ఫోన్ లో ఒప్పోకు చెందిన ప్రత్యేకమైన లుమో ఇమేజ్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది ఒప్పో కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీని సహాయంతో ఫొటోలను నాణ్యంగా తీసుకోవచ్చు. అలాగే ఎడిట్ చేసుకోవచ్చు. కెమెరాలను ఉపయోగించే సమయంలో తక్కువ సీపీయూ, పవర్ వినియోగం అవుతాయి. దీని వల్ల ఫోన్ హీటింగ్ తగ్గుతుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 7025 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. 5 ఏళ్ల వాడకం తరువాత కూడా ఈ బ్యాటరీ 80 శాతం కెపాసిటీతో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను ఇచ్చారు. అయితే వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ మాత్రం లేదు. ఈ ఫోన్ డిస్‌ప్లేకు 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చినందున ఔట్ డోర్‌లో డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఆక్టాకోర్ డైమెన్సిటీ 9500ఎస్ ప్రాసెసర్ ను ఇచ్చారు. 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవక్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే 3డి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ66, 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్స్ ఉన్నాయి. 5జి, వైఫై 7, బ్లూటూత్ 6.1, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ సదుపాయాలను అందించారు.
ధర వివరాలు..
ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ స్మార్ట్ ఫోన్‌ను మిడ్ నైట్ గ్రే, లావెండర్ స్కై, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.79,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.89,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను ప్రస్తుతం వినియోగదారులు ప్రీ ఆర్డర్ చేయవచ్చు. మే 28 నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో లభ్యమవుతుంది. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే.. ప్రీ బుకింగ్ చేస్తే రూ.5వేల విలువైన గిఫ్ట్ ఇస్తారు. మే 27 వరకు మాత్రమే ప్రీ ఆర్డర్‌కు గడువు ఉంది.
సంబంధిత వార్తలు

Lava Virat V1 | లావా విరాట్ వి1 సిరీస్ లాంచ్.. రూ.8,999 నుంచే 5జి, భారీ బ్యాటరీ ఫోన్లు..
జులై 25, 2026

Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్..
జులై 24, 2026

OnePlus | ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..
జులై 16, 2026
తాజావార్తలు
- ●vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..
- ●Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ
- ●Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? - సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో...
- ●MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?
- ●Bhatti Vikramarka | ఉచితాలు కావు... ప్రజా పెట్టుబడులు
- ●Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..

Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ

Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? - సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో...

MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?



