Lava Smart 4 Pro | రూ.10వేలకే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ..
Lava Smart 4 Pro | భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా స్మార్ట్ 4 ప్రో పేరుతో విడుదలైన ఈ ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90 హెడ్జ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ మన్నిక వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.10,999 ధరతో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.
Technology | Published On Nov 20, 2026, 3.44 pm IST
Lava Smart 4 Pro | భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా స్మార్ట్ 4 ప్రో పేరుతో విడుదలైన ఈ ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90 హెడ్జ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ మన్నిక వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.10,999 ధరతో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.
బ్లోట్‌వేర్ లేని క్లీన్ ఆండ్రాయిడ్..
లావా సంస్థ తన స్మార్ట్ 4 ప్లస్ మోడల్ తర్వాత స్మార్ట్ 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, రోజువారీ వినియోగానికి అనువైన మన్నికను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. యునిసాక్ టి610 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4 జీబీ ఫిజికల్ ర్యామ్‌తోపాటు మరో 4 జీబీ వర్చువల్ ర్యామ్ సదుపాయం కల్పించారు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో థర్డ్ పార్టీ బ్లోట్‌వేర్, ప్రకటనలు లేని స్టాక్ తరహా ఇంటర్‌ఫేస్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందించనుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7,000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ. ఇప్పటివరకు లావా స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యధిక బ్యాటరీ సామర్థ్యమని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 950 గంటల వరకు స్టాండ్‌బై సమయం, యూట్యూబ్ వీడియోలను నిరంతరాయంగా 748 నిమిషాల వరకు వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందించింది. ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో కూడిన 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పోర్ట్రెయిట్, నైట్, ఏఐ, ప్రో మోడ్, పనోరమా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ వంటి కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ధర వివరాలు..
మన్నిక విషయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ డ్రాప్ అండ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది. నీలం బ్లూ, కోణార్క్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. డ్యుయల్ నానో సిమ్, 4జి వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, జీపీఎస్ కనెక్టివిటీ సదుపాయాలతోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియోను కూడా అందించారు. లావా సంస్థకు చెందిన ఉచిత డోర్‌స్టెప్ సర్వీస్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఇంటి వద్దకే అమ్మకాల అనంతర సేవలు పొందవచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లావా అధీకృత ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో మాత్రమే ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

Lava Bold N4 Pro 5G | లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి.. రూ.13,999కే.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
సెప్టెంబర్ 19, 2026

Lava Bold N4 Lite | భారీ బ్యాటరీతో లావా మొబైల్స్ కొత్త ఫోన్.. ధర రూ.7,999 మాత్రమే..
ఆగస్టు 28, 2026

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!



