Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ – సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మొదటి రోజు తమిళంలో కంటే తెలుగులో ఈ మూవీ ఎక్కువ వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా శుక్రవారం ఈ సినిమాకు 34 కోట్ల వసూళ్లు వచ్చాయి. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Aug 15, 2026, 5.06 pm IST
Vishwanath And Sons | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్ట్రెయిట్ తమిళంలో రూపొందించారు. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు.
ఓవర్‌సీస్‌లో హయ్యెస్ట్...
శుక్రవారం థియేటర్లలో రిలీజైన విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 34 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళ వెర్షన్ ఏడున్నర కోట్ల వసూళ్లను రాబట్టగా... తెలుగు వెర్షన్ ఎనిమిది కోట్ల ముప్పై లక్షలకుపైగా కలెక్షన్స్ దక్కించుకుంది. కర్ణాటకలో కోటి డెబ్భై ఐదు లక్షలు, కేరళలో కోటిన్నర వసూళ్లతో డిసపాయింట్ చేసింది. ఓవర్‌సీస్‌లో మాత్రం తొలిరోజు ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ కుమ్మేసింది. 14.5 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
తక్కువ వసూళ్లు...
స్ట్రెయిట్ తమిళ మూవీ తెలుగులో ఎక్కువగా వసూళ్లను రాబట్టడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రీసెంట్ టైమ్‌లో తమిళనాట సూర్య సినిమాల్లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా విశ్వనాథ్ అండ్ సన్స్ నిలిచింది.
స్టోరీలో కొత్తదనం మిస్...
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య, మమితా బైజు యాక్టింగ్‌తో పాటు వెంకీ అట్లూరి టేకింగ్ బాగున్నాయంటూ పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టోరీలో కొత్తదనం లేకపోయినా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఆవిష్కరించిన తీరు బాగుందంటూ పేర్కొంటున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.
ఒలింపిక్ విన్నర్...
విశ్వనాథ్ అండ్ సన్స్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే ఒలింపిక్ విన్నర్‌గా సూర్య కనిపించారు. మమితా బైజు అతడిని ప్రేమించే యువతిగా జోవియల్ రోల్‌లో కనిపించింది. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌కు సరోగసీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ – పెళ్లికి ముందు యాక్సిడెంట్ – ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!
ఆగస్టు 15, 2026

Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ – భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
ఆగస్టు 14, 2026

Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ – రూటు మార్చిన అనిల్ రావిపూడి – మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
- ●Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..
- ●CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ
- ●Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏకమవ్వాలి
- ●Bollywood | కూతురు వయసున్న హీరోయిన్‌తో డేటింగ్ - బాలీవుడ్ హీరోపై భార్య సంచలన కామెంట్లు

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ



