CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
CM Revanth Reddy | రాష్ట్రంలో రైతులకు మేలు చేసిందేవరో.. అన్యాయం చేసిందేవరో అసెంబ్లీలో చర్చిద్దాం రా.. అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అది కూడా నీ గడ్డ మీద నుంచే సవాల్ విసురుతాన్నని రేవంత్ నొక్కిచెప్పారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో రైతులకు మేలు చేసిందేవరో.. అన్యాయం చేసిందేవరో అసెంబ్లీలో చర్చిద్దాం రా.. అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అది కూడా నీ గడ్డ మీద నుంచే సవాల్ విసురుతాన్నని రేవంత్ నొక్కిచెప్పారు. సంగారెడ్డి జిల్లాలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ ప్రసంగించారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్నరు. కరెంట్ కోతలు అన్నరు.. 32 నెలలైంది.. ఏ క్షణమైనా కరెంట్ పోయిందా.. గ్రామాల్లో, గూడెల్లో, తండాల్లో ఉచిత కరెంట్ అందిస్తున్న మాట వాస్తవం కాదా.. రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా.. వరి వేసుకుంటే ఉరి అన్నడు కేసీఆర్.. కానీ ఆయన వందల ఎకరాల్లో వరి వేసుకుని క్వింటాల్‌కు రూ. 4200కు, కావాల్సిన కంపెనీలకు అమ్ముకున్నాడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయడంతో పాటు 500 బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటున్న చరిత్ర చూస్తున్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేకుండా పోయింది. వడ్లను కొనడమే కాకుండా.. వాటిని బియ్యంగా మార్చి సన్నబియ్యం అందిస్తున్నాం అని సీఎం తెలిపారు.
మీరు చేసిన అన్యాయం ఏందో మాట్లాడుదాం
ఆనాడు రైతుబంధు కింద ఎకరాకు పదివేల రూపాయాలు ఇస్తా అన్నడు. మేం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని బంద్ చేయకుండా ఎకరాకు రూ. 12 వేలు అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద 32 నెలల్లో రూ. 36 వేల కోట్లు.. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. నీ జిల్లా గడ్డ మీద నుంచి.. రా శాసనసభలో చర్చిద్దాం రైతులకు చేసిన మేలు ఏందో.. మీరు చేసిన అన్యాయం ఏందో మాట్లాడుదాం అంటున్న అని సీఎం రేవంత్ అన్నారు.
32 నెలల్లోనే రూ. 90 వేల కోట్లు చెల్లించాం
రుణమాఫీ అన్నడు.. రెండు సార్లు సీఎం అయినా రుణమాఫీ చేయలేదు.. కానీ మన ప్రభుత్వం.. ఏడాదిలోపే 21 వేల కోట్ల నగదును 25 లక్షల రైతు ఖాతాల్లో జమ చేసి 2 లక్షల రుణమాఫీ చేశాం. అప్పుల్లేని రైతులను తెలంగాణ రాష్ట్రానికి అందించాం. కేంద్రం ఇచ్చిన నివేదికల్లో తెలంగాణ రైతాంగం అతి తక్కువ అప్పుల్లో ఉందని తేలింది. రుణం లేని రైతులు తెలంగాణలో ఉన్నారని కేంద్రం నివేదికలు ఇచ్చారు. అది చదువుకోవాలని బీజేపీ నేతలకు సూచిస్తున్నా. కేవలం 32 నెలల్లోనే రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు రూ. 90 వేల కోట్లు చెల్లించాం. ఇవాళ 90 వేల కోట్ల రూపాయాలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.. రైతుల చేతుల్లో నగదు కళకళలాడుతుంది. ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం పథకం కాదా..? అని రేవంత్ స్పష్టం చేశారు.
రైతుల కోసం లక్షా 70 వేల కోట్లు ఖర్చు పెట్టినం
ఇవాళ వ్యవసాయాన్ని పండుగ చేసినం.. రైతులను రాజుల్లాగా గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వంలో ఉంది.. ఇవాళ 32 నెలల్లోనే ఒక లక్ష 70 వేల కోట్లు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..
- ●CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ
- ●Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏకమవ్వాలి
- ●Bollywood | కూతురు వయసున్న హీరోయిన్‌తో డేటింగ్ - బాలీవుడ్ హీరోపై భార్య సంచలన కామెంట్లు
- ●Windfall Tax India | పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు.. డీజిల్‌పైనా పన్ను కోత : సామాన్యులకు కేంద్రం ఊరటనిచ్చిందా?

Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ

Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏకమవ్వాలి



