ChatGPT | చాట్ జీపీటీలో ఇకపై యాడ్స్.. పెయిడ్ ప్లాన్లు తీసుకోవాల్సిందేనా..?
ChatGPT | ఓపెన్ ఏఐ (OpenAI)కి చెందిన చాట్ జీపీటీ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా వాడుతున్నారా..? అయితే మీ చాట్ తెరలపై ఇకపై యాడ్స్ (ప్రకటనలు) దర్శనం ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే అమెరికాలో అమలు చేస్తోంది.
Technology | Published On Feb 10, 2026, 11.43 am IST
ChatGPT | ఓపెన్ ఏఐ (OpenAI)కి చెందిన చాట్ జీపీటీ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా వాడుతున్నారా..? అయితే మీ చాట్ తెరలపై ఇకపై యాడ్స్ (ప్రకటనలు) దర్శనం ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే అమెరికాలో అమలు చేస్తోంది. అక్కడ చాట్ జీపీటీ సేవలను ఉచితంగా వాడుకుంటున్న యూజర్లకు యాడ్స్‌ను ప్రదర్శిస్తోంది. చాట్ జీపీటీలో ఫ్రీ ప్లాన్లను వాడుతున్న వారికి మాత్రమే ఈ యాడ్స్ కనిపిస్తున్నాయి. అయితే చాట్ విండోలో ఈ ప్రకటనలను Sponsored అనే లేబుల్‌తో కచ్చితంగా గుర్తించేలా యూజర్‌కు ప్రదర్శిస్తామని, అందువల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని OpenAI స్పష్టం చేసింది.
యూజర్ల ప్రైవసీని గౌరవిస్తాం: ఓపెన్ ఏఐ
యాడ్స్ ను ప్రదర్శించినప్పటికీ అవి యూజర్ చాట్‌కు అడ్డురావని, వాటిని గుర్తించడం కూడా సులభమే అని OpenAI తెలియజేసింది. ఇక యూజర్ చాట్స్‌తో యాడ్స్‌కు సంబంధం ఉండదని, యూజర్ల ప్రైవసీని పూర్తిగా గౌరవిస్తామని, యాడ్స్‌ను ప్రదర్శించేందుకు యూజర్ల చాట్‌ను ఎట్టి పరిస్థితిలోనూ తాము చదవబోమని ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే ఓపెన్ ఏఐ నిజంగానే చెప్పినట్లు మాట నిలబెట్టుకుంటుందా..? అని సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మెటా సహా ఇప్పటికే అనేక టెక్ సంస్థలు ఇలాంటి విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ వస్తున్నాయి. ఓ వైపు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించబోము అంటూనే యూజర్లకు తెలియకుండానే వారి డేటాను తస్కరిస్తూ దాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో మెటాపై కాస్త ఎక్కువ ఆరోపణలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా చాట్ విండోలలోనే యాడ్స్ ప్రదర్శించడం అంటే ఓపెన్ ఏఐ ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో చూడాలని, వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
18 ఏళ్ల లోపు యూజర్లకు మినహాయింపు..
ఇక ఓపెన్ ఏఐ ప్రస్తుతానికి ఈ యాడ్స్‌ను అమెరికాలోని చాట్ జీపీటీ ఫ్రీ యూజర్లకు మాత్రమే ప్రదర్శిస్తుండగా, త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాట్ జీపీటీకి చెందిన ప్లస్, ప్రొ, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్, ఎడ్యుకేషన్ వంటి పెయిడ్ ప్లాన్లలో ఈ యాడ్స్ ను ప్రదర్శించడం లేదని ఓపెన్ ఏఐ తెలిపింది. అందువల్ల భవిష్యత్తులో ఉచిత ప్లాన్‌లో ఉన్న ఇతర దేశాల యూజర్లకు కూడా యాడ్స్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆర్థికంగా ప్లాట్‌ఫామ్‌ను మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు, వ్యయాన్ని భరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. ఇక 18 ఏళ్ల లోపు యూజర్లకు యాడ్స్ కనిపించవని, ఆరోగ్యం, రాజకీయాలు, ఫైనాన్స్ వంటి సున్నిత అంశాలకు చెందిన ప్రకటనలను తాము ఇవ్వబోమని ఓపెన్ ఏఐ తెలిపింది. అలాగే వినియోగదారులు తమకు ఎలాంటి ప్రకటనలు కావాలో ఎంచుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






