OpenAI | ఓపెన్ఏఐ షాకింగ్ నిర్ణయం.. ఏఐ వీడియో జనరేటర్ ప్లాట్‌ఫామ్ సోరా నిలిపివేత..
OpenAI | ప్రముఖ ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ తన ఏఐ వీడియో జనరేటర్ ప్లాట్‌ఫామ్ సోరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. స్టాండలోన్ యాప్‌గా ప్రారంభం అయిన కొద్ది నెలల్లోనే ఓపెన్ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సోరా 2 విడుదలయ్యాక ఈ ప్లాట్‌ఫామ్ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. యాపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరుకుంది.
Technology | Published On Mar 27, 2026, 2.25 pm IST
OpenAI | ప్రముఖ ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ తన ఏఐ వీడియో జనరేటర్ ప్లాట్‌ఫామ్ సోరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. స్టాండలోన్ యాప్‌గా ప్రారంభం అయిన కొద్ది నెలల్లోనే ఓపెన్ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సోరా 2 విడుదలయ్యాక ఈ ప్లాట్‌ఫామ్ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. యాపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరుకుంది. సోషల్ ఫీడ్ ద్వారా హైపర్-రియలిస్టిక్ ఏఐ వీడియోలను క్రియేట్ చేసే కెపాసిటీతో యూజర్లను ఆకట్టుకుంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్ వేగంగా ప్రాచుర్యం పొందినప్పటికీ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా డీప్ ఫేక్స్, కాపీరైట్ ఉన్న క్యారెక్టర్ల వినియోగం, హింస, జాతి వివక్ష సంబంధించిన కంటెంట్ వ్యాప్తి తదితర సమస్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవలే నూతన ఫీచర్లను ప్రవేశపెట్టినా..
సోరాను నిలిపివేస్తూ ఓపెన్ఏఐ నిర్ణయం తీసుకోవడంతో ఈ సంస్థకు, వాల్ట్ డిస్నీకి మధ్య ఇటీవల కుదిరిన మూడు సంవత్సరాల ఒప్పందంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల మార్వెల్, పిక్సార్, స్టార్ వార్స్ వంటి ఫ్రాంచైజీలకు చెందిన 200కి పైగా లైసెన్స్ పొందిన క్యారెక్టర్లకు యాక్సెస్ ఇచ్చారు. అయితే సోరాను నిలిపివేస్తూ ఓపెన్ఏఐ నిర్ణయం తీసుకునే ముందు ఆ సంస్థ తన బ్లాగ్ పోస్టులో పలు సెక్యూరిటీ ఇంప్రూవ్‌మెంట్స్‌ను సైతం ప్రకటించడం గమనార్హం. టీనేజర్ల కోసం కఠినమైన సేఫ్టీ నియమాలు, హానికర కంటెంట్‌పై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలను ఆ పోస్టులో వివరించింది. వీడియోలను కట్ చేయడం, పొడిగించడం, రీమిక్స్ చేయడం, ఇంప్రూవ్ చేయడం వంటి ఎడిటింగ్ ఫీచర్లను కూడా ఓపెన్ఏఐ తన సోరా ప్లాట్‌ఫామ్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్లు టైమ్‌లైన్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇవి ఐఓఎస్, వెబ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉండగా, త్వరలో ఆండ్రాయిడ్‌లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అంతలోనే సోరా ప్లాట్‌ఫామ్‌ను నిలిపివేస్తున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది.
టైమ్‌లైన్‌పై త్వరలో స్పష్టత..
అయితే సోరా యాప్, దానికి చెందిన ఏపీఐ షట్‌డౌన్ టైమ్‌టైన్‌పై త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ఓపెన్ఏఐ తెలిపింది. యూజర్లు తమ కంటెంట్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో కూడా మార్గదర్శకాలను అందిస్తామని పేర్కొంది. తమ అధికారిక ప్రకటనలో సోరా టీమ్ యూజర్లకు ధన్యవాదాలు తెలిపింది. ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ ను క్రియేట్ చేసి షేర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి నిరాశ కలిగించవచ్చని, అయితే త్వరలో మరిన్ని టూల్స్‌ను ప్రవేశపెడతామని స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Anupama Parameswaran | బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా - యాంకర్ ప్రశ్నకు వెరైటీగా సమాధానం చెప్పిన అనుపమ పరమేశ్వరన్
- ●Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?
- ●Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. దుండగులు ఎలా చంపారంటే..
- ●Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ - ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్
- ●Section 22A Land Issues Telangana | రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్ ప్రసంగం చరిత్రాత్మకం
- ●TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్..!

Anupama Parameswaran | బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా - యాంకర్ ప్రశ్నకు వెరైటీగా సమాధానం చెప్పిన అనుపమ పరమేశ్వరన్

Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?

Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. దుండగులు ఎలా చంపారంటే..

Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ - ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్






