త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ChatGPT Health | ఇక‌పై డాక్ట‌ర్‌గా సేవ‌లందించ‌నున్న చాట్ జీపీటీ.. కానీ చికిత్స కుద‌ర‌దు..!

ChatGPT Health | టెక్ దిగ్గ‌జ సంస్థ ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపును సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. మొద‌ట‌గా యూజ‌ర్ల‌కు చాట్ జీపీటీ ఏఐ సేవ‌లు అందుబాటులోకి రాగా గూగుల్ సైతం ఆ బాట‌లో న‌డ‌వ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే గూగుల్‌కు ప్ర‌స్తుతం చాట్ జీపీటీ గట్టిగానే పోటీ ఇస్తోంది.

S

Technology | Published On Jan 9, 2026, 8.52 am IST

ChatGPT Health | ఇక‌పై డాక్ట‌ర్‌గా సేవ‌లందించ‌నున్న చాట్ జీపీటీ.. కానీ చికిత్స కుద‌ర‌దు..!
Advertisement

ChatGPT Health | టెక్ దిగ్గ‌జ సంస్థ ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపును సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. మొద‌ట‌గా యూజ‌ర్ల‌కు చాట్ జీపీటీ ఏఐ సేవ‌లు అందుబాటులోకి రాగా గూగుల్ సైతం ఆ బాట‌లో న‌డ‌వ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే గూగుల్‌కు ప్ర‌స్తుతం చాట్ జీపీటీ గట్టిగానే పోటీ ఇస్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే యూజ‌ర్ల‌కు అనేక ర‌కాల సేవ‌ల‌ను ఏఐ ద్వారా అందిస్తోంది. అయితే చాట్ జీపీటీ ఇక‌పై డాక్ట‌ర్‌గా కూడా మారనుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇందుకు గాను ఓపెన్ ఏఐ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న 260 మందికి పైగా వివిధ రకాల వైద్య నిపుణులను ఈ ప్రాజెక్టు కోసం వినియోగించుకుంటోంది. వారు ఏఐ ద్వారా ఇచ్చే వైద్య స‌ల‌హాల‌కు చెందిన ఔట్‌పుట్ మోడ‌ల్‌ను ప‌రిశీలిస్తారు. ఈ క్ర‌మంలో చాట్ జీపీటీ ఆయా వైద్య స‌ల‌హాల‌ను లేదా సేవ‌ల‌ను క‌చ్చిత‌త్వంతో అందించేందుకు వీలు క‌లుగుతుంది.

డాక్ట‌ర్‌గా ప‌నిచేయ‌నున్న చాట్ జీపీటీ..

ఇక వైద్య రంగానికి చెందిన 30 కీల‌క స్థానాల్లో చాట్ జీపీటీ ఈ సేవ‌ల‌ను అందిస్తుంద‌ని ఓపెన్ ఏఐ తెలియ‌జేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాట్ జీపీటీలో అనేక మంది యూజ‌ర్లు త‌మ వైద్యానికి, పోష‌కాహారానికి, ఇత‌ర వైద్య సంబంధ వివ‌రాల‌ను తెలుసుకునేందుకు చాట్ జీపీటీని ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తున్నార‌ని, అలాంటి వారి సంఖ్య ప్ర‌స్తుతం 23 కోట్లుగా ఉంద‌ని ఓపెన్ ఏఐ తెలిపింది. అందుక‌నే చాట్ జీపీటీలో హెల్త్ విభాగాన్ని ప్ర‌త్యేకంగా అందిస్తున్నామ‌ని తెలియ‌జేసింది. దీని వ‌ల్ల యూజ‌ర్లు అన్ని ర‌కాల వైద్య సంబంధ వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వీలు క‌లుగుతుంది. యూజ‌ర్లు త‌మ మెడిక‌ల్ రికార్డులు, చికిత్స‌ల వివ‌రాలు, ప్రిస్క్రిప్ష‌న్‌, ప‌రీక్ష‌ల తాలూకు ప‌త్రాల‌ను చాట్ జీపీటీకి అందిస్తే అది క‌చ్చితమైన వైద్య స‌మాచారాన్ని, స‌ల‌హాల‌ను అందిస్తుంది. ఈ క్ర‌మంలో చాట్ జీపీటీ ఒక డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తుంద‌న్న‌మాట‌.

చికిత్స కోసం వాడ‌వ‌ద్దు..

అయితే వైద్యుల లాంటి సేవ‌ల‌ను చాట్ జీపీటీ అందిస్తుంది క‌నుక అందులో ల‌భించే స‌ల‌హాలు, సూచ‌న‌లు చికిత్స కోసం కాద‌ని, కేవ‌లం విష‌య ప‌రిజ్ఞానం, అవగాహ‌న కోసం మాత్ర‌మే అని, క‌నుక యూజ‌ర్లు త‌మ‌కు చికిత్స కావ‌ల్సి వ‌స్తే క‌చ్చితంగా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంద‌ని, చాట్ జీపీటీలో ఇచ్చే వైద్య స‌ల‌హాల‌ను, చికిత్స వివ‌రాల‌ను పాటించకూడ‌ద‌ని ఓపెన్ ఏఐ స్ప‌ష్టం చేసింది. యూజ‌ర్లు త‌మ‌కు ఉన్న వ్యాధులు, ఇత‌ర వైద్య సంబంధిత అంశాలపై స‌మాచారాన్ని తెలుసుకోవ‌డం కోస‌మే హెల్త్ సేవ‌ల‌ను చాట్ జీపీటీలో అందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. కానీ యూజ‌ర్లు చికిత్స కోసం ఈ సేవ‌ల‌ను వాడ‌కూడ‌ద‌ని తెలిపింది. అయితే ప్ర‌స్తుతం బీటా ద‌శ‌లో కేవ‌లం కొద్ది మంది యూజ‌ర్ల‌కు మాత్ర‌మే చాట్ జీపీటీ హెల్త్ పేరిగ ఓ ప్ర‌త్యేక విభాగం క‌నిపిస్తోంది. దీన్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా లాంచ్ చేయ‌నున్నారు. చాట్ జీపీటీలో ఫ్రీ, గో, ప్ల‌స్‌, ప్రొ ప్లాన్ల‌ను వాడుతున్న యూజ‌ర్లు అంద‌రికీ ఈ సేలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఓపెన్ ఏఐ తెలియ‌జేసింది. అయితే యూకేతోపాటు ప‌లు యూరోప్ దేశాల్లో మాత్రం ఈ సేవ‌లు ల‌భించ‌వ‌ని తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement