త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Grok | ఇదేంప‌ని ‘గ్రోక్’ బాబూ.. ఏఐ అయితే మాత్రం మ‌హిళ‌ల‌ను అస‌భ్యంగా చూపించాలా..?

Grok | ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంట‌ర్నెట్‌లో అనేక ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌జ‌లు అనేక ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఇప్ప‌టికే త‌మ అవ‌స‌రాల‌కు త‌గినట్లు ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో ప‌నుల‌ను చ‌క్కబెట్టుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుత కాలంలో ఏఐ తీసుకువ‌చ్చిన అనేక నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాల్లో ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేయ‌డం కూడా ఒక‌టి.

S

Technology | Published On Jan 3, 2026, 7.02 am IST

Grok | ఇదేంప‌ని ‘గ్రోక్’ బాబూ.. ఏఐ అయితే మాత్రం మ‌హిళ‌ల‌ను అస‌భ్యంగా చూపించాలా..?
Advertisement

Grok | ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంట‌ర్నెట్‌లో అనేక ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌జ‌లు అనేక ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఇప్ప‌టికే త‌మ అవ‌స‌రాల‌కు త‌గినట్లు ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో ప‌నుల‌ను చ‌క్కబెట్టుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుత కాలంలో ఏఐ తీసుకువ‌చ్చిన అనేక నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాల్లో ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేయ‌డం కూడా ఒక‌టి. ఏఐ ద్వారా ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేయ‌డం చాలా సుల‌భ‌మే కాదు, యూజ‌ర్లు తాము అనుకున్న విధంగా వాటిని జ‌న‌రేట్ చేయ‌గ‌లుగుతున్నారు. దీంతో ఏఐ ద్వారా ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేయ‌డం ప్ర‌స్తుతం పాపుల‌ర్ ట్రెండ్‌గ మారింది. అయితే దీన్ని మంచిగా ఉప‌యోగిస్తే ఫ‌ర్వాలేదు. కానీ కొంద‌రు ఏఐ ఇమేజ్ క్రియేష‌న్ టూల్స్ ను అస‌భ్య కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌ముఖ మెసేజింగ్ సైట్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)కు చెందిన గ్రోక్ (Grok)అనే ఏఐ ప్లాట్‌ఫామ్ మ‌హిళ‌ల చిత్రాల‌ను అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో జ‌న‌రేట్ చేస్తుండ‌డం భార‌త్‌లో దుమారాన్ని రేపుతోంది.

గ్రోక్ అస‌లు అడ్డు చెప్ప‌దు..

కొంద‌రు యూజ‌ర్లు కావాల‌నే గ్రోక్ ప్లాట్‌ఫామ్‌ను అస‌భ్య‌క‌ర‌మైన ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేసేందుకు వాడుతున్నారు. న‌గ్నంగా లేదా బికినీలో, ఇత‌ర అర్ధ న‌గ్న‌మైన డ్రెస్సుల్లో మ‌హిళ‌లు క‌నిపించేలా గ్రోక్ ద్వారా ఏఐ ఇమేజ్‌ల‌ను జ‌న‌రేట్ చేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్య‌మాల‌తోపాటు ప‌లు వెబ్‌సైట్ల‌లోనూ అప్ లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే ఈ విష‌యం అంత‌టితో ఆగ‌లేదు, సెల‌బ్రిటీలు, హీరోయిన్లు, ఇత‌ర ప్ర‌ముఖ మ‌హిళ‌ల‌కు చెందిన ఫొటోలు, వీడియోల‌ను సైతం గ్రోక్ ద్వారా మార్ఫింగ్ చేసి అశ్లీలంగా జ‌న‌రేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అవుతున్నాయి. అయితే అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఇలా మ‌హిళ‌ల‌కు చెందిన అస‌భ్య‌క‌ర‌మైన ఫొటోలు, వీడియోల‌ను జ‌న‌రేట్ చేసేలా స‌దుపాయం లేదు. ఆయా ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌పై ఇలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేయ‌డం కుద‌ర‌దు. వాటిల్లో యూజ‌ర్ ఇచ్చే ప్రాంప్ట్‌ల‌ను ఆయా ఏఐ ప్లాట్‌ఫామ్‌లు నిర్దాక్షిణ్యంగా నిరాక‌రిస్తాయి. అందువ‌ల్ల ఇత‌ర ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఇలా అశ్లీల ఫొటోలు, వీడియోల‌ను జ‌న‌రేట్ చేసే అవ‌కాశం లేదు. కానీ గ్రోక్‌లో మాత్రం నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కారు. ప్రధానంగా ఇలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు గ్రోక్ అడ్డు చెప్ప‌డం లేదు. దీంతో కొంద‌రు యూజ‌ర్ల‌కు ఇష్టారాజ్యంగా మారింది.

గ్రోక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: ఎంపీ ప్రియాంక చతుర్వేది

గ్రోక్‌లోనే కాదు దాని మాతృసంస్థ ఎక్స్‌లోనూ అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసేందుకు అనుమ‌తి ఉంది. ఎక్స్‌లో ఉన్న ఈ వెసులుబాటునే గ్రోక్‌లోనూ ప్ర‌వేశ‌పెట్టారు. ఇక గ్రోక్ అనేది ఏఐ కావ‌డంతో కొంద‌రు యూజ‌ర్ల‌కు అడ్డే లేకుండా పోయింది. దీన్ని ఆస‌రాగా చేసుకుని మ‌హిళ‌ల‌కు చెందిన అస‌భ్య‌క‌ర‌మైన ఇమేజ్‌లు, వీడియోల‌ను జ‌న‌రేట్ చేస్తూ వారిని కించ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రోక్‌లో ఉన్న ఈ స‌దుపాయం వ‌ల్ల సెల‌బ్రిటీలే ఎక్కువ‌గా బ‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇదే విష‌యంపై గ‌త వారం రోజులోగా ప‌లువురు మ‌హిళా సెల‌బ్రిటీలు సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే గ్రోక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కాగా ఇదే విష‌యంపై శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది ఇప్ప‌టికే కేంద్రానికి లేఖ రాశారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు అనుమ‌తిస్తున్న గ్రోక్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, గ్రోక్‌ను నిషేధించాల‌ని ఆమె కోరారు. అయితే దీనిపై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ శాఖ (MeitY) స్పందించింది.

72 గంట‌ల్లోగా స్పందించాల‌ని నోటీసులు..

గ్రోక్‌లో కొంద‌రు యూజ‌ర్లు జ‌న‌రేట్ చేస్తున్న అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు, అస‌లు ఈ వెసులుబాటును ఎందుకు క‌ల్పిస్తున్నారో చెప్పాలంటూ గ్రోక్ మాతృ సంస్థ ఎక్స్ కార్ప్‌కు తాజాగా ఆ కేంద్ర మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై 72 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వ‌డంతోపాటు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో చెబుతూ ఓ నివేదిక‌(ఏటీఆర్‌)ను కూడా స‌మ‌ర్పించాల‌ని ఆ మంత్రిత్వ శాఖ ఎక్స్ కు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఎక్స్ లేదా గ్రోక్ ఇంకా అధికారికంగా స్పందించ‌లేదు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021 యాక్ట్ ప్ర‌కారం ఎక్స్ సంస్థ నియ‌మాల‌ను పాటించ‌డంలో విఫ‌లం అయింద‌ని కూడా ఆ మంత్రిత్వ శాఖ ఎక్స్‌కు ఇచ్చిన నోటీసుల్లో స్ప‌ష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ విష‌యంపై దుమారం చెల‌రేగుతుండ‌గా ఎక్స్ దీనిపై ఎలా స్పందిస్తున్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement