త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OnePlus Pad 4 | ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను ల్యాప్ టాప్ గా కూడా వాడుకోవ‌చ్చు.. లాంచ్ చేసిన వ‌న్ ప్ల‌స్‌..

OnePlus Pad 4 | మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ట్యాబ్ వ‌న్‌ప్ల‌స్ ప్యాడ్ 4ని భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఎంట‌ర్‌టెయిన్‌మెంట్‌, ప్రొఫెష‌న‌ల్ ప్రొడ‌క్ట‌విటీ కావాల‌నుకునే వారి కోసం ఈ ట్యాబ్‌ను లాంచ్ చేసిన‌ట్లు వ‌న్ ప్ల‌స్ తెలిపింది.

S

Technology | Published On May 1, 2026, 1.29 pm IST

OnePlus Pad 4  | ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను ల్యాప్ టాప్ గా కూడా వాడుకోవ‌చ్చు.. లాంచ్ చేసిన వ‌న్ ప్ల‌స్‌..
Advertisement

OnePlus Pad 4 | మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ట్యాబ్ వ‌న్‌ప్ల‌స్ ప్యాడ్ 4ని భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఎంట‌ర్‌టెయిన్‌మెంట్‌, ప్రొఫెష‌న‌ల్ ప్రొడ‌క్ట‌విటీ కావాల‌నుకునే వారి కోసం ఈ ట్యాబ్‌ను లాంచ్ చేసిన‌ట్లు వ‌న్ ప్ల‌స్ తెలిపింది. వ‌న్‌ప్ల‌స్ ప్యాడ్ 4 ట్యాబ్‌ను మెటల్ యూనిబాడీ డిజైన్‌తో రూపొందించారు. అందువ‌ల్ల ట్యాబ్‌కు ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఇక ఈ ట్యాబ్ కేవ‌లం 5.94 ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి అత్యంత స్లీక్ డిజైన్‌లో ఉంటుంది. కేవ‌లం 672 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది క‌నుక యూజ‌ర్లు ఎక్క‌డికైనా దీన్ని తీసుకెళ్ల‌వ‌చ్చు. ఈ ట్యాబ్‌ను భార‌త్‌లో డ్యూన్ గ్లో (బ్రాంజ్ టోన్‌), సేజ్ మిస్ట్ (ఫ్రాస్టెడ్ గ్రీన్‌) క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు.

ప్ర‌త్యేక కూలింగ్ టెక్నాల‌జీ..

ఈ ట్యాబ్‌లో చాలా శ‌క్తివంత‌మైన క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెస‌ర్ ఉంది. ఇది అంత‌కు ముందు వచ్చిన మోడ‌ల్స్ క‌న్నా 42 శాతం మెరుగైన ప‌నితీరును అందిస్తుంది. ఈ ట్యాబ్‌లో 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. అలాగే క్ర‌యో వెలాసిటీ కూలింగ్ టెక్నాల‌జీ ఉన్నందున హీట్‌ను నియంత్రిస్తుంది. గేమింగ్ స‌మ‌యంలోనూ ఉష్ణోగ్ర‌త‌ను సుమారు 38.6 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ద్ద ఉంచుతుంది. అందువ‌ల్ల ట్యాబ్ హీట్ అవ‌కుండా ఉంటుంది. ఈ ట్యాబ్‌కు ఏఐ ఆధారిత స్మార్ట్ యాంటెన్నా డిజైన్‌ను ఇచ్చారు. ఇది వైఫైని 5జి స్పీడ్‌తో అందిస్తుంది. అందువ‌ల్ల ఇంట‌ర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటుంది. ఈ ట్యాబ్‌లో 13.2 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 3.4కె రిజ‌ల్యూష‌న్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. ఔట్ డోర్‌లో విజిబిలిటీ కోసం డిస్‌ప్లేకు 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. అలాగే 12 బిట్ క‌ల‌ర్ డెప్త్‌ను ఇచ్చినందున ట్యాబ్ డిస్‌ప్లే విజువ‌ల్స్ అద్భుతంగా ఉంటాయి.

ల్యాప్‌టాప్‌గా కూడా..

ఈ ట్యాబ్‌లో ఆడియో కోసం 8 స్పీక‌ర్ల‌ను ఇచ్చారు. వాటిల్లో 4 వూఫ‌ర్లు, 4 ట్వీట‌ర్లు ఉన్నాయి. అందువ‌ల్ల సినిమాటిక్ స్పేషియ‌ల్ ఆడియో అనుభ‌వం ల‌భిస్తుంది. ఈ ట్యాబ్ లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజ‌న్ ఓఎస్‌16ను ఇచ్చారు. ఈ ట్యాబ్‌ను ల్యాప్ టాప్‌గా కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. ఒకేసారి తెర‌పై 5 విండోల‌ను ఓపెన్ చేసి మ‌ల్టీ టాస్కింగ్ చేయ‌వ‌చ్చు. ఏఐ రైట‌ర్‌, ఏఐ స‌మ్మ‌రీ, ఏఐ ట్రాన్స్‌లేట్‌, ఏఐ పెయింట‌ర్ వంటి ఏఐ ఫీచర్ల‌ను ఇందులో ఇచ్చారు. వ‌న్‌ప్ల‌స్ ఎకో సిస్ట‌మ్‌లో ఫోన్‌తో స్క్రీన్ మిర్రరింగ్‌, క్లిప్ బోర్డ్ షేరింగ్‌, వీడియో కాల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ వంటి స‌దుపాయాల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

భారీ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌..

ఈ ట్యాబ్‌కు స్టైల‌స్ స‌పోర్ట్ ఇచ్చారు. అయితే వ‌న్‌ప్ల‌స్ అందిస్తున్న స్టైలో ప్రొ పెన్‌ను విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్మార్ట్ కీబోర్డును కూడా విడిగా కొనుగోలు చేయాలి. ఇక ఈ ట్యాబ్‌ను 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. వైఫై 7, బ్లూటూత్ 6.0 వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాలు ఉన్నాయి. అలాగే 13,380 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఇందులో ఇచ్చారు. అందువ‌ల్ల బ్యాట‌రీ బ్యాక‌ప్ అధికంగా వ‌స్తుంది. అలాగే 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఉంది క‌నుక ట్యాబ్‌ను వేగంగా చార్జ్ చేసుకోవ‌చ్చు.

ధ‌ర వివ‌రాలు..

వ‌న్‌ప్ల‌స్ ప్యాడ్4 ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.59,999 ఉండ‌గా, 12జీబీ, 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.64,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను మే 5 నుంచి వ‌న్‌ప్ల‌స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్డ్ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌ల‌లో, ఇత‌ర స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు. లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా ఇస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో రూ.5వేల డిస్కౌంట్ ల‌భిస్తుంది. 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని ఇచ్చారు. అయితే ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేసే కొద్ది మంది యూజ‌ర్ల‌కు వ‌న్‌ప్ల‌స్ రూ.5,499 విలువైన స్టైలో ప్రొ పెన్ ను ఉచితంగా అందివ్వ‌నుంది.

Advertisement
Advertisement