OnePlus Nord CE6 | భారీ బ్యాటరీ, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో వచ్చిన వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్
OnePlus Nord CE6 | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ6ని భారత్‌లో గురువారం విడుదల చేసింది. రోజువారీ వినియోగం, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డివైస్‌లో బలమైన నిర్మాణం, ఆధునిక కెమెరా వ్యవస్థ, ఏఐ ఫీచర్లు సమగ్రంగా అందుబాటులో ఉన్నాయి.
Technology | Published On May 7, 2026, 2.51 pm IST
OnePlus Nord CE6 | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ6ని భారత్‌లో గురువారం విడుదల చేసింది. రోజువారీ వినియోగం, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డివైస్‌లో బలమైన నిర్మాణం, ఆధునిక కెమెరా వ్యవస్థ, ఏఐ ఫీచర్లు సమగ్రంగా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక ఫీచర్లు అందించారు. ఎంచుకున్న ప్రముఖ గేమ్స్‌లో 144ఎఫ్‌పీఎస్ వరకు ఫ్రేమ్‌రేట్లకు సపోర్ట్ లభిస్తుంది. బీజీఎంఐ గేమ్‌ను సుమారు 6 గంటల పాటు స్థిరమైన పనితీరుతో ఆడవచ్చని కంపెనీ తెలిపింది. టచ్ రెస్పాన్స్ కోసం ప్రత్యేక టచ్ రిఫ్లెక్స్ చిప్‌ను అందించారు. ఇది 3200 హెడ్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. అలాగే 6-యాక్సిస్ గేమింగ్ జైరోస్కోప్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ద్వారా కచ్చితమైన నియంత్రణ, హ్యాప్టిక్ వైబ్రేషన్ అనుభూతి లభిస్తుంది.
భారీ బ్యాటరీ, కాంతివంతమైన డిస్‌ప్లే..
ఫోన్ వేడిని నియంత్రించేందుకు 5,000 చదరపు మిల్లీమీటర్ల వేపర్ చాంబర్‌తో కూడిన అధునాతన వీసీ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. మొత్తం కూలింగ్ విస్తీర్ణం 33,147 చదరపు మిల్లీమీటర్లుగా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ6లో 6.78 ఇంచుల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది. ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపించేలా హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1800 నిట్స్ వరకు కాంతి లభిస్తుంది. ఆక్వా టచ్ 2.0 సపోర్ట్ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్ సరిగ్గా స్పందిస్తుంది. ఆడియో కోసం 300 శాతం అల్ట్రా వాల్యూమ్‌ను అందించే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో ఇది 2.5 రోజులకుపైగా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 80వాట్ల సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. ఆల్-స్కెనారియో బైపాస్ చార్జింగ్ ఫీచర్ ద్వారా గేమింగ్ లేదా ఇతర భారీస్థాయి పనుల సమయంలో బ్యాటరీకి బదులుగా నేరుగా చార్జర్ నుంచి పవర్ అందుతుంది. దీని వల్ల వేడి తగ్గుతుంది.
పవర్‌ఫుల్ కెమెరాలు..
27వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కేవలం 10 నిమిషాల రివర్స్ చార్జ్‌తో నార్డ్ బడ్స్ ప్రొ 4లో 12 గంటల వరకు స్పాటిఫై ప్లేబ్యాక్ సాధ్యమని కంపెనీ తెలిపింది. బ్యాటరీ హెల్త్ ఇంజిన్ ద్వారా 6 సంవత్సరాల వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని నిలుపుకునేలా డిజైన్ చేసినట్లు వెల్లడించింది. ఫోన్ వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్‌ను అందించారు. ఇందులో డ్యుయల్-యాక్సిస్ ఓఐఎస్ సపోర్ట్‌తో పాటు 4కే వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. ముందు భాగంలో 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. మల్టీ-పాయింట్ ఆటోఫోకస్, 4కే వీడియో రికార్డింగ్‌కు ఇది సపోర్ట్ ఇస్తుంది. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ ఎరేజర్, ఏఐ అన్‌బ్లర్ వంటి ఫోటో ఎడిటింగ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16పై పనిచేస్తుంది. 6 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ ఫ్లూయెన్సీని అందించేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

దృఢమైన బిల్డ్ క్వాలిటీ..
డస్ట్, వాటర్ రక్షణ కోసం ఈ ఫోన్‌కు ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ ఇచ్చారు. అదనంగా మిలిటరీ-గ్రేడ్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ టెస్టులను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఫ్రంట్ డిస్‌ప్లే రక్షణ కోసం క్రిస్టల్ గార్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఫ్రెష్ బ్లూ, లూనార్ పర్ల్, పిచ్ బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లను ఇచ్చారు. వెనుక వైపు 2 మెగాపిక్సల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. స్టీరియో స్పీకర్లు లభిస్తాయి. 5జికి సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.4, వైఫై 6 వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
ధర, ఆఫర్ల వివరాలు..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6కి చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.32,999గా ఉంది. దీనికి ప్రత్యేకంగా శాండ్ స్టోన్ మాగ్నెటిక్ కేస్‌ను ఇచ్చారు. దీని వినియోగదారులు రూ.799 ప్రత్యేక ధరకు విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ను మే 8 నుంచి వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా వినియోగదారులు పలు ఆఫర్లను సైతం పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై పూర్తి స్వైప్ లావాదేవీలకు రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఈఎంఐ లావాదేవీలపై రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్‌ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



