OnePlus Nord 6 | 9000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
OnePlus Nord 6 | మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 6 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గేమర్లు, పవర్ యూజర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫోన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
Technology | Published On Apr 8, 2026, 10.33 am IST
OnePlus Nord 6 | మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 6 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గేమర్లు, పవర్ యూజర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫోన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, హై కెపాసిటీ బ్యాటరీ, ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను అందిస్తున్నామని, ఇవి యూజర్లను ఎంతో ఆకట్టుకుంటాయని కంపెనీ పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్‌లో అధునాతన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. దీని వల్ల గేమింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అధిక గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లను కూడా 165 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌తో ఆడుకోవచ్చు. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి గేమ్‌లలో అద్భుతమైన గ్రాఫిక్స్‌ను, గేమింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ 6.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ,1.5కె రిజల్యూషన్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. అలాగే గేమ్స్ ను కూడా అధిక రిజల్యూషన్‌తో ఆడుకోవచ్చు.
9000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో డిస్‌ప్లేకు సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా 3600 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఈ డివైస్‌లో ప్రత్యేకంగా జి2 వైఫై చిప్‌ను ఇచ్చారు. అందువల్ల వైఫై సిగ్నల్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ఫోన్‌లో 9000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేయగా, దీన్ని ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. సాధారణ వాడకానికి ఈ ఫోన్ బ్యాటరీ రెండున్నర రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు కనుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవలం 70 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఈ ఫోన్‌కు 27 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను కూడా ఇచ్చారు. దీని సహాయంతో ఇతర ఫోన్లను లేదా డివైస్‌లను సైతం చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో బైపాస్ చార్జింగ్ అనే సదుపాయం కూడా ఉంది. దీని వల్ల ఫోన్‌కు చార్జర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు 100 శాతం చార్జింగ్ అయినా చార్జర్‌ను తీయకపోతే ఫోన్ నేరుగా విద్యుత్‌నే వాడుకుంటుంది. బ్యాటరీపై ఆధారపడదు. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఎక్కువ రోజుల పాటు మన్నికగా పనిచేస్తుంది.
ఏఐ టూల్స్, మిలిటరీ గ్రేడ్ క్వాలిటీ, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్..
ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది. ఈ కెమెరాలకు ఏఐ సదుపాయాలను అందిస్తున్నారు. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఎరేజర్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ పర్‌ఫెక్ట్ షాట్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ రీఫ్రేమ్ వంటి ఏఐ టూల్స్‌ను ఈ ఫోన్‌లో పొందవచ్చు. అలాగే గూగుల్ జెమిని ఏఐ తో అనుసంధానం అయి కూడా ఈ ఏఐ టూల్స్ పనిచేస్తాయి. ఇక టెక్ట్స్ కోసం ఏఐ రైటర్, ఏఐ స్కానర్ వంటి రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ ఏఐ టూల్స్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు ముందు వైపు క్రిస్టల్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉండగా, దీన్ని మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో రూపొందించారు. అందువల్ల ఫోన్ బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. ఎన్ని సార్లు కిందపడినా అంత సులభంగా పగలదు. అలాగే ఐపీ66, 68, 69, 69కె డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 లభిస్తుంది. దీనికి 4 ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది.
ఈ ఫోన్‌ను 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లను ఇచ్చారు. 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలు లభిస్తున్నాయి.
ధర వివరాలు..
వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్‌ను క్విక్ సిల్వర్, ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయగా, ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999 గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన శాండ్‌స్టోన్ మాగ్నెటిక్ కేస్‌ను అందుబాటులో ఉంచారు. లాంచింగ్ కింద దీన్ని రూ.799కే పొందవచ్చు. ఈ ఫోన్‌ను వన్ ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్స్‌లో ఏప్రిల్ 9 నుంచి విక్రయించనున్నారు. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో పూర్తి పేమెంట్ చెల్లించి ఈ ఫోన్‌ను కొంటే రూ.2వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిప్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో ఈఎంఐ విధానంలో ఈ ఫోన్‌ను కొంటే రూ.3వేల డిస్కౌంట్ ఇస్తారు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



