త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rega Kanta Rao | పెండ్లి పేరుతో లైంగికంగా వేధించాడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు న‌మోదు

Rega Kanta Rao | పెండ్లి పేరుతో ఓ యువ‌తిని లైంగికంగా వేధించాడంటూ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పిన‌పాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై (Rega Kanta Rao) కేసు న‌మోదైంది. త‌న‌తో స‌హ‌జీవ‌నం చేయ‌డంతోపాటు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబ‌డుల పేరుతో త‌న వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని మోసం చేశాడ‌ని ఆరోపిస్తూ ఓ యువ‌తి హైద‌రాబాద్‌ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

G

Telangana | Published On Jul 31, 2026, 12.43 pm IST

Rega Kanta Rao | పెండ్లి పేరుతో లైంగికంగా వేధించాడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు న‌మోదు
Advertisement

Rega Kanta Rao | త్రినేత్ర‌.న్యూస్‌: పెండ్లి పేరుతో ఓ యువ‌తిని లైంగికంగా వేధించాడంటూ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పిన‌పాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై (Rega Kanta Rao) కేసు న‌మోదైంది. త‌న‌తో స‌హ‌జీవ‌నం చేయ‌డంతోపాటు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబ‌డుల పేరుతో త‌న వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని మోసం చేశాడ‌ని ఆరోపిస్తూ ఓ యువ‌తి హైద‌రాబాద్‌ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. `తాను ఓ మీడియా సంస్థ‌లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. అప్పుడు నా వ‌య‌స్సు 18 ఏండ్ల 3 నెల‌లు (2022 సంవ‌త్స‌రంలో). ఒక ఇంట‌ర్వ్యూ నిమిత్తం మొద‌టిసారిగా రేగ కాంతారావును క‌లిశాను. ఆ త‌ర్వాత కొత్త‌గా యూట్యూబ్ చానెల్ ప్రారంభిస్తున్నాన‌ని న‌న్ను పిలిపించారు. పెండ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి లైంగికంగా బ‌ల‌వంతం చేశారు. అయితే 45 ఏండ్ల వ‌య‌స్సున్న మీరు.. న‌న్ను ఎలా వివాహం చేసుకుంటావ‌ని ప్ర‌శ్నించాను. అయితే కుటుంబంతో త‌న‌కు విభేదాలు ఉన్నాయ‌ని న‌న్ను ఒప్పించారు. దీంతో అమీర్‌పేట‌లో ఉంటున్న సంతోశ్ అనే న‌టుడికి చెందిన ఫ్లాట్‌లో స‌హ‌జీనం చేశాం. ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌పుడు అదే ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. ఈ క్ర‌మంలో నా ప్రైవేటు ఫొటోలు తీసుకున్న కాంతారావు.. తాను క‌ల‌వ‌డానికి నిరాక‌రించిన‌ప్పుడు వాటిని చూపిస్తూ బెదిరింపుల‌కు (Blackmail) పాల్ప‌డ‌టం ప్రారంభించారు. 2025 మ‌ధ్య‌కాలం వ‌ర‌కు శుభం అపార్టుమెంటులో త‌మ స‌హ‌జీవ‌నం కొన‌సాగింది.

ఆ త‌ర్వాత కొద్దికాలానికి రియ‌ల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారంలో పెట్టుబ‌డి పెడితే రెట్టింపు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తాన‌ని నా వ‌ద్ద రూ.4 ల‌క్ష‌లు తీసుకున్నాడు. అప్ప‌టి నుంచి నన్ను దూరం పెడుతూ వ‌చ్చాడు. ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించ‌డం మానేశాడు. అయితే ఆమెకు తెలియ‌కుండానే 2024 మే నెల‌లో నా ఫోన్‌లో నుంచి త‌న స్నేహితురాలి నంబ‌ర్ తీసుకున్న కాంతారావు.. ఆమెతో మాట్లాడ‌టం, క‌ల‌వ‌డం ప్రారంభించారు. త‌న‌తో క‌లిసి ఉంటున్న విష‌యాన్ని ఆమె అడిన‌ప్పుడు ఖండిచేవాడు. కాగా, 2026లో నేను అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌టంతో.. విష‌యం తెలుసుకున్న నా స్నేహితురాలు స‌హాయం చేస్తాన‌ని చెప్పింది. రేగా కాంతారావు సోష‌ల్ మీడియా (Social Media) వ్య‌వ‌హారాలు చేసే గుంట‌క ప్ర‌వీణ్ అనే వ్య‌క్తికి జ‌రిగిన విష‌యం చెప్పింది. దీంతో అత‌డు స‌మ‌స్య‌ను పెద్ద‌దిగా చేయ‌కుండా.. కాంతారావుతో స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత అత‌డు కూడా మొహం చాటేశాడు. అయితే నూకార‌పు ర‌మేశ్ అనే కాంట్రాక్ట‌ర్ డ‌బ్బు ఇస్తార‌ని చెప్పారు. మార్చి 16న రూ.5 ల‌క్ష‌లు, మార్చి 18న మ‌రో రూ.3.5 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఇదంతా నా ప్ర‌మేయం లేకుండానే జ‌రిగింది.

కాగా, అంత‌కుముందే కాంతారావు న‌న్ను మోసం చేసిన‌ట్లు షీ టీమ్స్‌కు (SHE Team) ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాను. దీంతో బ్యాంకు లావాదేవీల‌కు చూపించి.. డ‌బ్బు కోసం త‌న‌ను వేధిస్తున్న‌ద‌ని, ఆమె ఎవ‌రో నాకు అస‌లు తెలియ‌ద‌ని కాంతారావు చెప్పారు. నేను ఇచ్చిన డ‌బ్బు తిరిగి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇది డ‌బ్బుకు స‌మ‌స్య కాదు, వివాహానికి సంబంధించింది. వివాహం చేసుకుంటాడ‌నే హామీతే నేను నాలుగు సంవ‌త్స‌రాలు కాంతారావుతో క‌లిసి (Physical Relationship) జీవించాను. ఆ స‌మ‌యంలో న‌న్ను తీవ్ర లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు. పెండ్లి పేరుతో లైంగికంగా లోబ‌ర్చుకోవ‌డం, అబ‌ద్ద‌పు హామీతో (False Promises) మోసం చేయ‌డంపై అత‌నిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి. రేగా కాంతారావు, అత‌ని మ‌నుషుల నుంచి నాకు ఎలాంటి ముప్పు వాటిళ్ల‌కుండా చూడాలి` అంటూ బాధిత యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ ఆరోపణలపై రేగా కాంతారావు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Advertisement