Yellampalli Project | ఎల్లంపల్లికి పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల
Yellampalli Project | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు (Yellampalli Project) వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Yellampalli Project | త్రినేత్ర.న్యూస్: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు (Yellampalli Project) వరద పోటెత్తింది (Heavy Flood Water). దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,21,354 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 1,08,493 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు గోదావరి (Godavari River) ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద నీటిమట్టం పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 103.30 గంటల సమయంలో గోదావరి ప్రవాహం 43 గంటలకు చేరింది. కల్యాణకట్ట, స్నానఘట్టాలు వరద నీటిలో ముగినిపోయాయి. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల వల్ల నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ములుగు జిల్లాలోని మేడిగడ్డ (Medigadda) నుంచి 8.35 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు వెళ్తున్నది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీ 59 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నదిపై ఉన్న శ్రీరామసాగర్, కడెం, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు భారీ వరద వస్తుండటంతో అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!




