త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Gemini | గూగుల్ జెమినిలో వ‌చ్చిన‌ అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. పీడీఎఫ్‌, వ‌ర్డ్‌, ఎక్సెల్ ఫైల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు..

Google Gemini | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యూజర్లు తాము క్రియేట్ చేసుకునే పీడీఎఫ్‌, వ‌ర్డ్‌, ఎక్సెల్ లాంటి ఫైల్స్ కోసం జెమిని యాప్‌ను వ‌దిలి ఇంకో యాప్‌కు మారాల్సిన ప‌నిలేదు. జెమిని యాప్‌లోనే ఆ ఫైల్స్‌ను క్రియేట్ చేయ‌వ‌చ్చు.

S

Technology | Published On May 1, 2026, 10.23 am IST

Google Gemini | గూగుల్ జెమినిలో వ‌చ్చిన‌ అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. పీడీఎఫ్‌, వ‌ర్డ్‌, ఎక్సెల్ ఫైల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు..
Advertisement

Google Gemini | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యూజర్లు తాము క్రియేట్ చేసుకునే పీడీఎఫ్‌, వ‌ర్డ్‌, ఎక్సెల్ లాంటి ఫైల్స్ కోసం జెమిని యాప్‌ను వ‌దిలి ఇంకో యాప్‌కు మారాల్సిన ప‌నిలేదు. జెమిని యాప్‌లోనే ఆ ఫైల్స్‌ను క్రియేట్ చేయ‌వ‌చ్చు. అందుకు కావ‌ల్సిన ప్రాంప్ట్‌తోపాటు యూజ‌ర్ కావాల‌నుకున్న టెక్ట్స్ లేదా సమాచారాన్ని ఇస్తే స‌రిపోతుంది. దీంతో యూజ‌ర్‌కు కావ‌ల్సిన విధంగా ఫైల్‌ను జెమిని క్రియేట్ చేసి ఇస్తుంది. దీని వ‌ల్ల యూజ‌ర్లు జెమిని ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకో యాప్ లేదా సైట్‌కు మారాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే అలా క్రియేట్ చేసిన ఫైల్‌ను ఇత‌రుల‌కు అక్క‌డి నుంచే షేర్ చేయ‌వ‌చ్చు.

ప్రాంప్ట్‌, స‌మాచారం ఇస్తే చాలు..

సాధార‌ణంగా భిన్న ర‌కాల యాప్ ల‌ను మార్చి మార్చి వాడ‌డం వ‌ల్ల యూజ‌ర్ల‌కు స‌మ‌యం ఎక్కువ ప‌డుతుంది. అలాగే స‌మాచారాన్ని త‌రచూ కాపీ, పేస్ట్ చేస్తూ ఉండాలి. కానీ జెమిని యాప్‌లో వ‌చ్చిన ఈ ఫైల్ క్రియేష‌న్ ఫీచ‌ర్ వ‌ల్ల త‌ర‌చూ యాప్‌ల మధ్య మారాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. స‌మ‌యం కూడా ఎంతో ఆదా అవుతుంది. యూజ‌ర్లు జెమిని యాప్‌లో త‌మకు కావ‌ల్సిన టెక్ట్స్‌తోపాటు దాన్ని ఏ ఫైల్‌లో కావాల‌నుకుంటున్నారో ఆ ఫైల్ ఎక్స్‌టెన్ష‌న్‌తో ప్రాంప్ట్ ఇస్తే స‌రిపోతుంది. అదే ఎక్స్‌టెన్ష‌న్‌లో జెమిని యాప్ ఫైల్ ను క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని యూజ‌ర్ డివైస్‌లో డౌన్ లోడ్ చేయ‌వ‌చ్చు. లేదా ఇత‌రుల‌కు షేర్ చేయ‌వ‌చ్చు.

వివిధ ర‌కాల ఫైల్ ఫార్మాట్ల‌కు స‌పోర్ట్‌..

ఇక ప్ర‌స్తుతం ప‌లు భిన్న ర‌కాల ఫైల్స్‌ను క్రియేట్ చేసేందుకు జెమిని అనుమ‌తిస్తోంది. పీడీఎఫ్ ఫైల్స్‌తోపాటు మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌, ఎక్సెల్ ఫైల్స్‌, గూగుల్ డాక్స్‌, షీట్స్‌, స్లైడ్‌ల‌ను జెమిని యాప్ లోనే క్రియేట్ చేయ‌వ‌చ్చు. అలాగే క్రియేట్ చేసిన ఫైల్స్‌ను యూజ‌ర్లు తమ గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకోవ‌చ్చు. టెక్ట్స్‌, ఆర్‌టీఎఫ్‌, ఎండీ, లాటెక్స్‌, సీఎస్‌వీ వంటి ఫైల్ ఫార్మాట్‌ల‌కు కూడా జెమిని స‌పోర్ట్‌ను ఇస్తోంది. ఇక ఈ ఫీచ‌ర్ ద్వారా ఫైల్‌ల‌ను ఎలా క్రియేట్ చేయాలో ఉదాహ‌ర‌ణల‌ ద్వారా చూద్దాం.

ఉదాహ‌ర‌ణ‌లు చూస్తే..

మీరు మీ కంపెనీ లేదా ఇంటి బ‌డ్జెట్ వివ‌రాల‌ను లిస్ట్ రూపంలో పెట్టుకుని ఉంటే దాన్ని జెమిని యాప్‌లో పేస్ట్ చేసి అక్క‌డ ఎక్సెల్ లో కావాల‌ని అడిగితే ఆ లిస్ట్ మొత్తం ఎక్సెల్ ఫైల్‌లోకి మారి అది డౌన్‌లోడ్‌ను సిద్ధం చేస్తుంది. అలాగే మీ దగ్గ‌ర ఏదైనా సుదీర్ఘ స‌మాచారం ఉంటే, దాన్ని పీడీఎఫ్ గా మార్చాల‌ని చూస్తే, జెమిని యాప్‌లో పేస్ట్ చేసి పీడీఎఫ్ అడ‌గ‌వ‌చ్చు. దీంతో ఈ స‌మాచారం పీడీఎఫ్ ఫైల్ రూపంలో క్రియేట్ అవుతుంది. త‌రువాత డౌన్‌లోడ్‌కు లేదా షేరింగ్‌కు ఆ ఫైల్ సిద్ధంగా ఉంటుంది. ఇలా ఈ కొత్త ఫైల్స్ క్రియేష‌న్ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. ఈ ఫీచ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫ్రీ, పెయిడ్ యూజర్లు అంద‌రికీ అందుబాటులో ఉంద‌ని గూగుల్ తెలిపింది. వెబ్ ప్లాట్‌ఫామ్‌లో దీన్ని నేరుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. యాప్‌లో అయితే కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ అవ్వాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement