NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు
NEHS | ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (NEHS) పరిధిలోని రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని కార్పొరేట్ ఆస్పత్రులను ఆదేశించారు.
- ఎన్‌ఈహెచ్‌ఎస్ అమలుపై కీలక ఆదేశాలు..
- పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి..
- చికిత్సల ధరల్లో పారదర్శకత ఉండాలి
- ఎన్ఈఎస్‌హెచ్‌పై బోర్డు సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు
NEHS | ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (NEHS) పరిధిలోని రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని కార్పొరేట్ ఆస్పత్రులను ఆదేశించారు. పాత బకాయిలను త్వరగా పరిష్కరించాలని, వైద్య బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఎన్‌ఈహెచ్‌ఎస్ బోర్డు సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు పథకం అమలుతీరును సమీక్షించారు. ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులతో మాట్లాడిన సీఎస్
ఈ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఉద్యోగ సంఘాల నాయకులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సీఎస్ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఆయా ఫిర్యాదులపై వివరణ కోరారు. ఎన్‌ఈహెచ్‌ఎస్ పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు చికిత్స అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కల్పించకూడదని స్పష్టం చేశారు. పాత బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, చికిత్సలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.

ధరల్లో పారదర్శకత
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సీఎస్ కోరారు. వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికిత్సల ఛార్జీలను క్రమబద్ధీకరించడంతోపాటు ఆస్పత్రుల జవాబుదారీతనాన్ని పెంచాలని సూచించారు. వైద్య సేవల ధరల నిర్ణయంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) నిర్దేశించిన ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బీఎండీ ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, యోగితా రాణా, శిఖా గోయల్, సర్ఫరాజ్ అహ్మద్, గౌరవ్ ఉప్పల్, శృతి ఓజా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
- ●Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
- ●Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు
- ●Bhatti Vikramarka | పాత బస్తీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు
- ●WhatsApp | వాట్సాప్లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారికీ ఈవెంట్ ఆహ్వానాలు..
- ●IND Vs NZ ODI | రేపు న్యూజిలాండ్తో రెండో వన్డే.. మ్యాచ్కు వానగండం..?

Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్

Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..

Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు

Bhatti Vikramarka | పాత బస్తీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు





