Aadhaar | ఇక ఆధార్‌లో ఈ-మెయిల్ అప్‌డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..
Aadhaar | ఆధార్ సేవలను మరింత సులభంగా, పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ హోల్డర్లు అధికారిక మొబైల్ యాప్ ద్వారా తమ ఈ-మెయిల్ అడ్రస్‌ను నేరుగా చేర్చడంతోపాటు అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.
Technology | Published On Jul 3, 2026, 4.59 pm IST
Aadhaar | ఆధార్ సేవలను మరింత సులభంగా, పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ హోల్డర్లు అధికారిక మొబైల్ యాప్ ద్వారా తమ ఈ-మెయిల్ అడ్రస్‌ను నేరుగా చేర్చడంతోపాటు అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఈ-మెయిల్ మార్పుల కోసం ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదు. ఈ కొత్త సేవ పూర్తిగా అధికారిక మొబైల్ అప్లికేషన్‌లో మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ప్రారంభ దశలో ఆరు నెలల పాటు అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ ఇండియా కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా, గుర్తింపు సంబంధిత కీలక సేవలను సురక్షితమైన డిజిటల్ మార్గాల ద్వారా మరింత సులభతరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని యూఐడీఏఐ వెల్లడించింది.
విశేష రీతిలో స్పందన..
ఈ ఫీచర్ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే విశేష స్పందన లభించింది. కేవలం 48 గంటల్లోనే 2.50 లక్షలకు పైగా ఈ-మెయిల్ అప్‌డేట్‌లు నమోదయ్యాయని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్‌కు ఈ-మెయిల్ అడ్రస్‌ను అనుసంధానం చేయడం వల్ల వినియోగదారులకు పలు ప్రయోజనాలు లభిస్తాయి. ఆధార్ ద్వారా ఏదైనా ఆథెంటికేషన్ జరిగిన వెంటనే ఈ-మెయిల్ ద్వారా తక్షణ నోటిఫికేషన్ అందుతుంది. దీంతో ఆధార్ వినియోగానికి సంబంధించిన పూర్తి ట్రాన్సాక్షన్ చరిత్రను సులభంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అలాగే అనుమతి లేకుండా ఎవరైనా ఆధార్‌ను ఉపయోగించే ప్రయత్నం చేస్తే వెంటనే సమాచారం అందడంతో భద్రత కూడా మరింత బలోపేతం అవుతుంది. యూఐడీఏఐ అధికారిక మొబైల్ యాప్‌లో ఇప్పటికే అనేక స్వీయ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 40 లక్షలకు పైగా మొబైల్ నంబర్ అప్‌డేట్‌లు, సుమారు 10 లక్షల అడ్రస్ అప్‌డేట్‌లు, అలాగే కొత్త ఫీచర్ ప్రారంభమైన తొలి 48 గంటల్లోనే 2.5 లక్షలకు పైగా ఈ-మెయిల్ అప్‌డేట్‌లు నమోదయ్యాయి.
యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్ డేట్ చేయాలి..
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు తమ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఓఎస్ అధికారిక యాప్ స్టోర్ నుంచి యూఐడీఏఐ అధికారిక యాప్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అర్హులైన ఆధార్ హోల్డర్లు తమ ప్రొఫైల్‌ను పరిశీలించి, నిర్ణయించిన ఆరు నెలల వ్యవధిలోపు ఈ-మెయిల్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. తద్వారా భవిష్యత్తులో డిజిటల్ నోటిఫికేషన్లు ఎలాంటి అంతరాయం లేకుండా అందుతాయి.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
జులై 10, 2026

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
జులై 9, 2026

Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Vaddiraju Ravichandra | ఎస్ఐఆర్ 10 శాతమే పూర్తయింది.. ఇంకా సమయం పెంచాలి
- ●Horror OTT | ఓటీటీలోకి మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు హారర్ మూవీ - కాటేరమ్మ కథతో
- ●Harish Rao | రేవంత్.. పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి.. నాది కాదు : హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | 'భట్టి' కన్నెర్ర జేస్తే 'బీఆర్ఎస్' భస్మమైతది.. సీఎం రేవంత్ ఛలోక్తి
- ●Meenakshi Chaudhary | శాండల్‌వుడ్‌లోకి మీనాక్షి - కేజీఎఫ్ హీరోతో రొమాన్స్
- ●Fire Accident | చాదర్‌ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసెలు

Vaddiraju Ravichandra | ఎస్ఐఆర్ 10 శాతమే పూర్తయింది.. ఇంకా సమయం పెంచాలి

Horror OTT | ఓటీటీలోకి మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు హారర్ మూవీ - కాటేరమ్మ కథతో

Harish Rao | రేవంత్.. పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి.. నాది కాదు : హరీశ్‌రావు

CM Revanth Reddy | 'భట్టి' కన్నెర్ర జేస్తే 'బీఆర్ఎస్' భస్మమైతది.. సీఎం రేవంత్ ఛలోక్తి



