త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CMF Watch 3 Pro | న‌థింగ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌.. అదిరిపోయింది.. ధ‌ర త‌క్కువే..

CMF Watch 3 Pro | స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ న‌థింగ్‌కు చెందిన స‌బ్‌బ్రాండ్ సీఎంఎఫ్ త‌న నూత‌న స్మార్ట్ వాచ్ సీఎంఎఫ్ వాచ్ 3 ప్రొని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రోజువారీ వినియోగంతోపాటు ఫిట్ నెస్ ట్రాకింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వాచ్‌ను రూపొందించారు.

S

Technology | Published On May 6, 2026, 3.51 pm IST

CMF Watch 3 Pro  | న‌థింగ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌.. అదిరిపోయింది.. ధ‌ర త‌క్కువే..
Advertisement

CMF Watch 3 Pro | స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ న‌థింగ్‌కు చెందిన స‌బ్‌బ్రాండ్ సీఎంఎఫ్ త‌న నూత‌న స్మార్ట్ వాచ్ సీఎంఎఫ్ వాచ్ 3 ప్రొని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రోజువారీ వినియోగంతోపాటు ఫిట్ నెస్ ట్రాకింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వాచ్‌ను రూపొందించారు. గ‌తంలో వ‌చ్చిన వాచ్ ప్రొ 2 మోడ‌ల్‌తో పోలిస్తే ప‌లు హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌ల‌ను ఇందులో ఇచ్చారు. అలాగే ఏఐ ఫీచ‌ర్ల‌ను కూడా ఇచ్చారు. వాచ్ 3 ప్రొ మోడ‌ల్‌లో ఫిట్ నెస్ ట్రాకింగ్ కోసం అనేక స‌దుపాయాల‌ను ఇచ్చారు. ఇందులో డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, జీపీఎస్ సపోర్ట్ ఉంది. దీని వ‌ల్ల లొకేష‌న్‌ను మెరుగ్గా తెలుసుకోవ‌చ్చు. ఇందులో 131 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇచ్చారు. 7 ర‌కాల యాక్టివిటీల‌ను ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది.

4 ఛాన‌ల్ హార్ట్ రేట్ సెన్సార్‌..

ఈ వాచ్‌లో కొత్త‌గా 4 ఛాన‌ల్ హార్ట్ రేట్ సెన్సార్‌ను ఇచ్చారు. దీని వ‌ల్ల చ‌ర్మం వివిధ ర‌కాల రంగుల్లోకి మారినా, వ‌ర్కవుట్ స‌మ‌యాల్లోనూ క‌చ్చితమైన రీడింగ్స్‌ను ఇస్తుంది. 6 యాక్సిస్ యాక్స‌ల‌రోమీట‌ర్ కూడా ఉండ‌డంతో మోష‌న్ ట్రాకింగ్ మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తుంది. పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్‌లో యాక్టివ్ స్కోర్ అనే ఫీచ‌ర్‌ను ఇచ్చారు. ఇది వీకెండ్స్‌లో ఫిట్ నెస్ అంచ‌నాను ఇస్తుంది. వ‌ర్కవుట్ త‌రువాత ఏఐ ఆధారిత స‌మ్మ‌రీతో ట్రైనింగ్ లోడ్‌, రిక‌వ‌రీ టైమ్‌, 5కె, 10కె ర‌న్‌ల‌కు సంబంధించిన అంచ‌నాల‌ను తెలుసుకోవ‌చ్చు. రోజువారీ ఆరోగ్య స‌దుపాయాల్లో భాగంగా బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్‌పీవో2 సెన్సార్‌) మానిట‌రింగ్‌, స్ట్రెస్ ట్రాకింగ్‌, గైడెడ్ బ్రీతింగ్‌, వాట‌ర్ రిమైండ‌ర్స్‌, ఇనాక్టివిటీ అల‌ర్ట్స్‌, మ‌హిళ‌ల హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు.

చాట్ జీపీటీతో అనుసంధానం..

ఈ వాచ్‌ను న‌థింగ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో స‌మ‌న్వ‌యం చెందే విధంగా రూప‌క‌ల్ప‌న చేశారు. అందువ‌ల్ల న‌థింగ్ ఫోన్ యూజ‌ర్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న పొంద‌వ‌చ్చు. ఈ వాచ్‌లో చాట్ జీపీటీని అనుసంధానించారు. దీని వ‌ల్ల యూజ‌ర్లు వాయిస్ క‌మాండ్ల స‌హాయంతో ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌చ్చు. రిమైండ‌ర్లు సెట్ చేసుకోవ‌చ్చు. ఈ వాచ్‌లో ఉన్న వాయిస్ రికార్డ‌ర్ స‌దుపాయంతో ఆటో ట్రాన్స్‌క్రిప్ష‌న్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. ఎసెన్షియల్ న్యూస్ ఫీచ‌ర్ ద్వారా రోజువారీ వార్త‌ల స‌మ్మ‌రీని తెలుసుకోవ‌చ్చు. బ్లూటూత్ కాలింగ్‌కు అద‌నపు మైక్రోఫోన్‌ను ఇచ్చారు. గెస్చ‌ర్ షార్ట్ క‌ట్స్‌, 140 క్యారెక్ట‌ర్ క్లిక్ రిప్లైస్ వంటి స‌దుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

13 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ..

ఈ వాచ్ మెట‌ల్ బాడీని క‌లిగి ఉంటుంది. సాఫ్ట్ సిలికాన్ స్ట్రాప్స్‌తో వ‌స్తుంది. ఐపీ68 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్‌ను కూడా ఇచ్చారు. 1.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. అల్ట్రా-లో బెజెల్స్‌తో వ‌స్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 ర‌కాల‌కు పైగా క‌స్ట‌మైజ‌బుల్ వాచ్ ఫేస్‌లు ల‌భిస్తాయి. వాటిల్లో వీడియో, ఫొటో, ఏఐ జ‌న‌రేటెడ్ ఫేస్‌లు కూడా ఉన్నాయి. ఈ వాచ్‌ను ఒక్క‌సారి ఫుల్ చార్జ్ చేస్తే సాధార‌ణ వాడ‌కానికి 13 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంద‌ని కంపెనీ తెలిపింది. అధికంగా వాడితే 11 రోజుల వ‌ర‌కు బ్యాక‌ప్ వ‌స్తుంద‌ని తెలియ‌జేసింది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఆన్‌లో ఉంటే మాత్రం బ్యాట‌రీ 4 రోజులే బ్యాక‌ప్ వ‌స్తుంది. ఇక పూర్తి చార్జింగ్‌కు దాదాపుగా 100 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది.

ధ‌ర వివ‌రాలు..

ఈ లాంచ్‌తో పాటు సీఎంఎఫ్ తన అన్ని స్మార్ట్‌వాచ్‌లను న‌థింగ్ ఎక్స్ యాప్‌కు మార్చుతోంది. ఈ యాప్ ద్వారా వాచ్, ఆడియో డివైస్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో మేనేజ్ చేయ‌వ‌చ్చు. అలాగే స్ట్రావా, యాపిల్ హెల్త్‌, గూగుల్ హెల్త్ క‌నెక్ట్ తో కూడా ఇంటిగ్రేషన్ ఉంది. ఆయా ప్లాట్‌ఫామ్‌ల‌లోనూ ఈ వాచ్ ను ఉప‌యోగించుకోవ‌చ్చు. సీఎంఎఫ్ వాచ్ 3 ప్రొ స్మార్ఠ్ వాచ్‌ ధర రూ.7,999గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌గా రూ.6,999కి అందిస్తున్నారు. మే 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎర్లీ బర్డ్ సేల్ ప్రారంభమవుతుంది. మే 8 నుంచి సాధారణ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది.

Advertisement
Advertisement