NoiseFit Halo 3 | క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసే సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫోన్‌ను బయటకు తీయాల్సిన పనిలేదు.. ధర చాలా తక్కువ..
NoiseFit Halo 3 | నాయిస్ సంస్థ తన ప్రీమియం స్మార్ట్‌వాచ్ సిరీస్‌లో భాగంగా కొత్త నాయిస్ ఫిట్ హాలో 3ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. క్లాసిక్ రౌండ్ డయల్ డిజైన్, మెటల్ బాడీ, ఏఐ ఆధారిత ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌వాచ్‌ను స్టైల్, ప్రొడక్టివిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాచ్‌లో 1.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు.
Technology | Published On May 9, 2026, 11.55 am IST
NoiseFit Halo 3 | నాయిస్ సంస్థ తన ప్రీమియం స్మార్ట్‌వాచ్ సిరీస్‌లో భాగంగా కొత్త నాయిస్ ఫిట్ హాలో 3ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. క్లాసిక్ రౌండ్ డయల్ డిజైన్, మెటల్ బాడీ, ఏఐ ఆధారిత ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌వాచ్‌ను స్టైల్, ప్రొడక్టివిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాచ్‌లో 1.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లేకు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో సూర్యకాంతిలో కూడా క్లియర్ విజిబిలిటీ లభిస్తుందని పేర్కొంది. రౌండ్ డయల్ చుట్టూ ప్రెసిషన్ కట్ డీటైలింగ్, ఇంటిగ్రేటెడ్ స్ట్రాప్ లేఔట్ వంటి డిజైన్ అంశాలు సంప్రదాయ డ్రెస్ వాచ్‌లను తలపించేలా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
ప్రత్యేక ఏఐ ప్రొ సిస్టమ్..
ఈ స్మార్ట్‌వాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నాయిస్ ఏఐ ప్రొ సిస్టమ్ నిలిచింది. ఇది వాయిస్ కమాండ్స్, వాయిస్ రికార్డింగ్, ఏఐ ట్రాన్స్‌క్రిప్షన్, పర్సనలైజ్డ్ వాల్‌పేపర్స్, మార్నింగ్ బ్రీఫ్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. యూజర్ నిద్ర, యాక్టివిటీ, హెల్త్ డేటా ఆధారంగా ప్రతి ఉదయం సమ్మరీలను అందించే విధంగా దీన్ని రూపొందించారు. మాట్లాడిన వాయిస్ నోట్స్‌ను టెక్స్ట్‌గా మార్చే సదుపాయం కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సూపర్ నోటిఫికేషన్స్ అనే ఫీచర్‌ను కూడా అందించారు. దీని ద్వారా ఓటీపీలు, రైడ్ స్టేటస్ అప్‌డేట్స్, డెలివరీ అలర్ట్స్ వంటి ముఖ్యమైన నోటిఫికేషన్లు నేరుగా వాచ్‌లోనే కనిపిస్తాయి. అదనంగా కస్టమైజ్ చేసుకునే స్మార్ట్ డ్యాష్ బోర్డు ద్వారా ఐదు వరకు విడ్జెట్లను సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్, ఏక్యూఐ అప్‌డేట్స్, హైడ్రేషన్ ట్రాకింగ్, స్లీప్ ఇన్‌సైట్స్ వంటి విడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫోన్ బయటకు తీయాల్సిన పనిలేదు..
నాయిస్ వాల్ట్ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. దీని ద్వారా ఫ్లైట్ బోర్డింగ్ పాసులు, మూవీ టికెట్లు, కాన్సర్ట్ పాస్‌లు, ఇతర క్యూఆర్ కోడ్స్‌ను వాచ్‌లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్ల వద్ద ఫోన్ తీసే అవసరం లేకుండా నేరుగా వాచ్ నుంచే స్కాన్ చేసే సదుపాయం ఉంటుంది. హెల్త్ ఫీచర్ల పరంగా హార్ట్‌రేట్ మానిటరింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, ఎస్‌పీవో2 మానిటరింగ్, కంటిన్యూస్ ఆల్‌డే హెల్త్ ట్రాకింగ్ సపోర్ట్ ఇచ్చారు. వన్‌ట్యాప్ హెల్త్ చెక్ సిస్టమ్‌ను కూడా అందించారు. అదనంగా మల్టీ స్పోర్ట్స్ మోడ్‌లు, హైడ్రేషన్ ట్రాకింగ్ వంటి ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. వాచ్‌కు 10 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ఇది కనెక్ట్ అవుతుంది. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 7 రోజుల వరకు పనిచేస్తుందని నాయిస్ సంస్థ తెలిపింది.
ధర ఎంతంటే..
స్ట్రాప్ ఆప్షన్స్‌లో మెటల్, లెదర్, సిలికాన్ వేరియంట్లు ఉన్నాయి. కలర్ వేరియంట్లలో మెటల్ బ్లాక్, లెదర్ బ్రౌన్, లెదర్ బ్లూ, సిలికాన్ బ్లాక్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌కు ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. భారత మార్కెట్‌లో నాయిస్‌ఫిట్ హాలో 3 వాచ్ ప్రారంభ ధర రూ.5,499గా ఉంది. గోనాయిస్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వాచ్‌ను విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం






