త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు

Delhi AIIMS | శరీరాకృతి చిన్నగా ఉండటం.. ఎముకలు అత్యంత బలహీనంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం వైద్యులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ, అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్‌ నిర్వహించి ఓ మహిళకు ప్రాణాపాయం త‌ప్పించారు ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు. కేవలం 98 సెంటీమీటర్ల ఎత్తు, 22 కిలోల బరువున్న 44 ఏళ్ల మహిళకు 90 నిమిషాల్లో గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.

P

National | Published On Oct 16, 2026, 7.37 pm IST

Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు
Advertisement

Delhi AIIMS | శరీరాకృతి చిన్నగా ఉండటం.. ఎముకలు అత్యంత బలహీనంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం వైద్యులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ, అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్‌ నిర్వహించి ఓ మహిళకు ప్రాణాపాయం త‌ప్పించారు ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు. కేవలం 98 సెంటీమీటర్ల ఎత్తు, 22 కిలోల బరువున్న 44 ఏళ్ల మహిళకు 90 నిమిషాల్లో గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్‌ అనంతరం ఆమె కోలుకోవడంతో మూడో రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సదరు మహిళ గర్భాశయ సంబంధిత సమస్యలతో పాటు తీవ్రమైన కటి నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ది. వైద్య పరీక్షల్లో ఆమెకు డీప్‌ ఎండోమెట్రియోసిస్‌, అడెనోమయోసిస్‌తో పాటు ఎముకల సాంద్రత తగ్గి బలహీనంగా మారే ఆస్టియోపోరోసిస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, ఎముకలు బలహీనంగా ఉండటంతో చిన్నపాటి ఒత్తిడికే ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఉంది. దీంతో శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి వచ్చింది.

ప్రత్యేక జాగ్రత్తలతో ఆపరేషన్‌..

ఎయిమ్స్‌ ప్రసూతి, స్త్రీల విభాగం ప్రొఫెసర్లు డాక్టర్‌ రీటా మహే, డాక్టర్‌ స్వాతి తోమర్‌ నేతృత్వంలో వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేపట్టింది. మహిళ శరీరాకృతి, ఎముకల బలహీనతను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆపరేషన్‌ సమయంలో ఎముకలపై అనవసర ఒత్తిడి పడకుండా శరీరాన్ని సరైన స్థితిలో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. అనస్థీషియా ఇవ్వడం, శ్వాసనాళానికి సంబంధించిన ఏర్పాట్లలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద కోతలు పెట్టకుండా చిన్న రంధ్రాల ద్వారా కెమెరా, ప్రత్యేక పరికరాల సాయంతో నిర్వహించే ల్యాపరోస్కోపిక్‌ విధానంలో గర్భాశయాన్ని తొలగించారు. సుమారు 90 నిమిషాల్లోనే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం మహిళ ఆరోగ్యం కుదుటపడటంతో మూడో రోజునే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఆస్టియోపోరోసిస్‌తో ఫ్రాక్చర్ల ముప్పు

ఆస్టియోపోరోసిస్‌ కారణంగా ఎముకల సాంద్రత తగ్గి అవి పెళుసుగా మారుతాయని డాక్టర్‌ రీటా మహే వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వల్ప గాయం, ఒత్తిడితోనూ ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుందని తెలిపారు. మహిళ ఎత్తు, బరువు సాధారణ స్థాయులతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటంతో శస్త్రచికిత్సలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పద్ధతులు, సమన్వయంతో కూడిన వైద్య సంరక్షణ వల్ల ఆపరేషన్‌ విజయవంతమైందని వివరించారు.

Advertisement
Advertisement