త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noise REP Band | నాయిస్‌ రెప్‌ బ్యాండ్‌కు భారీ డిమాండ్.. తొలిరోజే 35 వేల యూనిట్ల విక్ర‌యం..

Noise REP Band | స్మార్ట్‌ వేరబుల్‌ బ్రాండ్‌ నాయిస్‌ తొలిసారిగా విడుదల చేసిన స్క్రీన్‌లెస్‌ పరికరం నాయిస్‌ రెప్‌ బ్యాండ్‌కు మార్కెట్‌లో భారీ స్పందన లభించింది. మార్కెట్‌లోకి విడుదలైన 24 గంటల్లోనే ప్రారంభ స్టాక్‌ మొత్తం అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది. తొలి రోజు అందుబాటులోకి వచ్చిన సమయంలో 35 వేలకు పైగా యూనిట్లు కొనుగోలు చేసినట్లు నాయిస్‌ తెలిపింది.

S

Technology | Published On Aug 11, 2026, 3.35 pm IST

Noise REP Band | నాయిస్‌ రెప్‌ బ్యాండ్‌కు భారీ డిమాండ్.. తొలిరోజే 35 వేల యూనిట్ల విక్ర‌యం..
Advertisement

Noise REP Band | స్మార్ట్‌ వేరబుల్‌ బ్రాండ్‌ నాయిస్‌ తొలిసారిగా విడుదల చేసిన స్క్రీన్‌లెస్‌ పరికరం నాయిస్‌ రెప్‌ బ్యాండ్‌కు మార్కెట్‌లో భారీ స్పందన లభించింది. మార్కెట్‌లోకి విడుదలైన 24 గంటల్లోనే ప్రారంభ స్టాక్‌ మొత్తం అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది. తొలి రోజు అందుబాటులోకి వచ్చిన సమయంలో 35 వేలకు పైగా యూనిట్లు కొనుగోలు చేసినట్లు నాయిస్‌ తెలిపింది. సాంప్రదాయ డిస్‌ప్లే ఆధారిత నోటిఫికేషన్లకు బదులుగా నిరంతర బయోమెట్రిక్‌ పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ఆరోగ్య కేంద్రిత పరికరాలపై వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోందని ఈ స్పందన సూచిస్తోంది. ముఖ్యంగా రికవరీ మెట్రిక్స్‌, నిద్ర పర్యవేక్షణ, ఒత్తిడి నిర్వహణ వంటి అంశాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో స్క్రీన్‌లెస్‌ వేరబుల్స్‌ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. తరచూ డిజిటల్‌ అలర్ట్‌లను చూడకుండా ఆరోగ్యానికి సంబంధించిన డేటాను పర్యవేక్షించాలనుకునే వినియోగదారులకు ఇవి ఉపయోగపడుతున్నాయి.

స్క్రీన్ లేకుండా ప‌నిచేసే నిర్మాణం..

నాయిస్‌ రెప్‌ బ్యాండ్‌లో స్క్రీన్‌ లేకుండా పనిచేసే నిర్మాణంలో నిరంతర బయోమెట్రిక్‌ పర్యవేక్షణ సాంకేతికతను, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలను అందించారు. ఇది వివిధ రంగుల స్ట్రాప్‌లలో లభిస్తుంది. ఈ పరికరంలో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ రుసుము అవసరం లేదు. బేస్‌ కొనుగోలుతోనే అధునాతన ఆరోగ్య డేటా, ఆరోగ్య విశ్లేషణలు అందుబాటులో ఉంటాయి. అదనంగా చెల్లింపులు లేదా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా మాత్రమే లభించే మెట్రిక్స్‌ ఇందులో లేవు. రెప్‌ బ్యాండ్‌ నిద్ర నాణ్యత, రికవరీ స్థాయి, ఒత్తిడి సూచికలు, హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ, శారీరక శ్రమ స్కోర్లను నిరంతరం పర్యవేక్షిస్తుంది. వీటితోపాటు కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేటిక్‌ ఆరోగ్య సారాంశాలను కూడా అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న చర్మ వర్ణాలకు అనుగుణంగా ఆప్టికల్ సెన్సార్లను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల వివిధ వాస్తవ పరిస్థితుల్లో పర్యవేక్షణ క‌చ్చితత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ప్రారంభ స్టాక్‌ పూర్తిగా అమ్ముడైన నేపథ్యంలో నాయిస్‌ రెప్‌ బ్యాండ్‌ను తిరిగి స్టాక్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాయిస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ డివైస్ రూ.9,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement