Apple MacBook | విండోస్ ల్యాప్ టాప్ ధరకే యాపిల్ కొత్త మాక్‌బుక్.. మార్చిలో విడుదల..?
Apple MacBook | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలోనే ఓ నూతన ఎంట్రీ లెవల్ మాక్‌బుక్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఆ మాక్‌బుక్ ధర మిడ్ రేంజ్ విండోస్ ల్యాప్ టాప్ ధరకు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. సదరు కొత్త మోడల్ మాక్ బుక్ ధర తక్కువగా ఉన్నప్పటికీ అందులో మెటల్ బాడీని అందించనున్నట్లు తెలుస్తోంది.
Technology | Published On Feb 16, 2026, 1.23 pm IST
Apple MacBook | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలోనే ఓ నూతన ఎంట్రీ లెవల్ మాక్‌బుక్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఆ మాక్‌బుక్ ధర మిడ్ రేంజ్ విండోస్ ల్యాప్ టాప్ ధరకు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. సదరు కొత్త మోడల్ మాక్ బుక్ ధర తక్కువగా ఉన్నప్పటికీ అందులో మెటల్ బాడీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ మాక్‌బుక్‌లో నూతన తరహా అల్యూమినియం మిక్చర్‌తో తయారు చేసిన బాడీ, ఐఫోన్ స్థాయి ప్రాసెసర్, భిన్న రంగుల ఆప్షన్లు ఉంటాయని సమాచారం. ఈ క్రమంలోనే ఆ మాక్‌బుక్ ధర 1000 డాలర్ల లోపే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐఫోన్ స్థాయి ప్రాసెసర్, మెటల్ చాసిస్..
జె700 పేరిట ఆ మాక్‌బుక్‌కు ఇప్పటికే యాపిల్ నామకరణం చేసి అంతర్గతంగా తయారీ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తిగా అల్యూమినియం చాసిస్‌ను అందించనున్నారని, ఇప్పటికే అందుబాటులో ఉన్న బేసిక్ మాక్‌బుక్‌లతో పోలిస్తే కొత్త ఎంట్రీ లెవల్ మాక్‌బుక్ ఎంతో వేగంగా పనిచేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ మాక్‌బుక్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఎంట్రీ లెవల్ మాక్‌బుక్‌లో యాపిల్ స్వతహాగా అందించే ఎం సిరీస్ ప్రాసెసర్‌కు బదులుగా ఐఫోన్ స్థాయిలో ఉండే ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయనుంది. అందువల్లే మాక్‌బుక్‌ను అంతటి తక్కువ ధరకు అందించనుందని తెలుస్తోంది. ఇక హై ఎండ్ లో లభించే మాక్‌బుక్‌లతో పోలిస్తే పనితీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది. కానీ బేసిక్ లెవల్ మాక్‌బుక్‌లతో పోలిస్తే పనితీరు సమానంగానే ఉండనుందని సమాచారం. ముఖ్యంగా రోజువారి పనులు, విద్య, ఉద్యోగ అవసరాలు, వ్యాపారులకు ఈ మాక్‌బుక్ ఎంతో ఉపయోపడుతుందని అంటున్నారు.
ధర చాలా తక్కువ..?
నూతన మాక్‌బుక్‌లో 13 ఇంచుల కన్నా కాస్త తక్కువ సైజ్ ఉండే డిస్‌ప్లేను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అలాగే ఎక్కువ కాలం మన్నేలా పూర్తి స్థాయి క్వాలిటీతో ఈ మాక్‌బుక్‌ను యాపిల్ రూపొందిస్తుందని తెలుస్తోంది. లైట్ యెల్లో, లైట్ గ్రీన్, బ్లూ, పింక్, సిల్వర్, డార్క్ గ్రే రంగులో ఈ మాక్‌బుక్‌ను లాంచ్ చేయనున్నారని తెలుస్తుండగా, మార్చి నెలలో దీన్ని లాంచ్ చేయనున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ఎంట్రీ లెవల్‌గా లభిస్తున్న మాక్ బుక్ ఎయిర్ మోడల్స్ కన్నా ఈ కొత్త మోడల్ ఇంకాస్త తక్కువగానే ధరను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మాక్‌బుక్ ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులని తమ పరిధిలోకి తేవాలని యాపిల్ ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ కొత్త మాక్‌బుక్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

Perplexity Computer | పెర్ప్లెక్సిటీ ఏఐ కంప్యూటర్ వచ్చేసింది.. ఐఫోన్ ఉంటే చాలు.. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు..
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



