Aditi Rao Hydari | వివాహేతర సంబంధాలపై వెబ్‌సిరీస్ – అదితీరావ్ హైదరీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, హీరోయిన్ అదితీరావ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఓ సాథీ రే వెబ్‌సిరీస్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేలా ఈ సిరీస్ ఉందంటూ ఫైర్ అవుతున్నారు. ఓ సాథీ రే వెబ్‌సిరీస్ డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Nov 26, 2026, 5.24 pm IST
Aditi Rao Hydari | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీతో పాటు హీరోయిన్ అదితీరావ్ హైదరీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఓ సాథీ రే వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అగ్ర దర్శకుడు ఇంతియాస్ అలీ రైటర్‌గా, షో రన్నర్‌గా వ్యవహరిస్తోన్న బాలీవుడ్ రొమాంటిక్ వెబ్‌సిరీస్ ఓ సాథీరే డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది.
వెబ్‌సిరీస్
ఈ వెబ్‌సిరీస్‌లో అదితీరావ్ హైదరీ, అర్జున్ రాంపాల్, అవినాష్ తివారీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆరీఫ్ అలీ దర్శకత్వం వహించారు. ఈ హిందీ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఇంతియాజ్ అలీ శైలిలోనే పెళ్లి, ప్రేమ బంధాలను కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సిరీస్ రూపొందుతోన్నట్లు చూపించారు. ఈ ట్రైలర్‌లో రోష్మి అనే పాత్రలో అదితీరావ్ హైదరీ కనిపించింది. కరణ్‌తో ఆమెకు పెళ్లవుతుంది. ప్రద్యుమన్‌తో ప్రేమలో పడిన రోష్మి అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ఇల్లీగల్ రిలేషన్ గురించి కరణ్‌కు తెలుస్తుంది. కానీ రోష్మి సంతోషమే ముఖ్యమని భావించి ఆమెపై తనకున్న ప్రేమను, ఇష్టాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినట్లుగా ట్రైలర్‌లో చూపించారు. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, మ్యూజిక్, నటీనటుల యాక్టింగ్ సినిమా లెవెల్‌లో ఉన్నాయి.
వివాహేతర సంబంధాలు...
ఓ సాథీరే వెబ్‌సిరీస్‌పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేలా ఈ వెబ్‌సిరీస్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు పెళ్లి తర్వాత ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం తప్పుకాదన్నట్లుగా చూపించారంటూ ఫైర్ అవుతున్నారు. వివాహ వ్యవస్థ ఔన్యత్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ సిరీస్‌ను రిలీజ్ చేయద్దంటూ కామెంట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
నవంబర్ 26, 2026

OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ..!
నవంబర్ 25, 2026

Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి – మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
- ●TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
- ●Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
- ●Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?
- ●Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..
- ●Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?



