Mozilla | మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కొత్త ఏఐ ఫీచర్.. ఫోన్ షేక్ చేస్తే వెబ్‌పేజీ సారాంశం సిద్ధం..
Mozilla | మొజిల్లా తన ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త పేజ్ సమ్మరీస్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది ఐఓఎస్‌లో పరిచయం చేసిన షేక్ టు సమ్మరైజ్ ఫీచర్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్‌లో కూడా ప్రవేశపెట్టింది.
Technology | Published On Jun 25, 2026, 11.23 am IST
Mozilla | మొజిల్లా తన ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త పేజ్ సమ్మరీస్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది ఐఓఎస్‌లో పరిచయం చేసిన షేక్ టు సమ్మరైజ్ ఫీచర్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్‌లో కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్‌ను ఒకసారి షేక్ చేయడం ద్వారా ప్రస్తుతం ఓపెన్ అయి ఉన్న వెబ్‌పేజీకి సంబంధించిన సంక్షిప్త సారాంశాన్ని పొందవచ్చు. సుదీర్ఘమైన ఆర్టికల్స్, గైడ్స్, రివ్యూలు, రెసిపీలు వంటి కంటెంట్‌ను పూర్తిగా చదవాల్సిన అవసరం లేకుండా ముఖ్యాంశాలను త్వరగా తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఏఐ సహాయంతో పేజీలోని ప్రధాన అంశాలను గుర్తించి వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సమ్మరీని అందిస్తుంది.
దశలవారీగా అందుబాటులోకి..
ఈ ఫీచర్ ఫైర్‌ఫాక్స్ ఏఐ క్లౌడ్ ఆధారిత సొల్యూషన్‌పై పనిచేస్తుంది. ఇందులో మిస్ట్రల్ స్మాల్ 3.1 ఏఐ మోడల్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ఫీచర్ 5వేల పదాల వరకు ఉన్న ఇంగ్లీష్ వెబ్‌పేజీలకు మాత్రమే మద్దతు ఇస్తోంది. అయితే ఈ ఫీచర్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని మొజిల్లా స్పష్టం చేసింది. దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుండటంతో ప్రస్తుతం అందరికీ ఇది అందుబాటులో లేదు. కానీ ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందించి టెస్ట్ చేస్తున్నందున యూజర్లు తమకు ఈ ఫీచర్ లభిస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. బ్రౌజర్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్ డేట్ చేసిన అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి ఒకసారి డివైస్‌ను షేక్ చేసి చూస్తే తెలిసిపోతుంది. అయితే బీటా వెర్షన్‌లో మాత్రం ఫీచర్ అందుబాటులో ఉంది కనుక ఆ యాప్‌ను డౌన్ లోడ్ చేసి ఉపయోగించవచ్చు.
ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు..
ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. వెబ్‌పేజీలో వినియోగదారుడికి కనిపించే కంటెంట్ మాత్రమే సమ్మరీగా మారుతుంది. పేవాల్ వెనుక ఉన్న కంటెంట్ ఇందులో చేరదు. అలాగే ఫైర్‌ఫాక్స్ ప్రైవేట్ మోడ్‌లో ఈ ఫీచర్ పనిచేయదు. ఫైర్‌ఫాక్స్ ఫర్ ఆండ్రాయిడ్‌లో పేజ్ సమ్మరీస్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. అవసరమైతే వినియోగదారులు దీనిని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫైర్‌ఫాక్స్‌లో మూడు చుక్కల మెనూ తెరిచి సెట్టింగ్స్ లోని పేజ్ సమ్మరీస్ విభాగంలో సమ్మరైజ్ పేజెస్ లేదా షేక్ టు సమ్మరైజ్ ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అలాగే ఫోన్‌ను షేక్ చేయకుండా టూల్‌బార్‌లోని బటన్ ద్వారా కూడా పేజీ సమ్మరీని పొందే అవకాశం మొజిల్లా కల్పించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇదే తరహా షేక్ టు సమ్మరైజ్ ఫీచర్‌ను ఐఓఎస్ వినియోగదారుల కోసం విడుదల చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..
- ●Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు
- ●GTA 6 | గేమర్లకు గుడ్ న్యూస్.. జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, ధరలు ఇవే!
- ●India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులతో.. హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు వస్తున్న 30 భారీ నౌకలు
- ●Priyadarshi | ప్రియదర్శి ఇడుపుకాయితం గ్రాండ్‌గా లాంఛ్ - టైటిల్ రివీల్ చేసిన లోకేష్ కనగరాజ్

Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..

Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు

GTA 6 | గేమర్లకు గుడ్ న్యూస్.. జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, ధరలు ఇవే!






