Motorola | జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..
Motorola | మోటోరోలా భారత మార్కెట్లో కొత్త మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. గత నెలలో ప్యాడ్ 70 ప్రొను తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన ఆడియో సిస్టమ్, దీర్ఘకాలిక బ్యాటరీ వంటి ఫీచర్లతో మీడియా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
Technology | Published On Jul 31, 2026, 4.43 pm IST
Motorola | మోటోరోలా భారత మార్కెట్లో కొత్త మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. గత నెలలో ప్యాడ్ 70 ప్రొను తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన ఆడియో సిస్టమ్, దీర్ఘకాలిక బ్యాటరీ వంటి ఫీచర్లతో మీడియా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఈ ట్యాబ్లెట్‌లో ప్రధాన ఆకర్షణ 9 యూనిట్ జేబీఎల్ ప్రొ స్పీకర్ సిస్టమ్. ఇందులో నాలుగు ట్వీటర్లు, మూడు వూఫర్లు, రెండు ప్యాసివ్ రేడియేటర్లు ఉండగా, డాల్బీ అట్మాస్ ట్యూనింగ్‌తో సినిమాటిక్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. అలాగే హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి, ఈ ట్యాబ్లెట్‌ను ప్రత్యేక బ్లూటూత్ స్పీకర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..
మోటో ప్యాడ్ 70 గ్రూవ్‌లో 12.1 ఇంచుల 2.5కె ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. వీడియోలు, సినిమాలు, గేమింగ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. దీనికి 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. కంపెనీ ఆండ్రాయిడ్ 18 వరకు రెండు ఓఎస్ అప్‌డేట్లు, అలాగే 2030 వరకు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని ప్రకటించింది. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరాను అందించగా, ఇది ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ట్యాబ్లెట్‌లో 10,200ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి 45 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ధర వివరాలు..
డిజైన్ పరంగా బిల్ట్ ఇన్ సర్క్యులర్ 360 డిగ్రీ కిక్‌స్టాండ్ 2.0ను అందించారు. దీని ద్వారా ట్యాబ్లెట్‌ను వివిధ కోణాల్లో ఉంచి చేతులతో పట్టుకోకుండా వీడియోలు చూడవచ్చు. అలాగే ఐపీ52 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. మోటో ప్యాడ్ 70 గ్రూవ్ పాంటోన్ బ్లూ సర్ఫ్ రంగులో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.36,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3వేల తక్షణ తగ్గింపు లభించడంతో ప్రభావవంతమైన ప్రారంభ ధర రూ.33,999గా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఆగస్టు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది.
సంబంధిత వార్తలు

Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
సెప్టెంబర్ 28, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

Motorola Edge 70 Max | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్70 మ్యాక్స్
జులై 15, 2026
తాజావార్తలు
- ●Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి
- ●Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!
- ●National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి
- ●Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
- ●NSE | ఎన్ఎస్ఈ షేర్లకు తొలి ఎదురుదెబ్బ.. ఐపీఓ ధర కంటే దిగువకు..
- ●Vithya Ramraj | ఆసియా గేమ్స్‌లో విత్య రామ్రాజ్ మెరుపులు.. పీటీ ఉష రికార్డు బద్దలు..!

Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి

Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!

National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే



