త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Motorola | మోటోరోలా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు.. ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..

Motorola | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా మోటోరోలా తన ఇట్స్ ది టైమ్ టు మోటో ప్రచారంలో భాగంగా బిగ్ బిలియన్ మోటో డీల్స్‌ను ప్రకటించింది. ఇప్ప‌టికే ప్రారంభం అయిన ఈ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ ప్లస్, మోటో జి37 పవర్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

S

Technology | Published On Sep 28, 2026, 3.23 pm IST

Motorola | మోటోరోలా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు.. ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..
Advertisement

Motorola | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా మోటోరోలా తన ఇట్స్ ది టైమ్ టు మోటో ప్రచారంలో భాగంగా బిగ్ బిలియన్ మోటో డీల్స్‌ను ప్రకటించింది. ఇప్ప‌టికే ప్రారంభం అయిన ఈ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ ప్లస్, మోటో జి37 పవర్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ క‌లిగిన 50 మెగాపిక్స‌ల్ సోనీ ఎల్‌వైటీఐఏ 710 ప్రధాన కెమెరా, 13 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ ప్లస్ మాక్రో కెమెరా, 32 మెగాపిక్స‌ల్ క్వాడ్ పిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 1.5కె ట్రూ కలర్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10 ప్లస్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్, గొరిల్లా గ్లాస్ 7ఐ, స్మార్ట్ వాటర్ టచ్ 3.0 ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ..

స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 68 వాట్ల టర్బోపవర్ ఛార్జింగ్ ఉన్నాయి. ఐపీ68, ఐపీ69 రక్షణతో పాటు మిల్-ఎస్‌టీడీ-810హెచ్ మన్నిక ప్రమాణాలు, 7.99 మిల్లీమీటర్ల క్వాడ్ కర్వ్డ్ డిజైన్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, గరిష్ఠంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ ప్లస్ మాక్రో కెమెరా, ఆటోఫోకస్‌తో 50 మెగాపిక్స‌ల్ క్వాడ్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల 1.5కె 144 హెడ్జ్ ట్రూ కలర్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, గరిష్ఠంగా 5200 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10 ప్లస్, 100 శాతం డీసీఐ-పీ3 ఉన్నాయి. 4600 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూడా ఉంది. అన్ని కెమెరాలతో 4కె 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.36,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.39,999గా ఉంది.

ధ‌ర‌లు ఎంత‌..

ఇక మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ ప్లస్ ఫోన్‌కు చెందిన‌ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999 ఉండ‌గా, మోటో జి37 పవర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999 గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉన్నాయి. అలాగే మోటోరోలా సిగ్నేచర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.57,499 కాగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ.62,499 గా ఉంది. మోటో జి06 పవర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.51,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999గా ఉంది. ఇక ఈ ఫోన్ల‌కు గాను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 లో భారీ రాయితీలు డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌పై ప‌లు ఎంపిక చేసిన బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో రూ.4వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. సుల‌భ వాయిదా ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేసే సౌల‌భ్యాన్ని సైతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement