motorola edge 70 Pro Plus | రూ.47,999కే మోటోరోలా సంచలనం.. 6500ఎంఏహెచ్ బ్యాటరీతో ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్ లాంచ్..
motorola edge 70 Pro Plus | భారత మార్కెట్లో మోటోరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ ప్లస్ ని అధికారికంగా విడుదల చేసింది. ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ 2026కి ప్రీమియం ఆల్‌రౌండర్‌గా నిలవాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
Technology | Published On Jun 4, 2026, 5.38 pm IST
motorola edge 70 Pro Plus | భారత మార్కెట్లో మోటోరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ ప్లస్ ని అధికారికంగా విడుదల చేసింది. ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ 2026కి ప్రీమియం ఆల్‌రౌండర్‌గా నిలవాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అధునాతన ఏఐ ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేసిన క్వాడ్ కెమెరా సిస్టమ్, భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ఈ డివైస్‌ను రూపొందించారు. ఫోన్ డిజైన్‌పై మోటోరోలా ప్రత్యేక దృష్టి పెట్టింది. కేవలం 6.99 మిల్లీమీటర్ల సన్నని బాడీ, 190 గ్రాముల బరువుతో ఇది ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. కలెక్షన్స్ బై మోటరోలా సిరీస్‌లో భాగంగా పాంటోన్ కలర్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి రూపొందించిన మూడు ప్రత్యేక ఫినిష్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పాంటోన్ జిన్‌ఫాండెల్‌లో శాటిన్-లక్స్ ఫినిష్, పాంటోన్ చికోరీ కాఫీలో స్కల్ప్టెడ్ వుడ్ ఫినిష్, పాంటోన్ స్టోర్మీ సీలో ట్విల్ ఇన్‌స్పైర్డ్ ఫినిష్ ఉన్నాయి.
అదిరిపోయిన డిస్‌ప్లే, కెమెరాలు..
ముందు భాగంలో 6.8 ఇంచుల సూపర్ హెచ్‌డీ ప్లస్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ 1.5కె డిస్‌ప్లేను అందించారు. 144హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 96.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతలు. పాంటోన్ వాలిడేటెడ్ కలర్, స్కిన్ టోన్ అక్యూరసీ సర్టిఫికేషన్ కూడా ఉంది. అదనపు రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, అలాగే తడి చేతులతో కూడా సరిగ్గా పనిచేసే స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీని చేర్చారు. ఫోటోగ్రఫీ కోసం మోటోరోలా ప్రొప్రైటరీ మోటో ఏఐ ఆధారిత క్వాడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్‌ను అందించింది. ప్రధాన కెమెరాగా ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ సోనీ లైటియా 710 సెన్సార్‌ను ఉపయోగించారు. 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్, 50ఎక్స్ ఏఐ సూపర్ జూమ్ ప్రోతో 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా మాక్రో షాట్లను కూడా క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీల కోసం ఆటోఫోకస్‌తో కూడిన 50ఎంపీ క్వాడ్ పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ప్రత్యేకమైన వేపర్ చాంబర్, ఏఐ ఫీచర్లు..
వీడియో రికార్డింగ్ విషయంలో అన్ని కెమెరాల నుంచీ 4కె 60ఎఫ్‌పీఎస్ రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది. వీడియో హెచ్‌డీఆర్, హొరైజన్ లాక్ 360-డిగ్రీ స్టెబిలైజేషన్, ఫ్రేమ్ మ్యాచ్, అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ఫోటోస్‌లోని ఏఐ మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్ వంటి ఎడిటింగ్ టూల్స్ కూడా ఇందులో లభిస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్‌లో 4 నానోమీటర్ ప్రాసెస్‌పై రూపొందిన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 3.4గిగా హెడ్జ్ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే 40 శాతం మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుందని మోటోరోలా తెలిపింది. అంతేకాకుండా 24 లక్షలకు పైగా అంటుటు స్కోర్ సాధించిందని పేర్కొంది. 4600 ఎంఎం స్క్వేర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 5జి, డాల్బీ అట్మాస్, హై-రెస్ ఆడియో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

భారీ బ్యాటరీ..
కేవలం 7 మిల్లీమీటర్ల లోపు మందంతో వచ్చినప్పటికీ ఇందులో 6500ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 51 గంటల వరకు మిక్స్‌డ్ యూసేజ్‌ను అందిస్తుందదని కంపెనీ చెబుతోంది. 90వాట్ల టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, కేవలం 9 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని తెలిపింది. అదనంగా 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. డ్యూరబిలిటీ విషయంలో ఈ ఫోన్ ఐపీ68, ఐపీ69 రేటింగ్స్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌ను పొందింది. -30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు, దుమ్ము, తేమ, 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయే పరిస్థితులను తట్టుకునేలా పరీక్షలు నిర్వహించారు. ఈ స్మార్ట్‌ఫోన్ హలో యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. కంపెనీ 3 ప్రధాన ఓఎస్ అప్‌డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ మెయింటెనెన్స్ రిలీజ్ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.
ధర వివరాలు..
మోటో ఏఐ 2.0 సూట్‌లో నెక్స్ట్ మూవ్, స్కెచ్ టు ఇమేజ్, క్యాచ్ మీ అప్ 2.0, రీకాల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులు మోటో ఏఐ, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ అసిస్టెంట్ల మధ్య డైనమిక్‌గా మారవచ్చు. థింక్‌షీల్డ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా మోటో సెక్యూర్ 5.0 భద్రతను అందిస్తుంది. కొనుగోలుదారులకు మోటో ప్రీమియం కేర్ సేవలు కూడా లభిస్తాయి. ఇందులో 24/7 వాట్సాప్ కస్టమర్ సపోర్ట్, ఉచిత పికప్-అండ్-డ్రాప్ రిపేర్ సేవలు, సర్వీస్ సమయంలో ఉచిత స్టాండ్‌బై హ్యాండ్‌సెట్ సౌకర్యం ఉంటాయి. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పాంటోన్ స్టోర్మీ సీ (గ్రీన్), పాంటోన్ జిన్‌ఫాండెల్ (రెడ్), పాంటోన్ చికోరీ కాఫీ (వుడ్) రంగుల్లో అందుబాటులో ఉంది. 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.47,999 గా ఉంది. జూన్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. అలాగే రూ.3వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
సంబంధిత వార్తలు

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026

motorola edge 70 Pro | పవర్ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చిన మోటోరోలా ఎడ్జ్70 ప్రొ ఫోన్.. ధర ఎంతంటే..?
ఏప్రిల్ 22, 2026

motorola edge 70 fusion | భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లేతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.. ధర ఎంతంటే..?
మార్చి 6, 2026
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ కామెడీ మూవీ
- ●Hairsh Rao | మోసమే కాంగ్రెస్ పార్టీ నైజం: హరీశ్ రావు
- ●JEE aspirant | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
- ●AI Business Agent | ఏఐ బిజినెస్ ఏజెంట్‌ను ప్రవేశపెట్టిన మెటా.. వ్యాపారాలకు ఇది గేమ్ చేంజర్ టూల్..
- ●Anupama Parameswaran | యాక్టింగ్‌కు పనికిరానని రిజెక్ట్ చేశారు - కన్నీళ్లు ఆగలేదు - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
- ●ITDA Bhadrachalam | ప్రణాళికతో పని చేశారు.. దేశంలోనే ఉత్తమ అధికారిగా నిలిచారు

Malayalam OTT | ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ కామెడీ మూవీ

Hairsh Rao | మోసమే కాంగ్రెస్ పార్టీ నైజం: హరీశ్ రావు

JEE aspirant | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

AI Business Agent | ఏఐ బిజినెస్ ఏజెంట్‌ను ప్రవేశపెట్టిన మెటా.. వ్యాపారాలకు ఇది గేమ్ చేంజర్ టూల్..



