moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
moto g37 and g37 Power | మోటోరోలా భారత్‌లో కొత్తగా మోటో జి37 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో మోటో జి37, మోటో జి37 పవర్ మోడళ్లు ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీ, 120 హెడ్జ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. మోటో జి37 సిరీస్‌లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు.
Technology | Published On May 19, 2026, 12.33 pm IST
moto g37 and g37 Power | మోటోరోలా భారత్‌లో కొత్తగా మోటో జి37 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో మోటో జి37, మోటో జి37 పవర్ మోడళ్లు ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీ, 120 హెడ్జ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. మోటో జి37 సిరీస్‌లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్లలో 4జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 16జీబీ వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అందించారు. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
భారీ బ్యాటరీ, అదిరిపోయిన కెమెరాలు..
ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలతో 2కే వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16తో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 17 వరకు ఒక ఓఎస్ అప్‌డేట్‌తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని మోటోరోలా ప్రకటించింది. డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఇచ్చారు. అలాగే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆట్మాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మోటో జి37లో 5200ఎంఏహెచ్ బ్యాటరీతో 20వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్‌లో 10వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. మరోవైపు మోటో జి37 పవర్‌లో భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీతో 30వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. రెండు ఫోన్లలో కూడా 6వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధర వివరాలు..
ఈ ఫోన్లు పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ క్యాప్రి రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ధరల విషయానికి వస్తే మోటో జి37 4జీబీ + 64జీబీ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. మోటో జి37 పవర్ 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.15,999 ఉండగా, 8జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.18,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లు మే 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్‌ప్లే.. రియల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్..
ఆగస్టు 12, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
- ●Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
- ●Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- ●Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
- ●Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం

Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక



