త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Motorola Moto G Max | భారీ బ్యాట‌రీ, మిలిట‌రీ గ్రేడ్ ప్రొటెక్ష‌న్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్‌..

Motorola Moto G Max | మోటోరోలా తాజాగా భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో జి మ్యాక్స్ ను విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు, అప్‌డేటెడ్ హార్డ్‌వేర్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే ఈ స్మార్ట్‌ఫోన్‌ తాజాగా భారత్‌లో అడుగుపెట్టింది. మోటో జి మ్యాక్స్‌లో 7000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 50 మెగాపిక్స‌ల్ సోనీ లైటియా కెమెరా సెన్సార్ ను అందించారు.

S

Technology | Published On Aug 14, 2026, 3.50 pm IST

Motorola Moto G Max | భారీ బ్యాట‌రీ, మిలిట‌రీ గ్రేడ్ ప్రొటెక్ష‌న్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్‌..
Advertisement

Motorola Moto G Max | మోటోరోలా తాజాగా భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో జి మ్యాక్స్ ను విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు, అప్‌డేటెడ్ హార్డ్‌వేర్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే ఈ స్మార్ట్‌ఫోన్‌ తాజాగా భారత్‌లో అడుగుపెట్టింది. మోటో జి మ్యాక్స్‌లో 7000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 50 మెగాపిక్స‌ల్ సోనీ లైటియా కెమెరా సెన్సార్ ను అందించారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వ‌చ్చింది. మోటో జి మ్యాక్స్‌లో జి సిరీస్‌కు తొలిసారిగా శాటిన్ టెక్చర్ ఫినిష్‌ను అందించారు. దీని వల్ల ఫోన్‌పై వేలిముద్రలు, మరకలు ఎక్కువగా కనిపించకుండా ఉంటాయని కంపెనీ చెబుతోంది. స్టార్‌గేజర్, అలాస్కన్ బ్లూ, మలాగా పేర్లతో పాంటోన్ ఎంపిక చేసిన మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.

మిలిట‌రీ గ్రేడ్ ప్రొటెక్ష‌న్‌..

ఫోన్ ముందు భాగానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణను అందించారు. ఇది గీతలు, ప్రమాదవశాత్తూ పడిపోవడం వంటి వాటి నుంచి డిస్‌ప్లేను రక్షించేందుకు ఉపయోగపడుతుంది. దుమ్ము, నీటి చిమ్ముళ్ల నుంచి రక్షణ కోసం ఎస్‌జీఎస్ సర్టిఫైడ్ ఐపీ64 రేటింగ్‌ను అందించారు. అలాగే షాక్, వైబ్రేషన్ వంటి పరిస్థితులను తట్టుకునేలా మిలిటరీ స్టాండర్డ్ మిల్-ఎస్‌టీడీ-810హెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్‌ను రూపొందించారు. ఇందులో 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో గరిష్ఠంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మోటోరోలా వాటర్ టచ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించింది. దీని వల్ల చేతులు తడిగా ఉన్నప్పటికీ కెపాసిటివ్ టచ్ లేయర్ స్పందించేలా ఉంటుంది. డాల్బీ అట్మాస్‌తో ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో సపోర్ట్, డ్యుయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. అలాగే 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా ఇచ్చారు.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌ వెనుక కెమెరా సెటప్‌లో ప్రధానంగా 50 మెగాపిక్స‌ల్ కెమెరాను అందించారు. ఇందులో సోనీ లైటియా 600 సెన్సార్‌ను ఉపయోగించారు. తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మెరుగైన ఫొటోలు తీసేందుకు క్వాడ్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనికి తోడు 8మెగాపిక్స‌ల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉందని కంపెనీ వివరించింది. గూగుల్ ఫొటోస్ ఏఐ టూల్స్‌తో నేటివ్ ఇంటిగ్రేషన్ ఉంది. మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్, రీఇమాజిన్, ఆటో ఫ్రేమ్, పోర్ట్రెయిట్ లైట్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీంట్లో ప్రధాన ఆకర్షణ 7000 ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ. సాధారణ బ్యాటరీలతో పోలిస్తే సిలికాన్-కార్బన్ కెమిస్ట్రీ అధిక ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. దీంతో సాధారణ ఫోన్ పరిమాణంలోనే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. మోటరోలా టర్బోపవర్ ప్రమాణంతో వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 33 వాట్ల వ‌ర‌కు ట‌ర్బో చార్జింగ్ ను ఇచ్చారు.

ధ‌ర ఎంతంటే..

మోటో జి మ్యాక్స్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆగస్టు 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1వేయి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ద్వారా అదనంగా రూ.1వేయి వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement