Moto Pad 70 Pro | పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో వచ్చిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..?
Moto Pad 70 Pro | మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్ మోటో ప్యాడ్ 70ప్రొను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. అధిక పనితీరు, మల్టీ టాస్కింగ్, మీడియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ హై ఎండ్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో అత్యంత శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు.
Technology | Published On Jun 27, 2026, 5.19 pm IST
Moto Pad 70 Pro | మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్ మోటో ప్యాడ్ 70ప్రొను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. అధిక పనితీరు, మల్టీ టాస్కింగ్, మీడియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ హై ఎండ్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో అత్యంత శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు సైతం ఉన్నాయి. పీసీ తరహా యాక్ససరీలకు ఈ ట్యాబ్ సపోర్ట్‌ను ఇస్తుంది. మోటో ప్యాడ్ 70 ప్రొ ట్యాబ్‌లో 8జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. గరిష్టంగా 256 జీబీ స్టోరేజ్ మోడల్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 13 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 3.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్‌ప్లే అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఔట్ డోర్ విజిబిలిటీ కోసం 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు.
భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్‌లో జేబీఎల్ కంపెనీకి చెందిన క్వాడ్ స్పీకర్లను ఇచ్చారు. వీటికి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఈ ట్యాబ్ ఐపీ52 డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌ను సైతం కలిగి ఉంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ట్యాబ్ లో 10,200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. దీని వల్ల ఈ ట్యాబ్ బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువగా ఇస్తుంది. 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చినందున ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మెటల్ బాడీని కలిగి ఉన్నందున ట్యాబ్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ట్యాబ్ కేవలం 6.2 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండి అత్యంత స్లీక్‌గా కనిపిస్తుంది. బరువు కేవలం 598 గ్రాములు కాగా ప్రయాణాల్లోనూ సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు..
ఈ ట్యాబ్ లో ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌ను ఇచ్చారు. ఏఐ ఆధారిత మోటో పెన్ ప్రోను కంపెనీ ఈ ట్యాబ్‌తోపాటు ఇస్తోంది. దీని సహాయంతో స్మార్ట్ క్యాప్చర్, స్కెచ్ టు ఇమేజ్, ఏఐ సూపర్ రెజ్, ఏఐ లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ తదితర ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అలాగే స్మార్టర రీడర్, ఏఐ నోట్స్ ద్వారా డాక్యుమెంట్లకు ఇన్‌స్టంట్ సమరీలు, ట్రాన్స్‌లేషన్, సందర్భానుసారంగా వివరణలను పొందవచ్చు. డెస్క్ మోడ్, మల్టీ విండో సపోర్ట్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ కనెక్ట్ వంటి ఫీచర్లను సైతం ఇందులో ఇచ్చారు. స్మార్ట్ ఫోన్లు, పీసీలతో ఫైల్ షేరింగ్ సులభంగా ఉంటుంది. కంటెంట్ సింక్, క్రాస్ డివైస్ కంటిన్యుటీ సదుపాయాలను ఇచ్చారు. యూజర్లు ప్రత్యేకంగా స్నాప్ ఆన్ కీబోర్డును కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో పూర్తి కీబోర్డు లే అవుట్, ట్రాక్ ప్యాడ్, ఏఐ ఫీచర్లను వెంటనే ప్రారంభించేందుకు ప్రత్యేక స్మార్ట్ కీ ని ఇచ్చారు.
ధర వివరాలు..
మోటో ప్యాడ్ 70 ప్రొ జూలై 4 నుంచి మార్కెట్లో లభ్యం కానుండగా, దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. ఈ ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.36,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. 256జీబీ స్టోరేజ్ వేరియెంట్‌తో స్నాప్ ఆన్ కీబోర్డు బండిల్ ధరను రూ.45,999గా నిర్ణయించారు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో ఈ ట్యాబ్ మోడల్స్‌పై రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

motorola edge 70 Pro | పవర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చిన మోటోరోలా ఎడ్జ్70 ప్రొ ఫోన్.. ధర ఎంతంటే..?
ఏప్రిల్ 22, 2026

motorola edge 70 fusion | భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లేతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.. ధర ఎంతంటే..?
మార్చి 6, 2026

Motorola Edge 60 Pro | రూ.14వేలు తగ్గిన మోటోరోలా ఎడ్జ్60 ప్రొ స్మార్ట్ ఫోన్.. ఎందులో కొనాలంటే..?
జనవరి 5, 2026
తాజావార్తలు
- ●TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం
- ●Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం
- ●Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?
- ●Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
- ●Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం

Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం

Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్



