motorola edge 70 fusion | భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.. ధర ఎంతంటే..?
motorola edge 70 fusion | మొబైల్స్ తయారీదారు మోటోరోలా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎడ్జ్ 70 ఫ్యూషన్ పేరిట ఓ ఫోన్‌ను మిడ్ రేంజ్ విభాగంలో ప్రవేశపెట్టింది. ఎడ్జ్ 70 సిరీస్‌లో మోటోరోలా నుంచి విడుదలైన లేటెస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Mar 6, 2026, 3.17 pm IST
motorola edge 70 fusion | మొబైల్స్ తయారీదారు మోటోరోలా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎడ్జ్ 70 ఫ్యూషన్ పేరిట ఓ ఫోన్‌ను మిడ్ రేంజ్ విభాగంలో ప్రవేశపెట్టింది. ఎడ్జ్ 70 సిరీస్‌లో మోటోరోలా నుంచి విడుదలైన లేటెస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ 6.78 ఇంచుల ఓలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి హెచ్‌డీఆర్10 ప్లస్ ఫీచర్‌ను అందించారు. అందువల్ల వీడియోలను అద్భుతమైన క్వాలిటీతో వీక్షించవచ్చు. ఈ డిస్‌ప్లే 1.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
3 ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్..
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూషన్ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. దీనికి 3 ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్‌ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్‌ను ఇస్తాయి. డాల్బీ అట్మోస్ ఉండడంతో ఆడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఐపీ 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ సదుపాయాలు సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. కనుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
ధర వివరాలు..
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూషన్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.26,999 ఉండగా, 8జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.29,999గా ఉంది. 12జీబీ, 256జీబీ మోడల్ ధరను రూ.32,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ తోపాటు మోటోరోలా ఆన్ లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మార్చి 12 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై రూ.2వేల వరకు బ్యాంకు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



