త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

motorola edge 70 Pro | ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో వ‌చ్చిన మోటోరోలా ఎడ్జ్‌70 ప్రొ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

motorola edge 70 Pro | మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఎడ్జ్‌70 ప్రొ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.8 ఇంచుల అమోలెడ్ డిస్ ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజ‌ల్యూష‌న్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు.

S

Technology | Published On Apr 22, 2026, 2.34 pm IST

motorola edge 70 Pro | ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో వ‌చ్చిన మోటోరోలా ఎడ్జ్‌70 ప్రొ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

motorola edge 70 Pro | మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఎడ్జ్‌70 ప్రొ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.8 ఇంచుల అమోలెడ్ డిస్ ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజ‌ల్యూష‌న్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఫోన్ అతిగా హీట్ అవ్వ‌కుండా ఉండేందుకు గాను ఇందులో ప్ర‌త్యేకంగా వీసీ కూలింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. అలాగే 12జీబీ వ‌ర‌కు ర్యామ్ ఇందులో ల‌భిస్తుంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ సెన్సార్ ఉండ‌గా, మ‌రో 50 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌ను ఇచ్చారు. అలాగే ముందు వైపు కూడా 50 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌కు ఐపీ68, 69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందించారు.

భారీ బ్యాట‌రీ, మిలిట‌రీ గ్రేడ్ క్వాలిటీ..

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రొ ఫోన్‌ను మిలిట‌రీ గ్రేడ్ క్వాలిటీతో రూపొందించారు. అందువ‌ల్ల దృఢ‌మైన బిల్డ్ క్వాలిటీని క‌లిగి ఉంటుంది. అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. దీనికి 3 ఏళ్ల వ‌ర‌కు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 5 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందించనున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కేవ‌లం 6.99 ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి ఉంటుంది. అత్యంత స్లీక్‌గా క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఇక ఇందులో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఇచ్చారు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చినందున ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

ఈ ఫోన్ డిస్‌ప్లేకు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ఉంది. 8జీబీ, 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్ ల‌ను వేసుకోవ‌చ్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ ఉన్నందున సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6ఇ, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను ఇందులో ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

మోటోరోలా ఎడ్జ్‌70 ప్రొ ఫోన్‌ను పాంటోన్ లిలీ వైట్ విత్ మార్బుల్ ఫినిష్‌, పాంటోన్ టీ విత్ సాటిన్ లుక్స్ ఫినిష్‌, పాంటోన్ టైటాన్ విత్ టెయిల‌ర్డ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.38,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.41,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో, ఆఫ్ లైన్ స్టోర్స్ లో ఏప్రిల్ 29 నుంచి విక్ర‌యించ‌నున్నారు. లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌తో రూ.2వేల డిస్కౌంట్‌ను ఇవ్వ‌నున్నారు. అలాగే రూ.2వేల వ‌రకు అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ సైతం ల‌భ్యం కానుంది.

Advertisement
Advertisement