Harish Rao | తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు.. జవాబుదారీతనం: హరీశ్ రావు
Harish Rao | తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు.. మంచి పరిపాలన, పాత హామీలు కాదు.. జవాబుదారీతనమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లకు ఎంతో గౌరవం ఉందని, వాటిని అమలుకు నోచుకోని హామీలతో కూడిన పథకాలకు తగిలించొద్దన్నారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు.. మంచి పరిపాలన, పాత హామీల తిరగబోత కాదు.. జవాబుదారీతనమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లకు ఎంతో గౌరవం ఉందని, వాటిని అమలుకు నోచుకోని హామీలతో కూడిన పథకాలకు తగిలించొద్దన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నప్పుడే ఆ నాయకులకు నిజమైన గౌరవం ఇచ్చినట్లని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ల పనితీరును సమీక్షించి, జవాబుదారీ తనాన్ని కోరడానికి ఇదే సరైన సమయమని రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూచించారు.
`దివంగత మాజీ ప్రధానులు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గార్ల పట్ల నిజంగా గౌరవం ఉంటే.. కేవలం పథకాలకు వారి పేర్లు తగిలిస్తే సరిపోదు, వారి పేరు మీద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అమలుకు నోచుకోని పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుంది.
రాహుల్ గాంధీ గారూ.. మీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును, వారు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లను సమీక్షించడానికి ఇదే సరైన సమయం. ఇవి కేవలం బడ్జెట్ ప్రకటనలు మాత్రమే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు. మరి ఇప్పటికీ అవి ఎందుకు అమలు కాలేదో ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకోండి.
పాత ప్రకటనలకే కొత్త రంగు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్.. హామీలు ప్రకటించడం.. పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం.. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం..ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి, పాత బడ్జెట్ ప్రకటనలనే మళ్లీ మళ్లీ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందిస్తామని 2024-25 బడ్జెట్‌లో ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత 2025-26 బడ్జెట్‌లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. కానీ వరుసగా మూడు బడ్జెట్లు పూర్తయినా నేటికీ ఆ నిరుపేద కూలీలకు ఇస్తామన్న రూ. 12 వేల సాయం అందలేదు. కాంగ్రెస్ భాషలో హామీల అమలు అంటే ఇదేనా?
రాజీవ్ యువ వికాసం
మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు 2025-26 బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ కింద రూ. 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ 2026-27 బడ్జెట్‌లోనూ అదే రూ. 6,000 కోట్ల అంకెను వల్లెవేశారు. బడ్జెట్ కాగితాల మీద వేల కోట్ల అంకెలు కనిపిస్తున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో నిధుల విడుదలేది? అమలు ఎక్కడ? ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ సాయం ఎప్పుడు అందుతుంది?.
మూడు బడ్జెట్లు మారినా.. అవే పాత హామీలు, అవే కాగితపు ప్రకటనలు తప్ప ప్రభుత్వానికి ఇసుమంతైనా జవాబుదారీతనం లేదు. పేదల, యువత పక్షపాతిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. తన సొంత మేనిఫెస్టో హామీలను ఇంత దారుణంగా తుంగలో తొక్కడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఓట్ల కోసం మీరు పదేపదే చెప్పిన మాటలను నమ్మిన భూమిలేని కూలీలు, నిరుద్యోగ యువత ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలి?.
రాహుల్ గాంధీ గారూ.. ఇకనైనా రాజకీయ నినాదాలు, ఉపన్యాసాలు పక్కన పెట్టండి. ఎన్నికల్లో హామీలు ఇవ్వడంతోనే మీ బాధ్యత తీరిపోదు, అవి ప్రజలకు అందేలా చూడటమూ మీ బాధ్యతే. తక్షణమే మీ ప్రభుత్వ మూడు బడ్జెట్లపై సమీక్ష జరిపి, అమలు కాని ప్రతి మేనిఫెస్టో హామీపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసి లెక్క అడగండి. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జిమ్మిక్కులు కాదు.. సుపరిపాలన! మోసాలు కాదు.. హామీల అమలు.. పాత హామీల తిరగబోత కాదు.. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి..` అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!



