త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాహుల్ గాంధీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లు ఏది?: కేటీఆర్‌

KTR | ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేదో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ (Congress) చేసిన ద్రోహానికి అంతులేద‌న్నారు.

G

Telangana | Published On Nov 14, 2026, 10.25 am IST

KTR | రాహుల్ గాంధీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లు ఏది?: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేదో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ (Congress) చేసిన ద్రోహానికి అంతులేద‌న్నారు. ప్ర‌భుత్వ హామీలు అబద్ధాలు, పచ్చి అబద్ధాలని విమర్శించారు. తెలంగాణ (Telangana) ఖ‌జానా సొమ్ముతో హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ గాంధీ.. మీరు ఇచ్చిన‌ అభయ హస్తం (Abhaya Hastam), 420హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలపై ఈ ప్ర‌శ్నల‌కు సమాధానం చెప్ప‌గ‌ల‌రా? అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు.

బీసీ డిక్లరేషన్: వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమానికి రూ.1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అమలైంది: మూడేండ్ల‌లో రూ.5,000 కోట్ల కంటే తక్కువే ఇచ్చారు.

బీసీ రిజర్వేషన్లు: విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
అమలైంది: సున్నా (ZERO).

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్: నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద రూ.12 లక్షలు ఇస్తామని కొత్త పథకాన్ని ప్రకటించారు.
అమలైంది: సున్నా.

ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టులు: ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 31 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చారు.
అమలైంది: సున్నా.

యూత్ డిక్లరేషన్: 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు, 'రాజీవ్ యువ వికాసం' అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
అమలైంది: కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే.. వికాసం సున్నా.

స్టూడెంట్ డిక్లరేషన్: విద్యార్థులకు రూ.5 లక్షల ‘విద్యా భరోసా కార్డు’ ఇస్తామని హామీ ఇచ్చారు.
అమలైంది: సున్నా.

మైనారిటీ డిక్లరేషన్: మైనారిటీ సంక్షేమానికి రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అమలైంది: రూ.1,000 కోట్ల కంటే తక్కువే ఖర్చు చేశారు.

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహాల పరంపరలాగే.. ఈ హామీల వైఫల్యాల జాబితా కూడా అంతం లేకుండా సాగుతూనే ఉంద‌ని ఎద్దేవా చేశారు.

 

Advertisement
Advertisement