Whatsapp | వాట్సాప్‌లో ఇక పెయిడ్ ప్లాన్.. నెలకు రుసుము రూ.274..
Whatsapp | టెక్ దిగ్గజ సంస్థ మెటా తన వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు గాను సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు యూజర్లు వాట్సాప్ సేవలను కేవలం ఉచిత మోడల్‌లోనే పొందుతున్నారు. అయితే పెయిడ్ ప్లాన్ ద్వారా ఆదాయం పొందడమే లక్ష్యంగా మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
Technology | Published On Apr 21, 2026, 1.37 pm IST
Whatsapp | టెక్ దిగ్గజ సంస్థ మెటా తన వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు గాను పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు యూజర్లు వాట్సాప్ సేవలను కేవలం ఉచిత మోడల్‌లోనే పొందుతున్నారు. అయితే పెయిడ్ ప్లాన్ ద్వారా ఆదాయం పొందడమే లక్ష్యంగా మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాదిరిగానే ఇందులోనూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. వాట్సాప్ ప్లస్ పేరిట బీటా యూజర్లకు ఈ సబ్‌స్క్రిప్షన్ లభిస్తోంది. ఈ ప్లాన్‌ను తీసుకున్న యూజర్లకు ప్రీమియం ఫీచర్లను మెటా అందించనుంది. పవర్ యూజర్లు దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు మెటా వెల్లడించింది. ఈ ప్లాన్‌లో యూజర్లకు అనేక మెరుగైన ఫీచర్లు లభిస్తాయని, కస్టమ్ యాప్ ఐకాన్‌లు, ప్రత్యేకమైన రింగ్ టోన్‌లు, ఇతర పర్సనలైజ్డ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
బీటా యూజర్లకు అందుబాటులోకి..
వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రస్తుతానికి కొద్ది మంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మెటా అందుబాటులోకి తెస్తోంది. దీన్ని టెస్టింగ్ చేసిన తరువాత పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ప్రవేశపెడతారు. అలాగే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఈ ప్లాన్ లభిస్తుంది. ఇక వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తాము ఇప్పటికే కంపెనీలో అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నామని మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనివల్ల యూజర్లకు వాట్సాప్ లో ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగ్గా ఉంటుందని, యూజర్లు కోరుకునే పర్సనల్ సెట్టింగ్స్ లభిస్తాయని తెలిపారు. అయితే పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఉచిత మోడల్ కూడా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
20 చాట్‌లను పిన్ చేసుకోవచ్చు..
వాట్సాప్ ప్రీమియం ప్లాన్ ఫీచర్లలో భాగంగా ఎక్కువ చాట్‌లను పిన్ చేసుకునే ఆప్షన్‌ను అందివ్వనున్నారు. ప్రస్తుతం కేవలం 3 చాట్‌లను మాత్రమే పిన్ చేసుకునే సదుపాయం ఉండగా, దీన్ని 20 వరకు పెంచనున్నారు. అలాగే కస్టమ్ లిస్ట్స్, కొత్త చాట్ థీమ్‌లు వంటివి ఇవ్వనున్నారు. వీటిపై బీటా దశలో మరిన్ని టెస్టులు చేసి ఫైనల్ వెర్షన్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ప్రీమియం ప్లాన్ లో యూజర్లకు మొత్తం 18 రకాల భిన్న చాట్ థీమ్ లను ఇవ్వనున్నారు. మొత్తం యాప్ ఇంటర్‌ఫేస్‌లో యూజర్లు ఒకే యాక్సెంట్‌లో ఉండేలా కలర్‌ను ఎంచుకోవచ్చు. ప్రధానంగా వైబ్రంట్ బ్లూ, రాయల్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్, ఫ్యూషియా పింక్ వంటి కలర్ థీమ్ లను ప్రీమియం ప్లాన్‌లో ప్రత్యేకంగా అందివ్వనున్నారు.

భిన్న యాప్ ఐకాన్లు, ప్రత్యేక రింగ్ టోన్లు..
ప్రీమియం వాట్సాప్ ప్లాన్‌లో యూజర్లు తమ ప్రొఫైల్ పిక్చర్‌కు సర్కిల్ కాకుండా ఇతర ఆకృతులను అమర్చుకోవచ్చు. కాస్మిక్ నెబ్యులా థీమ్, మెరిసే స్పార్కిల్ ఫినిష్, మౌల్డెడ్ గ్రీన్ క్లే వంటి ఆకృతులను సెట్ చేసుకోవచ్చు. అలాగే యాప్ ఐకాన్‌ను కూడా మార్చుకోవచ్చు. మొత్తం 14 రకాల భిన్న యాప్ ఐకాన్లు పెయిడ్ యూజర్లకు లభిస్తాయి. వాట్సాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో యూజర్లకు ప్రత్యేకమైన స్టిక్కర్ ప్యాక్‌లు లభిస్తాయి. యూజర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వెంటనే ఆ స్టిక్కర్‌లను స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే పూర్తి స్థాయిలో డివైస్ స్క్రీన్‌ను ఆక్రమించేలా ఓవర్‌లే యానిమేటేడ్ ప్రీమియం స్టిక్కర్‌లను కూడా ఇవ్వనున్నారు. ఇక యూజర్లు తమ చాట్‌లకు కస్టమ్ థీమ్‌లు, అలర్ట్ టోన్‌లు, రింగ్ టోన్‌లను సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్‌కమింగ్ కాల్స్‌కు 10 ప్రత్యేకమైన రింగ్‌టోన్ ఆప్షన్‌లను ఇవ్వనున్నారు.
నెలకు రుసుము రూ.274..
ఇక వాట్సాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చార్జిల వివరాలను మెటా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే డబ్ల్యూఏ బీటా ఇన్ఫో తెలిపిన ప్రకారం ఈ ప్రీమియం ప్లాన్ ను చాలా తక్కువ ధరకే ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. నెలకు 2.49 యూరోలు (దాదాపు రూ.274) చెల్లిస్తే వాట్సాప్ ప్రీమియం ప్లాన్ సేవలను ఉపయోగించుకునేలా సబ్‌స్క్రిప్షన్ ను అందిచనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై మెటా త్వరలోనే స్పష్టతను ఇవ్వనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






