త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు మెటా నుంచి కొత్త‌గా ఏఐ డిటెక్షన్ టూల్‌..

Meta | మెటా సంస్థ తన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్ మెటా ఏఐ కోసం ఓ ఆసక్తికరమైన కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు తెలిసింది. తాజా నివేదికల ప్రకారం ఈ ప్లాట్‌ఫామ్‌లో ఏఐ డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు స‌మాచారం. పేరుకు అనుగుణంగా ఈ ఫీచర్ ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించగలదని భావిస్తున్నారు.

S

Technology | Published On Mar 16, 2026, 1.23 pm IST

Meta | ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు మెటా నుంచి కొత్త‌గా ఏఐ డిటెక్షన్ టూల్‌..
Advertisement

Meta | మెటా సంస్థ తన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్ మెటా ఏఐ కోసం ఓ ఆసక్తికరమైన కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు తెలిసింది. తాజా నివేదికల ప్రకారం ఈ ప్లాట్‌ఫామ్‌లో ఏఐ డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు స‌మాచారం. పేరుకు అనుగుణంగా ఈ ఫీచర్ ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉండగా వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని పూర్తి సామర్థ్యాలు మాత్రం ప్రస్తుతం స్పష్టంగా తెలియ‌లేదు. ఈ టూల్‌ను యూజ‌ర్ల కోసం ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని కూడా నివేదికలో వెల్లడించలేదు. కాగా మెటా సంస్థ రూపొందిస్తున్న కొత్త ఏఐ మోడళ్లు కూడా పనితీరు సమస్యల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం డెవ‌ల‌పింగ్ ద‌శ‌లో..

మెటా సంస్థ త‌న మెటా ఏఐ కోసం ఏఐ డిటెక్ష‌న్ టూల్‌ను ప్ర‌స్తుతం అభివృద్ధి చేస్తోంద‌ని టెస్టింగ్ క్యాటలాగ్ అనే ప్లాట్‌ఫామ్ ఎక్స్ పోస్టులో వెల్ల‌డించింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా టెస్టింగ్ క్యాట‌లాగ్ షేర్ చేసింది. అందులో ఏఐ డిటెక్ట‌ర్ అనే కొత్త మెనూ ఆప్ష‌న్ క‌నిపించింది. అయితే ఏఐ డిటెక్ష‌న్ టూల్‌ గురించి పూర్తి వివ‌రాల‌ను మాత్రం టెస్టింగ్ క్యాట‌లాగ్ వెల్ల‌డించ‌లేదు. కానీ కోడ్‌లో కొన్ని ర‌కాల మార్పుల‌ను చేయ‌డం వ‌ల్ల ఈ ఫీచ‌ర్ గురించి తెలిసింద‌ని వివ‌రించింది. ఇక ఏఐ డిటెక్ట‌ర్ టూట్ ఇంకా స‌ర్వ‌ర్ స్థాయిలో యాక్టివ్ కాలేద‌ని, అందువ‌ల్ల దాని గురించి పూర్తి వివ‌రాలు తెలియ‌లేద‌ని తెలిపింది. టెస్టింగ్ క్యాట‌లాగ్ షేర్ చేసిన స్క్రీన్ షాట్‌ను ఓపెన్ చేస్తే మాత్రం ఆ లింకు ప‌నిచేయ‌డం లేద‌నే మెసేజ్ ద‌ర్శ‌న‌మిస్తోంది.

https://twitter.com/testingcatalog/status/2033217307497906213

టెక్ట్స్‌, ఫొటోల‌ను మాత్ర‌మే..

అయితే మెటా సంస్థ డెవ‌ల‌ప్ చేస్తున్న ఏఐ డిటెక్ష‌న్ టూల్ పూర్తి సామ‌ర్థ్యాల‌ను అంచ‌నా వేయ‌డం ప్ర‌స్తుతానికి క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ ఈ టూల్ ఏఐ కంటెంట్‌ను మెరుగ్గా గుర్తించ‌గ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏఐ ద్వారా జ‌నరేట్ చేయ‌బ‌డిన టెక్ట్స్ లేదా ఫొటోల‌ను గుర్తించ‌గ‌ల‌ద‌ని తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఏఐ జ‌న‌రేటెడ్ కంటెంట్ విప‌రీతంగా షేర్ అవుతున్న నేప‌థ్యంలో యూజ‌ర్ల‌కు అస‌లు విష‌యం, ఫేక్ వార్త‌లు తెలియ‌డం క‌ష్టంగా మారింది. అందువ‌ల్ల‌నే మెటా ఈ టూల్‌ను డెవ‌ల‌ప్ చేస్తుంద‌ని తెలుస్తోంది. అయితే ఏఐ ద్వారా జ‌న‌రేట్ చేయ‌బ‌డిన ఆడియో లేదా వీడియోల‌ను కూడా ఈ టూల్ గుర్తించ‌గ‌ల‌దా.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు.

ఇక మెటా త‌న ఏఐ అసిస్టెంట్‌లో షాపింగ్ అనే ఫీచ‌ర్‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే దీన్ని ప‌రీక్షిస్తున్న‌ట్లు స‌మాచారం. దీని ద్వారా చాట్ జీపీటీ, జెమిని వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌కు పోటీ ఇవ్వాల‌ని మెటా ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫీజుతో మెటా ఏఐ సేవ‌ల‌ను అందించేందుకు కూడా మెటా సంస్థ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ వివరాల‌న్నింటిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

Advertisement
Advertisement