Meta Enterprise Platform | మెటా కొత్త ప్లాట్‌ఫామ్.. వ్యాపారాల కోసం ఏఐ సేవలు..
Meta Enterprise Platform | మెటా సంస్థ వ్యాపారాలు, డెవలపర్లు తమ ఏఐ సాంకేతికతలను వినియోగించుకునేందుకు మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ మెటా వ్యాపారంలో కీలక విభాగంగా మారనుంది.
Technology | Published On Sep 29, 2026, 3.38 pm IST
Meta Enterprise Platform | మెటా సంస్థ వ్యాపారాలు, డెవలపర్లు తమ ఏఐ సాంకేతికతలను వినియోగించుకునేందుకు మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ మెటా వ్యాపారంలో కీలక విభాగంగా మారనుంది. ఏఐ మోడళ్లు, ఏజెంట్లు, భారీ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపార సంస్థలతో పనిచేసిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు మెటా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది మందికి మెటా సేవలు అందుతున్నాయని, అలాగే వందల మిలియన్ల వ్యాపారాలు తమ వినియోగదారులను చేరుకునేందుకు మెటా సేవలను ఉపయోగిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ప్రారంభ దశలో వ్యాపారాలు, డెవలపర్లకు తన పూర్తి ఏఐ సాంకేతికతల సమాహారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో మ్యూజ్ ఏజెంట్, మెటా బిజినెస్ ఏజెంట్, మ్యూజ్ ఏపీఐ, మ్యూజ్ కోడ్‌తోపాటు మెటా ఏఐ సాంకేతికతల సమాహారం ఉండనుంది.
వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ సేవలు..
మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ప్రధానంగా మెటా అభివృద్ధి చేసిన ఏఐ సాంకేతికతలను వ్యాపారాలు తమ కార్యకలాపాల్లో నేరుగా ఉపయోగించుకునేలా ఉత్పత్తులు, సేవలుగా అందించడంపై దృష్టి పెట్టనుంది. ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తుల్లో భద్రత, గోప్యత అంశాలను ప్రారంభం నుంచే అంతర్భాగంగా రూపొందించారు. మ్యూజ్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్లు మెటా తెలిపింది. వ్యాపారాల వృద్ధికి, కార్యకలాపాల్లో మార్పులకు ఏఐని ఉపయోగించుకునేలా ఈ ప్లాట్‌ఫామ్ సహాయపడుతుందని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌కు నాయకత్వం వహించేందుకు చిరంతన్ సీజే దేశాయ్ మెటాలో చేరనున్నారు. ఆయన చీఫ్ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి నేరుగా మార్క్ జుకర్‌బర్గ్‌కు రిపోర్ట్ చేయనున్నారు. అంతకుముందు ఆయన మొంగోడీబీలో సీఈఓ, అధ్యక్షుడిగా పనిచేశారు.
అన్ని రంగాలను మార్చేయబోతున్న ఏఐ..
ఏఐ, మౌలిక సదుపాయాలు, వ్యాపార అప్లికేషన్లు, భద్రత వంటి విభాగాల్లో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఫలితాలు సాధించిన అనుభవం సీజే దేశాయ్‌కు ఉందని మెటా పేర్కొంది. పరిశ్రమలో ఆయనకు విస్తృతమైన పరిచయాలు కూడా ఉన్నాయని తెలిపింది. మెటాలో చేరకముందు దేశాయ్ మొంగోడీబీలో సీఈఓ, అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు క్లౌడ్‌ఫ్లేర్‌లో ఉత్పత్తి, ఇంజినీరింగ్ విభాగాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. సర్వీస్‌నౌలో దాదాపు ఎనిమిదేళ్లు పనిచేసి అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. రాబోయే సంవత్సరాల్లో అన్ని పరిమాణాల సంస్థలు ఆవిష్కరణలు, వృద్ధి, కస్టమర్ సేవలు, వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే విధానాన్ని ఏఐ ప్రాథమికంగా మార్చనుందని సీజే దేశాయ్ అన్నారు. లక్షలాది ప్రకటనదారులు, వందల మిలియన్ల వ్యాపార సంస్థలకు విస్తరణలో సహకరించిన మెటా అనుభవంతోపాటు అధునాతన ఏఐ మోడళ్లు, ఏజెంట్లను కలిపి అందిస్తున్నామని తెలిపారు.
ఎప్పటి నుంచి..?
మెటా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వ్యాపార సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేలా ఉత్పత్తులు, సేవల రూపంలో అందించడమే మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ లక్ష్యమని దేశాయ్ చెప్పారు. వ్యాపారాలను విస్తరించుకునేందుకు సంస్థలు ఆశ్రయించే వేదికగా మెటాను నిలపడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మెటా కస్టమర్లతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాగా మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ప్రస్తుతం ధరలు, నిర్దిష్ట లభ్యత వివరాలను కంపెనీ వెల్లడించలేదు. తొలిదశలో వ్యాపారాలు, డెవలపర్లకు తన ఏఐ సాంకేతికతల సమాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడంపైనే దృష్టి సారించనున్నట్లు మెటా తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?
- ●Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?
- ●Indian Oil Packaged Drinking Water | ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ సొంత 'వాటర్' : అందుబాటులోకి ప్యాకేజ్డ్ తాగునీరు
- ●INDIA bloc meeting | రేపు ఇండీ కూటమి కీలక భేటీ.. ఆప్, డీఎంకే దూరం
- ●Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
- ●OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..

Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?

Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?

Indian Oil Packaged Drinking Water | ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ సొంత 'వాటర్' : అందుబాటులోకి ప్యాకేజ్డ్ తాగునీరు

INDIA bloc meeting | రేపు ఇండీ కూటమి కీలక భేటీ.. ఆప్, డీఎంకే దూరం






